Monday, January 2, 2023

*****ధర్మసందేహాలు ప్రశ్న కి గురువు గారి సమాదానాలు

 🌻ధర్మసందేహాలు ప్రశ్న కి గురువు గారి సమాదానాలు🌻

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ప. జీవాత్మకు, పరమాత్మకు బేధం ఏమిటి?
గు. జీవుడు మాయాధీనుడు, 
దేవుడు మాయాధీశుడు! భావించడం జీవలక్షణం, 
చెయ్యడం దైవలక్షణం! 

జాగృత్, స్వప్న, సుషుప్తి అనేవి జీవుని అవస్థలు, 
సృష్టి, స్థితి, లయలు అనేవి పరమాత్మ అవస్థలు!

ప. జీవుడు దేవుడు అవ్వగలడా?
గు . తప్పకుండా అవ్వగలడు! 
జీవునికి, దేవునికి ఉపాధి బేధం తప్పా ఇంకో బేధంలేదు! దేహభ్రాంతిని త్యజిస్తే జీవుడు దేవుడు కాగలడు!..

ప. నేను, నాది అసలు అర్ధం ఏమిటి?
గు. జీవునికి సంబంధించి, నేను అంటే అహంకారం! నాది అంటే మమకారం! దైవానికి సంబంధించి నేను అంటే ఆత్మ, నాది అంటే చైతన్యం!

ప. అహం అంటే ఏమి? అహంకారం అంటే ఏమి? 
గు. అహం అనేది శుద్ధ చైతన్యం! దానికి రూపం లేదు! అది ఒక శరీరాన్ని ఆవహించినప్పుడు అహంకారంగా మారుతుంది! నేను అనేది అహం! నేను ఇది, నేను అది అనేది అహంకారం! 
అహం అనేది ఎప్పుడూ వుండేది, ఎప్పటికీ మారనిది! అహంకారం అనేది శరీరంతో పాటూ వచ్చేది, శరీరంతో పాటూ పోయేది! అహంకారం లేకుండా అహం వుండగలదు గానీ అహం లేకుండా అహంకారం వుండలేదు! సంకల్ప, వికల్ప వికారాలతో కూడినది అహంకారం, ఎటువంటి వికారాలు లేనిది అహం! అహంకారం అసత్యమైనది, అహం సత్యమైనది!

ప. అహంకారంతో ఆత్మసాక్షాత్కారం పొందగలమా?
గు. జ్ఞానంగా అగుపిస్తూ అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది అహంకారం! అజ్ఞానమైన అహంకారంతో సత్యమైన ఆత్మసాక్షాత్కారం పొందలేము!

ప. అహంకారం నుండి ఎలా బయటపడేది?
గు. అహంకారముయొక్క నిజస్థితిని గుర్తిస్తే, అది “అహం”గా మారిపోతుంది! అంటే అహంకారం లేని అహం బయటపడుతుంది! ఆత్మ “అహం, అహం” అంటూ అనుభవం లోకి వస్తుంది! అదే ఆత్మానుభూతి!..

ప. సచ్చిదానందము అంటే ఏమిటి? 
గు. జ్ఞానము యొక్క స్వరూపమే సచ్చిదానందము 
(సత్ + చిత్ + ఆనందము).
“సత్” అంటే నాశనము లేనిది, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో మార్పు చెందనిది!
“చిత్” అంటే జ్ఞానవంతమైనది, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో సర్వము గ్రహించేది!
“ఆనందం” అంటే దేనియందు ఆశలేని స్థితి, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలలో కూడా అనుభవించేది!

ప. జీవుడు సచ్చిదానంద స్వరూపుడేనా? 
గు. అవును! నూటికి నూరు పాళ్ళు సచ్చిదానంద స్వరూపుడే!

ప. జీవుడు ఈ సత్యాన్ని ఎందుకు గ్రహించడంలేదు?
గు. అజ్ఞానవశుడై దేహమే నేనన్న భ్రాంతితో తన నిజస్వరూపమైన సచ్చిదానందాన్ని మర్చిపోతున్నాడు! 

ప. ఈ భ్రాంతి నుండి ఎలా బయటపడాలి? 
గు. భ్రాంతి ఉన్నంతసేపూ బ్రహ్మము కనిపించదు! తన దేహంతో సహా ఈ జగత్తులో సత్యమైనది ఏదీలేదని తెలిసికూడా కర్తృత్వాన్ని తన నెత్తిన వేసుకుంటున్నాడు! దేహం నేనుకాదు అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ భ్రాంతి దానంతటదే తొలగిపోతుంది!..
.
ఆలోచనా రహిత స్థితి - నిర్వికల్ప సమాధి

ఆలోచన రహిత స్థితి కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఒక ఆలోచనే అని గ్రహించ వలెను.

ఆలోచనలు రావడం సహజం, ఆలోచనా రహిత స్థితి ని పొందడం జ్ఞాని లక్ష్యం, మనసు చంచలమైనది,  ఎంత  ప్రయత్నించినా ఎదో ఒక విధంగా ఆలోచనలు ప్రవేశిస్తాయి.

ఎన్నో జన్మల నుండి వదులటకు మనసు రాక చేర్చి వుంచుకున్న వి, సంస్కారంగా మారి, ఆలోచనా రూపం లో వస్తుంటాయి, పదే  పదే వాటినే తిరిగి తిరిగి ఈ జన్మలో కూడా చెయ్యమని ప్రేరే పిస్తుంటాయి, అంత ప్రీతి కలిగినవి అంత తొందరగా వదలి వెళ్ళలేవు, సమయం తో పని లేకుండా,  ప్రత్యేకంగా, ధ్యాన  సమయం లో కూడా వదల కుండా వాటి ( మాయ ) కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, అధో గతికి తీసుకు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతూంటుంది, మాయ గతి తీవ్రత వారి వారి పూర్వ జన్మ లోని సంచిత కర్మ ప్రకారమే అని గ్రహించ వలెను.

ఆలోచనల మూలాల్లోకి వెళ్లి వాటిని ఆత్మ విచారణ ద్వార జ్ఞానం తో , చైతన్యం కలిగి, వస్తున్న ఆలోచన అర్థ రహితం అని గ్రహించ గలిగితే వ్యర్తమైనాలోచనలు అని గ్రహించ గలిగితే , శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటిలో ఎదో ఒక రూపం లో మనలో ప్రవేశిస్తాయి,   అద్ధం మీద వున్న మురికి ( జన్మ జన్మ ల నుండి చేర్చి వుంచుకొన్నది, తిరిగి ఇప్పుడు కూడా చెరుస్తున్నది వధులటకు మనసు రాక ),  తొలగించినట్లు విషయ వాసనలు తొలగించిన, వచ్చిన పని ని ఈ జన్మ లోనే  ముగించిన, మరల జన్మ ఉండదు. 

పూర్వ జన్మ వాసనా బలం తీవ్రతను బట్టి వారి వారి ప్రయత్న తీవ్రతను , సరి అయిన సాధనా మార్గం ను అనుసరించిన ఏది సాధ్యం కానిది లేదు.   

పరమాత్ముడు,  విచక్షణ కలిగిన ఉత్తమమైన మానవ జన్మ ను ప్రసాదించారు, పూర్ణ చైతన్యం పొంది ఈ  జన్మలోనే జన్మ రాహిత్యం పొందడానికి ప్రయత్నించ వలెను.

🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁
.

No comments:

Post a Comment