Friday, January 6, 2023

ఆధ్యాత్మిక భావనే బలం

 X6. X. 1-4.   070123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

        *ఆధ్యాత్మిక భావనే బలం*
                ➖➖➖✍️

*అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూసేందుకు ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు.* 

*మనోధైర్యాన్ని కలిగించే ఉపాయం చెప్పాలని కన్నయ్యను కోరారు వాళ్లు.*

*దానికి సమాధానంగా ‘ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు!’ అని చెప్పాడు నల్లనయ్య.* 

*సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైంది. జీవితం గొప్ప వరమనీ, సుఖశాంతులతో గడిపేందుకు లభించిన అపూర్వ అవకాశమనీ వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.* 

*అయితే మానవ మనుగడలో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఫలితంగా సహజంగానే వేదన, అలసట కలుగుతాయి. వాటిని అధిగమించి, మానసికంగా శారీరకంగా ఉత్తేజం, ఉత్సాహం పొందేందుకు మన పురాణాల్లో ఎన్నో మార్గాలను సూచించారు…*

*పారమార్థిక చింతన కలిగి ఉండి ఆధ్యాత్మిక భావనలు పెంపొందించు కోవడం వాటిలో ఒకటి. అంటే ధర్మబద్ధ జీవనాన్ని గడపడం.   ఈ క్రమంలో స్వార్థం, అసూయ, ద్వేషం, మోహం, కుట్ర, వంచన లాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు.* 

*అవసరమైనవారికి సహాయం, దానధర్మాలు చేయడం, సేవాతత్పరత అలవరచుకోవడమే ధర్మబద్ధ జీవితం.* 

*వీటి వల్ల శాంతి, ఆనందం కలుగుతాయి. మానసిక ఒత్తిడి, అలసట దరిచేరవు. ఎప్పుడైనా విసుగు కలిగినా నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని దెబ్బతీసే విషాదాన్ని దూరం చేసుకోవాలని రామాయణంలో అంగదుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి.* 

*భగవంతుడిపై భారం వేసి నిజాయతీగా నిర్మలమైన మనసుతో చేయాల్సిన విధులను నిర్వర్తించినప్పుడు తప్పకుండా విజయం వరిస్తుంది. అది నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది.* 

*మంచి మనసు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి.* 

*అసలు మానసిక వేదన, ఒత్తిడి అనే భావనలు కలగడానికి మనసే ప్రధాన కారణం. మనసు ఉన్నచోటనే స్వర్గాన్ని సృష్టించగలదు. నరకాన్నీ చూపించగలదు.*

*’అన్నిటికంటే వేగమైంది ఏది?’ అన్న యక్షుడి ప్రశ్నకు- ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు.* 

*అందుకే ముందు మనసును నియంత్రణలో ఉంచుకోగలగాలి. అందుకు ధర్మబద్ధ జీవనం, సాత్విక ఆహారం, ప్రాణాయామం, పరోపకారం లాంటివి తోడ్పడతాయి.*
                …I.L.N‌.చంద్రశేఖర రావు.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment