*::::::::::: జన్మల పరంపర ::::::::::*
మనస్సు యొక్క సహజ స్థితి ప్రశాంతత, మరియు కేవలం తెలుసుకుంటూ వుండటం
ఎప్పుడైతే తెలుసు కున్న దాని చేత ప్రభావితం అవుతుందో, అప్పుడు మనస్సు తన,తెలుసు కోవడం అనే స్వభావాన్ని కోల్పోయి , తెలుసు కున్న దానివలే అవుతుంది. ఇది (మనస్సు) అది (తెలుసినది) అవుతుంది.
ఇలా మనస్సు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వున్నదానితో తాదాత్మ్యం చెందుతూ తూ ,అనగా దానిగా అవుతూ, అనగా దానిగా పుడుతూ, తిరిగి తన అసలు స్వభావంగా అవుతూ,అనగా మారిన దానిగా చనిపోతూ, వుంటుంది.
తిరిగి క్రొత్త అవతారం ఎత్తుతూ అనగా తెలిసిన దానివలే అవుతూ,అనగా దానివలే జన్మిస్తూ,జననం మరణ చక్రాన్ని త్రిప్పుతూంది.
ఉదా. తెలుసుకున్నది ఇష్టం అయితే తానే ఇష్టం అవుతూ,మరోక సందర్భంలో తెలుసుకున్నది రాగం అయితే తానే రాగంగా అవుతూ వుంటుంది.
ఇలా కాక తెలుసు కున్న దానిపట్ల కేవలం తెలివిడిగా,ఎడంగా, స్వతంత్రగా వుంటే జన్మల పరంపరని అరికట్ట వచ్చు. *షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment