100123a1726. 110123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀735.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*"నీకు కష్టాలు వస్తే కంగారు పడకు, నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు అని భగవంతుడి వచనం"*
*మనకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి పాడైపోయే ప్రమాదం ఉంది. మనకు ఏది మంచిదో మనకంటే భగవంతుడికే బాగా తెలుసు. మనకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోరాదు...*
*అన్నీ మనలోపల సౌందర్యం పెంచటానికి, మనలను మహోన్నతుడని చేయటానికి మాత్రమే... మనకు శిక్షణ ఇవ్వడానికీ, మన జ్ఞానం పూర్ణం చేయటానికి, ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే మనలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టరాదు...*
*చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా...*
*దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం... ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనల యందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం...*
*శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది...*
*అప్పుడే దేహం దేవాలయం అవుతుంది*.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment