🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"436"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"ధ్యానం అనేది ఒక సాధనా విధానమా లేక ఫలితమా !?"*
*"ధ్యానం అనేది ఒక విధానం కాదు. శాంతిగా ఉన్నప్పుడు మనసుకున్న స్థితి పేరు ధ్యానం. ధ్యానం అనగానే కేవలం దైవపరమైన విషయంగా, ఆధ్యాత్మిక సాధనగా అనిపిస్తుంది. కానీ ధ్యానం నిత్యజీవితంలో అంతర్భాగం. ధ్యానం అనే పదం వినగానే అది మనకి సంబంధించినది కాదని, లేదా అది ఎప్పుడో ఒక ప్రత్యేక సమయంలో ఒంటరిగా కూర్చొని చేసే ప్రక్రియగా అనిపిస్తుంది. కానీ మన జీవితంలో శాంతి లభించే ప్రతిక్షణం జరుగుతున్నది ధ్యానమే ! ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని తనకిష్టమైన రూపాన్ని, నామాన్ని, విషయాన్ని స్మరిస్తూ ఇతరుల ఆలోచనలు ఏవీ రానిస్థితికి చేరుకుంటున్నాడు. ఆ స్థితిని అతను ధ్యానం అంటున్నాడు. అయితే ఒక పనిలో నిమగ్నమైన వ్యక్తి మరో ఆలోచన ఏదీ రానంతగా అందులో లీనమైపోతే పొందే శాంతి కూడా అలాంటిదే !"*
శ్రద్ధావన్ లభితే అన్నారు పెద్దలు, గురువులు.... ఏ పని చేసినా ఆ పని శ్రద్ధగా చేస్తే సరిపోతుంది...
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment