Xxx. Xxi. 1-6. 311222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఎదిగేకొద్దీ ఒదగాలి! - ఎలా?*
➖➖➖✍️
*మనిషి ఎంత ఎదిగినా ఒదిగివుండాలి కానీ అహంకరించకూడదు.*
*అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.*
*అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ దురభిమానం ఎప్పుడూ ఇబ్బందులు కలిగిస్తుంది.*
*సకలశాస్త్ర పారంగతుడిని అన్న అహంతోనే రావణాసురుడు తప్పు చేసి, శ్రీరాముని చేతుల్లో హతుడైనాడు.*
*దుర్యోధనుడు దురభిమానం తో తొడలు విరిగి నేలకూలాడు.*
*ఎంతటి తపోధనులైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపఃశక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి.*
*ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొంది, ఆయనను పాండవుల మీదికి పంపుతాడు.*
*సూర్య వర ప్రసాదంతో అక్షయపాత్ర ను పొందిన పాండవులు ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా వున్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఆ ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుంది. అది తిని భగవానుడు నా కడుపు నిండినది అని త్రేన్చగానే దుర్వాసునికి , అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్ట నిండిపోయి ఆయాసం తో అతలాకుతలం అవుతుంటారు.*
*ఆ సమయంలో ధర్మజుని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పుడు వారు ‘ఎవరి అండలో’ ఉన్నాడో ఆ లీలామానుష మూర్తిని గుర్తెరిగిన దూర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు.*
*అలాగే విశ్వామిత్రుడు కూడా.! ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజువులు మన పురాణ కథల్లో ఉన్నాయి.*
*పురాణాలు ..మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, చేయకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి.*
*మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోక శ్రేయస్సును పెంపొందిస్తారు.*
*నేను, నాది అన్న అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి ...*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment