*🌾నవవధులకు బుద్ధుడు చెప్పిన ఏడు విధులు.🌿*
*🌸ఒకరోజున తథాగత బుద్ధుడు ఉగ్రహుడనే గహస్థుడు(గృహస్థుడు అని అర్థం) తమ గహానికి(ఇంటికి అని అర్థం) భిక్షకు ఆహ్వానించగా బుద్ధుడు వెళతారు. తథాగత బుద్ధుని ఉగ్రహుడు ఇలా కోరుతాడు." తథాగతా...! నా తనయలు త్వరలో తమ భర్తల వద్దకు వెళతారు.కావున నా తనయలకు మీరు మంచి మాటలను చెప్పండి ,వారు సుఖసంతోషాలతో జీవితాలను గడపాలంటే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో మీరు చెప్పండి."అని అడుగుతాడు."*
*🌻అంతట తథాగత బుద్ధుడు ఈ విధంగా ఆ మహిళలను ఉద్ధేశించి చెప్పారు. " ఓ బాలికలారా ! నేను చెప్పిన ఈ ఏడు విధులను గనుక మీరు బాధ్యత తో నిర్వహించ గలిగితే మీ సంసారం సుఖశాంతులతో సాగుతోంది.సంసారంలో అందరి శ్రేయస్సు కోసం మీరు ఈ విధులను అలవాటు చేసుకోవాలి. అంటూ ఆ ఏడు విధులను తెలియజేశారు.*
*1.మీరు మీ భర్తల పట్ల అనురాగంతో తెల్లవారుజామునే నిద్రలేవాలి.*
*2.రాత్రి అందరూ నిద్ర పోయాక మీరు నిద్రించాలి.*
*3.మీరు మీ భర్తలను ,బంధువులను ,మిత్రులను గౌరవించి ఆదరించాలి.మీ భర్తల తల్లిదండ్రులను ఆదరించి శుశ్రూష అంటే సేవలు చేయాలి.*
*4.ఊలు లేక దూది వడకడం నెయడం వంటి గహ కృత్యాలను(ఇంటికి సంబంధించిన పనులను అని అర్థం) ఓర్పుతో, సహనంతో ,నేర్పుతో నిర్వహించాలి.*
*5.మీ పనివాళ్ళు ఎవరు ఏ పని చేయాలో తెలుసుకుని వారిచేత ఆ పని శ్రద్ధగా చేయించుకోవాలి. పనివాళ్ళు బలహీనులు అయితే కష్టమైన పనులు చేయించకూడదు.మీ దగ్గర పనిచేసే పనివాళ్ళకు రాత్రి మిగిలి పోయినవి కాకుండా సరైన ఆహారం ఇవ్వాలి.పనివాళ్ళతో ప్రేమగా, సౌమ్యంగా ఉంటూ ఇంటి పనులు చేయించుకోవాలి.*
*6.మీ భర్తలు తెచ్చే ఆస్తిపాస్తులు అవి బంగారం లేదా వెండి లేదా ధాన్యం మొదలైన వాటిని భద్రపరచాలి.వాటిని వృథా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దొంగల బారిన పడకుండా చూసుకోవాలి.*
*7.మీ ఇంటికి వచ్చే సన్యాసులను ఆదరించాలి. నిరుపేదలకు,అనాథలకు అన్నం పెట్టాలి.*
*🪷తథాగత బుద్ధుడు తన తనయులకు ఇచ్చిన మంచి బోధనలకు సంతృప్తి చెందిన ఉగ్రహుడు బుద్ధునికి నమస్సులు తెలిపాడు.*
*👉బాబాసాహెబ్ అంబేడ్కర్ తన "బుద్ధ అండ్ హిజ్ ధమ్మ" లో ఈ "ఉగ్రహ సూత్రాన్ని" కూడా ప్రస్తావించారు. అంబేడ్కర్ మీద గౌరవం గల వాళ్ళు ఈ ఏడు విధులను తమ ఇంట్లోని తనయులకు తెలియచేయాలి. అలాగే నవవధులు బుద్ధుడు చెప్పిన విధంగా కుటుంబ బాధ్యతలు చేపట్టగలిగితే సంసారంలో ఎలాంటి గొడవలు రావు.ప్రతి తండ్రి ,తల్లి తమ కూతుర్లను చిన్న వయసు నుండే తీర్చుదిద్దుకోవాలి.బుద్ధుడు చెప్పిన విధంగా తమ కుమార్తె లను యౌవన దశ నుండే తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.*
*🎋భవతు సర్వ మంగలమ్🌾*
No comments:
Post a Comment