1210. 1-6. 100123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పూజ చేసేప్పడు చెడ్డ ఆలోచనలు*
➖➖➖✍️
*మంచి పనులుచేస్తున్న సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి... ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది...?*
*పూజ లేదా మంత్రం చేసేప్పుడు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మరో ఆలోచన గుర్తుకు వస్తుంది.*
*మనం రోజూ ఒకేరకంగా పూజ, జపం చేస్తున్నాం. కానీ జపంలో, పూజలో వచ్చే ఆలోచనలు మాత్రం ఏరోజుకారోజు మారిపోతూనేవున్నాయి.*
*అలా గుర్తుకు వచ్చే విషయాలన్నీ మన జ్ఞాపకాలే.*
*అవే జ్ఞాపకాలు మనం ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుకువస్తే బాధ కలగటం లేదు.*
*కానీ పూజలోనో, జపంలోనో గుర్తుకువస్తే మాత్రం బాధపడుతున్నాం.*
*మనం చేద్దామనుకున్నవి లేదా చేసినవే మనకు గుర్తుకు వస్తుంటాయి.*
*అవసరమైన జ్ఞాపకం గుర్తుకు రాకపోతే బాధపడుతుంటాం. అనవసరంగా (పూజలో) గుర్తుకు వచ్చినప్పుడు కూడా బాధపడతాం.*
*మనం చేద్దామనుకున్న మంత్రం ఒక జ్ఞాపకంగా చేయాలనుకోవటం మరో జ్ఞాపకం.*
*ఆ జపం చేస్తున్నప్పుడు గుర్తుకు వచ్చే పిచ్చి విషయాలు ఇంకో జ్ఞాపకం.*
*అవన్నీ నీవు కావాలనుకుంటేనే జ్ఞాపకాలుగా ఏర్పడ్డాయి.*
*అంతేగానీ మరెవరో వాటిని నీ మనసులోకి జొప్పించలేదు.*
*జ్ఞాపకంగా తీసుకుంటే మంత్రానికీ, ఆలోచనకు తేడాలేదు.*
*ఇకపోతే ఆచరించవలసింది ఏమిటంటే మన పొరపాటు వలన జరిగింది ఏదైనాసరే మరోసారి అలా బాధపెట్టే జ్ఞాపకంగా నిలిచిపోయే పనులు చేయకుండా ఉండాలి.*
*అది మరొకరి పొరపాటుకు సంబంధించినదైతే, మనం మార్చలేని విషయంలో జ్ఞాపకానికి విలువలేదని గుర్తించి వదిలివేయాలి!*✍️
- ----శ్రీరమణీయం నుండి...
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
అందరూ రమణుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ....🙏
No comments:
Post a Comment