Monday, January 2, 2023

*****ఆత్మసాధన

 [12/31/2022, 07:17] +91 73963 92086: ఆత్మసాధన

ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క విశిష్టత ఏంటి, ఆత్మ, పరమాత్మల సంబంధం యొక్క ముఖ్యాంశాలు.

ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు.
దాదాపు చాలా మందికి ఆత్మ అంటే
తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు
దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని
రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన
ఆత్మ స్వరూపాన్ని ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు
ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

ఎవరో ఒక తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..?

మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు 'ఎవరో ఒక మహా పురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవరిలో చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు.

నిజానికి ఆత్మ అంటే దైవమా, లేక దయ్యమా, ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరిని అయోమయంలో నెట్టేస్తున్నారు.

ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాల్లకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని చాల శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని ఎన్నో గుడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.
ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే.

ఏలాగంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పులేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. ( 2:19-25)
ఉపనిషతులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.

జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మతి సూక్ష్మం అది ఈ శరీరలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు (చుక్కలు) వెలుగు నీయవు.
మెరుపులు కూడ కాంతి నీయవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ ఉన్నది.
[12/31/2022, 07:18] +91 73963 92086: 1. ఆత్మ ఇది అని వర్ణించుట దుర్లభము ఎందుకంటే అంతా అదే, అన్నీ అదే!
2. అదితిగా వెలుగొందితున్నది ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములయందు నెలకొనియున్నది ఆత్మ!
3. చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్నదే ఆత్మ!
4. దేని దగ్గరకు మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదియే "ఆత్మ". ఈ ఆత్మనే బ్రహ్మము అని అంటారు.
5. ఎలాగైతే నీరు, వాయువు ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతములలో ప్రవేశించి ఆయా రూపములను ధరిస్తుంది.
6. ఎలాగైతే సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందో అలాగే ఆత్మ ఒక ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఉపాధి చైతన్యాన్ని పొందుతుంది.
7. ఆత్మ లేదా బ్రహ్మము శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షీభూతమైనది, అన్ని జీవులలో నెలకొనివుంటుంది.
8. జీవుని జ్ఞాననికి ఆధారంగా, సాక్షిగా ఈ ఆత్మచైతన్యస్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటి వుంటుంది.
9. ప్రతివిషయాన్ని సూక్ష్మబుద్ధితో/జ్ఞానంతో ఎవడు దర్శిస్తాడో అతడు ఆత్మను పొందుతాడు. ఆత్మద్వారానే జీవుడు వీర్యవంతుడవుతాడు. జ్ఞానము ద్వారానే జీవుడు అమరుడవుతాడు.
10. జీవాత్మకి, పరమాత్మకి ఉపాధి (body) విషయంలో బేధం వున్నప్పటికీ, ఇరువురిలో చైతన్యాంశ (ఆత్మస్వరూపము) మాత్రం ఒక్కటే!
11. పురమనగా శరీరము, అది పురుషునికి(ఆత్మకు) నివాసస్థానము. ఆ పురుషుని(ఆత్మను) ధ్యానించు వాడు ఎటువంటి దుఃఖమును పొందడు. శరీరం క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకు నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యంగా వుండి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది.
12. జీవాత్మకు ఈ దేహమే ఉపాధి!పరమాత్మకు ఈ విశ్వమంతా ఉపాధే!జీవాత్మల ఏకమే పరమాత్మ!
13. స్వప్న, జాగ్రదావస్థలలో ఏదీ విశ్వంతో ముడిపడివుంటుందో అదే పరమాత్మ. సకల జీవులలో అది జీవాత్మగా ప్రకాశిస్తుంది. జీవభావాన్ని పొందినవాడు, దానిని కలిగించువాడు కూడా పరమాత్మే.
14. ఏ శక్తితో గ్రహములు, నక్షత్రములు, ద్వాదశ సూర్యులు ఆకాశమున ఒక నిర్ణీతకక్షలో సంచరిస్తున్నాయో ఆ శక్తే పరమాత్మ. నిజానికి ఈ జగత్తు యొక్క తత్వమే పరమాత్మ. కాబట్టీ ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన బేధంలేదు.
15. పరమాత్మే జీవాత్మగా ఒక ఉపాధిని కల్పించుకొని వ్యక్తమయ్యేడు! ఉపాధితో కూడిన జీవభావము నశించినపుడు జీవాత్మ పరమాత్మగా బాసిస్తాడు.
16. అయమాత్మా బ్రహ్మ! జీవో బ్రహ్మైవ నా పరః! అహం బ్రహ్మాస్మి! అన్న ఉపనిషత్తుల వాక్యాలకు అర్ధమిదే!
17. ఎచ్చటనుండి జీవుడు వచ్చేడో, అక్కడికి తప్పకా చేరుకోవలసిందే! పరమాత్మనుండి వ్యక్తమైన జీవాత్మ (జీవుడు) మళ్ళీ పరమాత్మను చేరుకోవాలి! అదే జీవాత్మ అసలు స్వరూపము!
18. దానినే యోగము అన్నారు పెద్దలు! అలా చేరినప్పుడే వ్యక్తి జీవిత నాటకము సమాప్తమవుతుంది, అంతేకాని జీవుని మరణముతో సమాప్తము కాదు. జీవాత్మ, పరమాత్మతో యోగం కానంతసేపు జీవునికి జనన మరణాలు తప్పవు.
19. జీవుని పరమాత్మతో చేర్చునదియే జ్ఞానము. ఇది నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే సిద్ధిస్తుంది.
20. తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే "ఆత్మ సాక్షాత్కారము", "ఆత్మ దర్శనము", "భగవద్దర్శనము".
21. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ ఆత్మవస్తువును అనుభూతిపొంది బ్రహ్మానందాన్ని పొందుతాడు.

స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
ఆత్మ అంటే ఒక శక్తి .మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది. సంపుర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని, నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం...

#యోగా_ద్వారా ఏమేమి సాధ్యమో?!??!!
తల పైభాగాన్ని విశ్వం అని, ముందు భాగాన్ని నుదురు భాగం అని అంటారు.  కపాల్ భాగం విశ్వంలో సగం వరకు విస్తరించి ఉంటుంది.  రెండింటి సరిహద్దులో మెదడు యొక్క ప్రధాన స్థానం ఉంటుంది.

 విశ్వం యొక్క కేంద్రాన్ని బ్రహ్మరంద్రం అంటారు.  బ్రహ్మరంద్రం సూది బిందువు ఒకటితో సమానం
 చాలా ముఖ్యమైన రంధ్రాలు ఉన్నాయి.  అన్ని భావాలు, దివ్య ప్రపంచంలోని ఆలోచనలు, శక్తి మరియు శాశ్వతమైన శక్తి ఈ బ్రహ్మరంద్రం నుండి విశ్వంలోకి ప్రవేశిస్తాయి.  సాంప్రదాయ మతంలో, శిఖర (మంట) ఈ ప్రదేశంలో ఉంచాలి.  ఒక నియమం ఉంది.  బ్రహ్మం నుండి వెలువడే శక్తి జ్వాలల ద్వారా ప్రవహిస్తుంది అని.
[12/31/2022, 07:19] +91 73963 92086: మన జ్వాల ఒకవైపు శక్తిని ప్రవహిస్తున్నప్పుడు, అది మరోవైపు దానిని అంగీకరిస్తుంది.  వాతావరణంలో చెల్లాచెదురుగా ఉన్న అసంఖ్యాక ఆలోచనా తరంగాలు మరియు భావోద్వేగ తరంగాలు ఒకే మంట ద్వారా మానవ మెదడులోకి ప్రవేశిస్తాయి.  మన మెదడు జ్వాల లాంటి యాంటెన్నా లేదా ఏరియల్ ద్వారా ఒక రకమైన తరంగాన్ని స్వీకరించడానికి మరియు ప్రసారం చేయడానికి కేంద్రంగా పనిచేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

ప్రధాన మెదడు (సెరెబ్రమ్) పైన ఒక చిన్న మెదడు (సెరెబెల్లమ్) మరియు బ్రహ్మరంద్రం నకు దిగువన '#మెడుల్లా' అని పిలువబడే ప్రదేశం దానికి జోడించబడింది.ఈ ఓవల్ పదార్ధం నాసిరకం మెదడులో ఉన్న ద్రవంలో తేలుతూ ఉంటుంది.  ఈ అండాశయ పదార్ధం వెన్నెముక చివరి వరకు విడుదలవుతుంది.ఈ పదార్ధం చాలా రహస్యమైనది.  ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీనిని అర్థం చేసుకోలేరు.మానవ ఆలోచన, భావోద్వేగాలు, భావాలు, మెదళ్ళు మరియు సామర్థ్యాల ద్వారా బయటి నుండి ల్యాండ్‌స్కేపింగ్ శక్తులు అదే అండాశయంతో ఢీకొంటాయి.ఇది స్వయంచాలకంగా మారుతుంది మరియు చెదరగొట్టబడుతుంది.

యోగా ద్వారా అసలు మెదడు ఆకాశం ను చూసేవాడు, ఊహించేవాడు, కలలు కనేవాడు - ఈ ఆకాశంలో ఇవన్నీ అనుభవించాలి,అనుభవిస్తాడు.

స్వస్తి! ఓం శాంతి శాంతి
సర్వే జనా సుఖినోభవంతు! శాంతిః...
.

No comments:

Post a Comment