Friday, January 20, 2023

::::: కోరుకునే వాడు::::::

 *:::::::::  కోరుకునే వాడు::::::::::*
        భౌతిక శరీరానికి చెందిన  ఇంద్రియాల ద్వారా  సుఖదుఃఖాలు సంభవిస్తాయి.
       సుఖం అయితే కావాలని, దుఃఖం అయితే వద్దు అనే *కోరిక* మనస్సు నందు పుడుతుంది.
    కోరిక నుండి *కోరేవాడు* పుడుతున్నాడు. 
*ఈ కోరుకునే వాడు ఎవరు.?*
    ఇది సుఖము, ఇది దుఃఖము అని పేరు పెట్టు తున్న మనస్సు లోని ఒక భాగాన్ని *సంజ్ఞ* అంటాము.
   ఈ   సంజ్ఞ జరిగిపోయిన అనుభూతికి  పేరు (ఆలోచన) పెడుతుంది. కనుక సంజ్ఞ అంటే *ఆలోచన*
       సంజ్ఞ లేకుంటే సుఖ దుఃఖాలు లేవు. 
       సుఖదుఃఖాలు  లేకుంటే కోరిక లేదు.
    అంటే కోరుకునే వాడు అనుభూతి చెందిన తర్వాత సంజ్ఞ తర్వాత ప్రవేశిస్తున్నాడు.
    అంటే ఇతడికి అనుభూతికి సంబంధం లేదు..
     వర్తమానపు, మనో శారీరక వ్యవస్థకు చెందిన అనుభూతికి,ఆ *క్షణాన* లేకుండా మరియి *ఆవలగా* వున్న ఈ కోరేవాడు కేవలం ఆలోచనే కాని *అస్థిత్వ* కాదు.
*షణ్ముఖానంద.98666 99774*

No comments:

Post a Comment