Tuesday, May 21, 2024

 #వృద్దురాలైన ఒక  తల్లి రాత్రి 11:30 గంటలకు వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తోంది, ఇంట్లో ఇద్దరు కోడళ్లు  ఉన్నారు,కానీ,వారు సహాయం చేయరు అటుపై గిన్నెలు కడుగుతుండగా వచ్చే  శబ్దంతో అసౌకర్యానికి గురిఅయ్యారు  వారు వెంటనే తమ భర్తతో మీ అమ్మకు గట్టిగా చెప్పండి ఈ సమయంలో ఇలా చేయడం వలన మా నిద్ర పడవుతుంది అని..  
ఇంత రాత్రి వరకూ  పాత్రలు కడగడం అపమని మీ అమ్మను  ఆపండి, మేము  నిద్రపోలేక పోతున్నాము అని  చెప్పారు.అదే కాక  తెల్లవారుజామున 4 గంటలకు లేచి పండుగకు పూజలు చేస్తారు కూడా అని వాపోయారు...

ఆరతి చేసిన తర్వాత రాత్రి లేదా ఉదయం నిద్రించడానికి అనుమతి ఉండదు..  వెళ్ళు, నువ్వు వెళ్లి, మీ  అమ్మను శబ్దం చేయకుండా ఆపండి అని కోడళ్లు ఆర్డర్ వేశారు...

 పెద్ద కొడుకు లేచి వంటగది వైపు వెళ్ళాడు.  వచ్చే దారిలో తమ్ముడి గది నుండి  కూడా  ఏవో మాటలు వినిపిస్తున్నాయి.   

కాసేపటికి అన్నదమ్ములిద్దరూ వంటగదిలోకి వెళ్లి, పాత్రలు శుభ్రం చేయడంలో తల్లికి సహాయం చేయడం మొదలుపెట్టారు, తల్లి వారిస్తోంది వారిని,  , పాత్రలు శుభ్రం చేసిన తర్వాత, ఇద్దరు సోదరులు తల్లిని ప్రేమగా ఆమె గదికి తీసుకువెళ్లారు, ఆ సమయంలో   నాన్న కూడా మేల్కొనే ఉన్నారు.

అన్నదమ్ములిద్దరూ అమ్మను మంచం మీద కూర్చోబెట్టి, అమ్మ పొద్దున్నే లేవండి, మనం కూడా పూజ చేయాలి, ఉదయాన్నే నాన్నతో కలిసి యోగా చేస్తాం అని చెప్పారు.అమ్మ వారితో  ఫర్వాలేదు నాన్నా అని చెప్పి  పంపించింది, కొడుకులిద్దరూ పొద్దున్నే లేచారు, రాత్రి 9:30 కే  పాత్రలు శుభ్రం చేయడం మొదలుపెట్టారు, అప్పుడు వారి  భార్యలు మీ అమ్మగారు ఉన్నారుగా వారు ఏం  చేస్తున్నారు అని అడిగారు,మీరు, ఎందుకు పాత్రలు శుభ్రం చేస్తున్నారు అని అడగగా? చూడండి, మేము పెళ్లి చేసుకోవడం వెనుక ఒక కారణం ఉంది మా  తల్లికి కొద్దిగా ఐనా కోడలు సహాయం చేస్తుందని అని  కొడుకు వారితో  చెప్పాడు.  కానీ మీరు ఈ పని చేయడం లేదు,అందుకే, మేము మా అమ్మకు సహాయం చేస్తున్నా ము.

ఇది జరిగిన మూడు రోజుల్లో ఇంట్లో పూర్తిగా మార్పు వచ్చింది.  లేకుంటే భర్తలు పాత్రలు శుభ్రం చేయడం మొదలు పెడతారు కాబట్టి కోడళ్లు ముందుగానే పాత్రలు శుభ్రం చేయడం మొదలుపెట్టారు.  అదే సమయంలో, వారు కూడా ఉదయాన్నే తమ భర్తలతో లేచి పూజలు మరియు ఆరతులకు హాజరు కావడం ప్రారంభించారు.

 కొద్దిరోజుల్లోనే ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది.  కోడళ్లు అత్తగారికి, మామగారికి పూర్తి గౌరవం ఇవ్వడం ప్రారంభించారు..

 కోడలు గౌరవించనప్పుడు తల్లి గౌరవం తగ్గదు.  కొడుకులు తల్లిని గౌరవించనప్పుడు లేదా తల్లి పనికి సహకరించనప్పుడు తల్లి గౌరవం తగ్గుతుంది.

 పుట్టుకతోనే వారితో మీకు  సంబంధం ఉంది.ఎవరికైనా సరే తల్లిదండ్రులే మొదటివారు.

No comments:

Post a Comment