Wednesday, January 4, 2023

ఒక భక్తుడు సాధన గురించి వివరించమని కోరాడు. దానికి రమణులు....

 *శ్రీ రమణ దివ్యభాషణము*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

✳️ *ఒక భక్తుడు సాధన గురించి వివరించమని కోరాడు. దానికి రమణులు....* 

✳️ *‘సాధన' అంటే ఇన్నిసార్లు మంత్రాన్ని జపించాలి అని, ఇన్ని రోజులు దీక్ష వహించాలి అని కాదు. అది దీర్ఘకాలిక ప్రక్రియ. ఒక విషయాన్ని సాధించేంత వరకు చేసేదే అసలైన సాధన. పని పూర్తయ్యేంత వరకూ మనసును పక్క విషయాలపైకి పోనివ్వకుండా అదుపులో ఉంచడమే ఏకాగ్రత. అది దైవం గురించి అయినా, నిత్య కర్మలకు చెందినది అయినా.* 

✳️ భౌతికంగా కనిపించే కళ్లను గాక, మనసు కళ్లు మూస్తే ఏకాగ్రత కుదిరి పనిలో నాణ్యత, వేగం పెరుగుతాయి. అప్పుడు తృప్తిగా కళ్లు తెరిచి పూర్తయిన పనిని సగర్వంగా చూడ గలుగుతాం. సాధనలో జరిగేది ఇదే. మనం ఎవరో తెలుసుకోవడానికి కళ్లు మూసి మనసులోకి తొంగిచూస్తాం. సాధన పరిపూర్ణమైన తర్వాత జ్ఞానంతో మూసిన కళ్లు తెరుస్తాం. అదే అసలైన సాధన’ అంటూ చెప్పారు.
     సరైన సాధన చేస్తూ నిత్యం నిరంతరం ఎరుక స్థితిలో ఉండడమే సరైన సాధన యొక్క ఫలితం.


🌈💫🌈💫🌈💫🌈💫🌈

No comments:

Post a Comment