Wednesday, January 11, 2023

11/01/2023 - లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి_* లాల్బహదూర్ శాస్త్రి గారి హత్య వెనుక రహస్యాలు ఓపికగా చదవండి. మీ పిల్లలకోసం దాచండి.

 [1/11, 07:15] +91 73963 92086: *_11/01/2023 - లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి_*

లాల్బహదూర్ శాస్త్రి గారి హత్య వెనుక రహస్యాలు
ఓపికగా చదవండి.  మీ పిల్లలకోసం దాచండి.

11 జనవరి 1966 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి హత్య  జరిగినరోజు. భారతీయులు సిగ్గుపడాల్సిన రోజు.  ఈ దేశపు ప్రథాని పరదేశంలో అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతే చావుకు కారణాలు వెదకకుండా ఆ దేశభక్తుడి శవాన్ని తగులబెట్టిన భారత రాజకీయాలకు భారతీయులు తలవంచినరోజు.  సిగ్గులేని బ్రతుకులు.  పోరాడడం తెలియనిబ్రతుకులు, ఇటువంటి జాతి బానిసత్వంలో ఉన్నదంటే ఉండదా...

ఆయన మరణం వెనుక ఏఏ శక్తులున్నాయి? 
ఎందుకు హడావిడిగా ఆయన శవాన్ని దహనం చేశారు? అనేది ఒక్కసారి విపులంగా పరిశీలిద్దాం.

అనుమానం కెజిబి తో మొదలౌతుంది.  ఆ సమయంలో రష్యా గూఢచార సంస్థ కె.జి.బి.  అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఎ రెండూ వారి వ్యతిరేకులను ఏరి ఏరి చంపి వేసేవారు.  ఇవి చేసే హత్యలు మూడవ కంటి తెలియకుండా జరిగేవి.  శాస్త్రి గారి మరణం వలన ఎవరికి ఎక్కువ ఉపయోగం.  మొదటి అనుమానం రష్యా గూఢచార సంస్థ కె.జి.బి పైకి వెళుతుంది.  ఎందుకంటే శాస్త్రి గారికి విడిది ఏర్పాటు ఒక పెద్ద భవనంలో ఏర్పాటు చేయబడింది.  ఆ భవనం చాలా పెద్ద భవనం, అనేక పెద్ద పెద్ద గదులు,  అన్ని సౌకర్యాలు ఆ భవనం లో ఉన్నాయి.  కానీ శాస్త్రి గారికి కేటాయించిన గదిలో బెల్ లేదు.  టెలిఫోన్ లేదు.  ఒక ప్రథాని కి కేటాయించిన గదిలో చాలా సాధారణమైన సౌకర్యాలు బెల్, టెలిఫోన్ ఇవి లేక పోవడం అనుమానానికి దారి తీస్తుంది.  అసలు పెద్ద పెద్ద హోటళ్ళలో వీరికి బస ఏర్పాటు చేస్తారు.  అలాంటిది ఒక భవనంలో విడిది ఎందుకు ఏర్పాటుచేశారనేది అనుమానం.

 ఇక రెండవ అనుమానం ఏ దేశపు ప్రథాని ఇతర దేశాలకు వెళ్ళినా ఆయన తోపాటుగా ఆయన రక్షణ పరివారం,  డాక్టరు, కార్యదర్శి,  వంటవాడు పనివారు అందరూ వెళతారు.  వీరికి ఏర్పటు చేసిన బస  బంగ్లాలో చాలా దూరంగా ఏర్పాటు చేశారు.  అరచినా వినిపించనంత దూరంలో వీరి బస ఏర్పాటైంది.  ఒక గది నుండి మరో గదికి వెళ్ళడానికి కనీసం 5 నిముషాల సమయం పడుతుంది.  అరచినా వినిపించనంత దూరంలో వారి బస ఎందుకు ఏర్పాటు చేయబడింది. మొదటి అనుమానం కె.జి.బి పైకి వెళుతుంది. కానీ రష్యా ప్రభుత్వం ఆయన దేహానికి పోస్టుమార్టం చేయించమని అడిగింది. అయినా పోస్టుమార్టం చేయించలేదు. కాబట్టి కె.జి.బి పాత్ర ఇందులో కొంత మాత్రమే అని అర్థమౌతుంది. 

 ఇక రెండవ అనుమానం ఇందిరా గాంధీ పైకి వెళుతుంది.  ఆయన పార్దివ దేహం భారత్ తీసుకువచ్చిన వెంటనే ఇందిరాగాంథీ నేతృత్వంలో ఆయన శవాన్ని ఖననం చేశారు.  పోస్టుమార్టం చేయించలేదు.  నిజ నిర్థారణకు కమిటీ వేయలేదు.  ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా శవాన్ని దహనం చేశారంటే దాని అర్థం ఏమిటి? అనుమానం వస్తుందా లేదా. లలితా శాస్త్రి ఒక పల్లెటూరి వనిత విషమిచ్చి చంపితే శరీరం ఏ రంగుకు మారుతుందో ఆమెకు తెలుసు. శవాన్ని చూడడం తోటె ఈయనకు విషమిచ్చి చంపారని ఆమె చెప్పింది. ఆయన శరీరం నీలం రంగులో మారి ఉంది. ఆయన శరీరం పై చాలా చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని లలితా శాస్త్రి చెప్పారు.  గుండె పోటుతో మరణించిన వ్యక్తి శరీరం నీలం రంగులోకి మారదు. గుండెపోటుతో మరణించిన వ్యక్తి శరీరం పైకి కత్తిపోట్లు ఎలా వస్తాయి?

 శాస్త్రి గారి శవాన్ని తాష్కెంట్ లో పరిశీలించిన డాక్టర్లు ఇచ్చిన  రిపోర్టు ఒకటి రష్యాకు పంపబడింది.  ఒకటి భారత ప్రభుత్వానికి ఇవ్వబడింది.  భారత ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో ఆరుగురు డాక్టర్ల సంతకాలు ఉన్నాయి.  రష్యాకు పంపబడిన రిపోర్టులో ఎనిమిది మంది డాక్టర్ల సంతకాలు ఉన్నాయి. డాక్టర్ల రిపోర్టు ప్రకారం రాత్రి 1.30 నిముషాలకు ఆయనకు ఒక ఇంజక్షన్ కండరాలకు ఇవ్వబడింది. మామూలుగా గుండెనొప్పితో ఉన్న వారికి ఇంజక్షన్ నరాలకు ఇవ్వబడుతుంది.  ఆయనకు ఆక్సిజన్ ఎందుకు ఇవ్వలేదు.  అక్కడ  అటువంటి పరికరాలు ఏవీ ఏర్పాటు చేయబడలేదు. ఎమర్జన్సీ పరిస్థితులను ఎదుర్కొనే వైద్య పరికరాలు ఏవి అక్కడ లేవు.  గుండెపోటు వస్తే దాన్ని రివైవ్ చేసే వైద్య ప్రకియ కూడా ఉంది కానీ అలాంటి ప్రయత్నమేదీ జరిగినట్లు మెడికల్ రిపోర్టులో లేదు. 

 శరీరం పైన అక్కడడక్కడా వైట్ పాచస్ ఉన్నాయి.  ముఖం పైన, పొత్తికడుపు పైన, ఛాతిపైన మరి కొన్ని చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి.  మరి గుండెపోటుతో మరణించిన వ్యక్తి శరీరం పైకి కత్తిగాట్లు ఎలా వస్తాయి. శాస్త్రి గారి తో వెళ్ళిన డాక్టరు పేరు చో. శాస్త్రిగారి మరణానికి ప్రథాన సాక్షి డాక్టర్ చో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన కుంటుంబం అంతా అంటే ఆయన భార్య, ఇద్దరు కొడుకులు ఆయన 1977 లో ఒక రోడ్డు ప్రమాదంలో  మరణించారు. ఆ కుటుంబంలో ఆయన కూతురు వికలాంగురాలై బ్రతికి ఉంది. అంతకు ముందే ఆయనను చంపడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. శాస్త్రి గారి శవాన్ని పరిశీలించిన డాక్టరు చాలా ప్రథాన సాక్షి ఆయన హత్య శాస్త్రి గారి హత్యను బలపరుస్తుంది.  శాస్త్రి గారి మరణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు లేదా సాక్షులు,  లేదా విషయం తెలిసిన వారు ఒకొక్కరే మరణించారు. సాక్షాలు లేకుండా చేయడం ఈ కుట్రలో ఒక భాగం.
[1/11, 07:15] +91 73963 92086: అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి న ఫైలు తొక్కిపెట్ట బడింది.

 ఇటువంటి సంఘఠనలు జరిగినప్పుడు మరణించిన వ్యక్తి తో ఉన్న అన్ని వస్తువులు ప్రభుత్వానికి తిరిగి చేర్చబడతాయి. ఈ వస్తువులలో శాస్త్రిగారు ఎప్పుడూ తనతో ఉంచుకునే ధర్మాస్ ఫ్లాస్క్ మిస్సయింది.  శాస్త్రిగారి అన్ని వస్తువులు శాస్త్రిగారి కుటుంబానికి ఇవ్వబడ్డాయి.  ఒక్క థర్మాస్ ఫ్లాస్క తప్ప. అది ఎక్కడుంది,  ఏమైంది అనేది నేటివరకూ కనుక్కోబడలేదు. ఆఖరి సారిగా ఆయన తాకిన వస్తువు ఆయన థర్మాస్, ఎప్పుడూ థర్మాస్ ఆయన తోటే ఉండేది.  ఆ థర్మాస్ ను తెరవాడానికి ప్రయత్నం చేసినట్లు గా అది క్రింద పడి ఉంది. అని రిపోర్టులో ఉంది.  అ ధర్మాస్ లో ఏమైనా కలిపారా అనేది కూడా ఒక అనుమానం.  అది కనిపించక పోవడం తో అనుమానం బలపడుతుంది. 

1960 దశకంలో సి.ఐ.ఎ.  కె.జి.బి లు ఎన్నెన్ని దారుణాలు చేశాయో చెప్పనలివికాదు.  మన ఆటమిక్ పరిశోధనా పితామహుడు హోమీ జహంగీర్ బాబా ను కూడా విమానం లో ప్రేలుడు సంభవించిందని చనిపోయాడని అది ఒక దుర్ఘటనగా చిత్రించారు. కానీ దీని వెనుక సి.ఐ.ఎ హస్తం ఉందని తరువాత వెల్లడైంది. ఆటమిక్ రీసెర్చ్ కోసం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా హోమీ బాబాకు పూర్తి సహకారాన్ని అందించారు. 11 జనవరి 1966 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి హత్య జరిగితే, 24 జనవరి 1966 లోనే హోమీ బాబా హత్యకూడా జరిగింది. రష్యా, అమెరికాలు ఇతర దేశాలు ఆటమిక్ ఫవర్ గా ఎదగడాన్ని  నిరోధించేవి. ఏ విధంగా నైనా అటామిక్ రీసెర్చ్ జరగకుండా అడ్డుకునేవి.
   
 ఒక రిటైర్డ్ సిఐఏ ఏజంట్ రాబర్ట్ క్రౌనీ  ఒక జర్నలిస్టు కిచ్చిన ఇంటర్యూలో స్వంయంగా చెప్పాడు. శాస్త్రిగారి హత్యలో హోమీ బాబా హత్యలో సిఐఏ హస్తం ఉందని.  హోమీ బాబా ప్రయాణిస్తున్న విమానం పైలెట్ తప్పిదం వల్ల కూలి పోలేదని అది బాంబు పెట్టి పేల్చబడిందని రాబర్ట్ క్రౌనీ వాగ్మూలమిచ్చాడు. 

మెడికల్ రిపోర్టులను మరికొంత విపులంగా పరిశీలిద్దాం.

రష్యా అక్కడ చాలా మందిని అరస్టుకూడా చేసింది.  ఆయనకు వంట చేసే వ్యక్తిని మరి కొంత మంది బట్లర్లను కూడా ఖైదు చేశారు. అతడి పేరు జాన్ మొహమ్మద్.  ఆసమయంలో రష్యన్ హైకమీషనర్ కౌల్ గారి వంటవాడు జాన్ మొహమ్మద్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోటి ఉంది.  శాస్త్రి గారు తన వంటవాడిని ఎల్లప్పుడూ తన తోటి తీసుకు వెళ్ళేవాడు. ఆయన పేరు రాంనాథ్. సరిగ్గా ఆరోజు వంటవాళ్ళు మార్చబడ్డారు.  ఆ రోజు శాస్త్రి గారికి ఆహారం వండింది జాన్ మొహమ్మద్.   అతనిని కెజిబి 30 కిలోమీటర్ల అవతలకు తీసుకువెళ్ళి విచారణ కూడా చేశారు.  కొన్ని సంవత్సరాల తరువాత ఈ జాన్ మొహమ్మద్ ను రాష్ట్రపతి భవన్ లో వంటవాడిగా అపాయింట్ చేశారు. ఇది చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది.

చివరిగా పోస్ట్ మార్టమ్ రిపోర్టు. 

పోస్టుమార్టం ఆనాడు చేయించి ఉంటే 50 సంవత్సరాల తరువాత ఈనాడు ఇన్ని అనుమానాలు వచ్చి ఉండేవి కాదు.  పోస్టుమార్టం చేయకుండా శాస్త్రి గారి శవాన్ని దహనం చేయడం తోనే అనుమానాలన్నీ మొదలౌతాయి.  అటల్ బిహారీ వాజ్పాయ్ మరియు మరి కొంతమంది నాయకులు నిజ నిర్థారణ కమిటీని వేయమని అడిగారు.   కానీ ఈ విషయం పై సీరియస్ గా విచారణ జరగలేదు.     తరువాత ఒక కమిటీ వేసి తూతూ మంత్రగా దాన్ని ముగించారు. వారు కూడా మొదట ఏది నిర్థారించ బడిందో అదే విషయాన్ని చెప్పి మమ అనిపించారు.  పదవుల కోసం ఎంతనీచానికి దిగజారుతారో శాస్త్రిగారి మరణం చెబుతుంది.  ఇక్కడి నేతలు ఇతరదేశాల గూఢచారులు కలిసి ఈ హత్యచేశారా. లేదా ఇంకేమైనా రహస్యాలు ఈ హత్య వెనుక దాగున్నాయా? ఎప్పటికైనా ఈ మరణం వెనుక నిజాలు ప్రజలకు తెలుస్తాయా? లేక అనేక మరణాల వలే ఇది కూడా కప్పబడిపోతుందా? కాలం చెప్పాల్సిన సమాధానం ఇది.  

ఇప్పటికీ కొన్ని సాక్షాలు మిగిలే ఉంటాయి.  కనీసం మోడీ ప్రభుత్వమైనా ఆ విషయాలకు వెలుగు చూపిస్తుందని ఆశిస్తూ....

 ఆ మహా నేత మరణానికి అశృనయనాలతో  భారత పౌరులు....

No comments:

Post a Comment