Monday, January 9, 2023

:::::: ధ్యానం "నేను" జరపని కార్యం :::::;

 *:::::: ధ్యానం "నేను" జరపని కార్యం :::::;*

     *మనస్సు*  అనేది శరీరం లో కలిగే సంవేదనలను, మరియు ఇంద్రియాలద్వారా  విజ్ఞానంను సేకరించి స్పందించే వ్యవస్థ.

 *దుఃఖం* అనేది మనస్సు పనిచేసే ఒకానొక విధానం వల్ల ఒకానొక సమయంలో  మనస్సు లో కలిగే వేదన.

            మనస్సు నందు పుడుతున్న సహజ స్పందన కానటువంటి దుఃఖం యెక్క పుట్టుకను , అందుకు కారణాన్ని, తెలుసు కోవడం, నివారించడం *ధ్యానం* చేసే పని.
    *కనుక ధ్యానం ఒక కార్య కలాపం.   అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు దానంతట అది జరిగే ఒక మానసిక కార్య కలాపం.*
      *ఆకాశంలో అనుకూల పరిస్థితి లో  కురిసే  వాన లాగా మానసిక క్షేత్రం లో సరైన పరిస్థితి లో ఏర్పడేది ధ్యానం , సరికాని పని విధానం వల్ల ఏర్పడేది దుఃఖం*
   *కర్త చేసే పని దుఃఖాన్ని ఇస్తుంది. చేయని ధ్యానం దుఃఖాన్ని అంతం చేస్తుంది*
   *కర్త చేసే ధ్యానం దుఃఖాన్ని అంతం చేయలేదు* 
*షణ్ముఖానంద. 98666 99774*

No comments:

Post a Comment