వివేక వాణి ( తెచ్చుకోవలసింది బిక్ష కాని తిట్లుకాదు )
సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు .
మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది .
ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు .
పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు .
మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు .
పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు .
వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .
ప్రశ్న - సమాధానం
----------------
ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?
స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .
ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?
స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .
ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు .
స : నిజమే స్వామీ !
మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .( మనిషి నైజం ).
నీకంటూ ఒకరు ఉన్నారా
ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే
నీకు తెలియకుండానే ఇద్దరు ఉన్నారు
ఒకరు ( తల్లి )
మరొకరు ( దైవం )
.
ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి.
పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!
.
మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.
మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!..
90% అందరూ చేసే తప్పు ఇదే
ఏవో ఏమో కావాలని పరుగులు తీస్తారు జీవితం
చివరికి వారికి మిగిలింది
ఉట్టిపోయిన శరీరం
రోగాల కుప్పతో నిండిన శరీరం
చీదరించుకున్న కుటుంబ సభ్యులు
ఒక రోజు కబీర్ దాస్ ఒక ఊరిలో ఉండగా..
ఆ ఊరి ధనవంతుడు
తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు.
కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు.
వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ,
అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు.
‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.
తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’ అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు.
ఆత్మ, పరంగా అందరిలో ఉన్న
భగవంతుడు మాత్రమే శాశ్వతం.
ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు.
ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు.
మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...
No comments:
Post a Comment