Saturday, May 4, 2024

*****భయం అంటే...

 *శ్రీ గురుభ్యోనమః*
 💐💐💐💐💐
*శుభోదయం*

*భయం అంటే...*

*భయం అనేది ఈ క్షణం నీలో పుట్టి, మరుక్షణం పెరిగి, మరి కొన్ని క్షణాల్లోనే నీలో పూర్తిగా  వ్యాపించే వైరస్, నిన్ను పూర్తిగా కబళించే ఒక అనకొండ లాంటి భావన లేదా ఆలోచన....*  

*భయం పుట్టిన మరుక్షణం నిన్ను పూర్తిగా తన అధీనంలోనికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.. ధైర్యం కూడగట్టుకోవడానికి చేసే ప్రయత్నాలను విఫలం చేయడానికే చూస్తుంది..   భయం అనేది మనసులోకి రానేకూడదు. వచ్చిందా దానికి ఆహారం అయిపోతావు.* 
*అందుకే అది ముందు వదిలించుకునే ప్రయత్నం చేయాలి...* 


*భయాన్ని ఎలా వదిలించుకోవాలి?*

*భయాన్ని వదులుకోవాలి అంటే దానిని ఎదుర్కోవడం ఒక్కటే మార్గం...... అప్పుడే దాని వికృత రూపం మాయమవుతుంది...*

*ఒక చిన్న కథ ఒకటి ఇక్కడ చెప్పుకుందాం.*. 

*ఒకసారి నరేన్ (వివేకానందుడు) తన చిన్నతనంలో దారి వెంట నడుస్తున్నప్పుడు ఒక కుక్క వెంటపడింది. కుక్కను చూసి భయపడ్డ నరేన్, కాళ్ళకు పని చెప్పారు. కుక్క ఎంత స్పీడ్ గా పరుగెడుతుందో తెలుసు కదా.. అంత స్పీడ్ గా తాను పరుగెత్తలేక ఒక్క క్షణం ఆగి చూశాడు, అది కూడా ఆగింది. మళ్ళీ పరుగెత్తాడు.. అది కూడా వెంట బడింది. అలసిపోయి  మళ్ళీ ఆగాడు. అది కూడా ఆగింది. ఈసారి నరేన్ కు ఒక  ఆలోచన వచ్చింది. అది నన్నేదైనా చేసేదే అయితే మొదటిసారి ఆగిన వెంటనే మీద పడి కరిచేయాలి. అలా చేయలేదు. నేను ఆగితే అదీ ఆగుతుంది.  అంటే ఏమై ఉంటుంది? ఇలా క్షణం సేపు ఆలోచించి, రివర్స్ లో కుక్కవైపు తిరిగి,  దాని వైపు అడుగులు ముందుకు వేశాడు. ఆ వెంటనే కుక్క నరేన్ వైపు రాకుండా వెనుదిరిగి పారిపోయింది.*  

*భయం కూడా అంతే... "భయపడితే ఇంకా ఎక్కువ భయపెడుతుంది."  ఎదురు తిరిగి, నాకెందుకు భయం? దేనికి నేను భయపడుతున్నాను అనే ఆలోచన గనక నీలో ఉత్పన్నం అయితే అది నీలోనుండి మాయమై పోతుంది.* 

*దీన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే భయం మనల్ని ఆవహించే ప్రతిసారీ ఈ టెక్నిక్ ఫాలో అయి, దాన్ని దూరం చేసుకోవచ్చు ..* 


*భయానికి కారణం ఏమిటి?* 

*భయం కలగడానికి చాలా కారణాలు అని మనం అనుకుంటాం. కానీ కామ్యమైన కోరిక ఒక్కటే కారణం. అంటే ఫలితాన్ని ఆశించి, ఏదైనా పొందాలనుకోవడం.    ఫలితం గురించి ఆలోచన వచ్చినప్పుడు అది దక్కుతుందో లేదో అన్న సందిగ్ధత, అనుమానం, అది దక్కించుకునే ప్రాసెస్ లో మనం ఎదుర్కొనే పరిస్థితులు భయానికి దారి తీస్తాయి.* 
*అందుకే జగద్గురువైన  శ్రీకృష్ణుడు భగవత్ గీతలో  "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చ నా" అన్నాడు. అంటే కర్మ మీదనే కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు అని అర్థం.*

*చేసే కర్మ మన చేతుల్లో ఉంది. ప్లాన్ ప్రకారం దాన్ని సక్సెస్ వైపు మాత్రమే మనం నడిపించే ప్రయత్నం చేయగలం. "మనసు పెట్టి చేశాను, మనసు పెట్టి చదివాను, అయినా ఫెయిల్ అయ్యాను -  అనే మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం." దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది?  - కర్మ ఫలితం సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు.  మన చేతుల్లో లేని విషయాన్ని మన చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ, మన చేతుల్లో ఉంటుందా లేదా అనే సందిగ్ధతతో, అనుమానంతో భయాన్ని మనమే పుట్టించుకుంటున్నాము*
 
*నిష్కామ కర్మ ఒక్కటే నిర్భయానికి మార్గం.*

*ఫైనల్ గా...*

*భయం అనేది మిత పదార్థం వల్ల కలుగుతుంది... మితమైన దానిని పొందాలనుకున్నప్పుడు భయం ఉత్పన్నం అవుతుంది... నీ దగ్గర ఉన్నది అమితమైనప్పుడు మితమైన దానిని కోరుకోవడంలో అర్థమే లేదు...* 

*ఓం నమో భగవతే రమణాయ*🙏

No comments:

Post a Comment