:*::::::: జీవితం, సామర్థ్యం:::::::::::*
ఆధునిక జీవితం అడుగడుగునా,మన నుండి సామర్థ్యాన్ని కోరుతూంది. కారణం మనం ప్రకృతిలో కాక పోటీ ప్రపంచంలో జీవిస్తున్నాము కనుక..
నిజానికి జీవితమే ఒక సామర్ధ్యం. ఇది ప్రకృతి జీవికి ప్రసాదించిన కళ. సహజసిద్ధమైన జీవితం సహజాతాలతో కూడి వుంటుంది. సహజంగా జీవితం సాగుతుంది అంటే సామర్థ్యం ప్రకటిత మవుతుంది అని అర్థం. . సహాజాతాలను అణచి వేస్తున్నామంటే సామర్ధ్యాన్ని అణిచి వేస్తున్నామని అర్థం.
అనేక విషయాల పట్ల మన సామర్థ్యానికి సంబంధించిన అనుమానాలు మనలను ఆందోళనకు గురి చేస్తుంది. ఆధునిక ప్రపంచం కోరుకునే సామర్థ్యం నిబద్దతతో నిండినది.
ఆనందంగా జీవించడానికి కావలసిన సామర్ధ్యం స్వేచ్ఛా జీవితంతోనే సాధ్యం.
ధ్యానం స్వేచ్ఛగాజీవించనిస్తుంది
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment