Sunday, September 8, 2024

 వినాయక స్వామి ప్రతిష్టించి 11.రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం మన సనాతన సంప్రదాయం ధర్మం ఆచరించడం అభినందనీయం... కానీ కొందరు అతిఉత్సాహంతో... ఆధ్యాత్మిక భక్తి పాటలు పెట్టకుండ... అశ్లీల సినిమా పాటలు... ఆశ్లీల విభిన్న రూపాల్లో ప్రతిష్టించి "పండుగ "పవిత్రత ని ధర్మాన్ని "బ్రష్టు"పట్టించడం శోచనీయం... మరో ఘోరమైన... తప్పిదం...11.రోజులు పూజానంతరం... బ్రహ్మాండమైన "ఊరేగింపు"తో... బయలుదేరి... అందుబాటులో వున్న  చెరువు నీటిలో  "వొదిలివేయడం"జరుగుతుంది. దాన్ని పవిత్రంగా "నిమజ్జనం"అని అనాలి. కానీ కొన్ని వార్త సంస్థ ఛానల్స్... తెలుగు ఒకటే కాదు పర భాషవారు సైతం... "విసర్జన"అని అనడం... అపవిత్రం... దయచేసి ఎవరైనా సరే... నిమజ్జనం... అని మాత్రమే... సంభోదించాలి... పద ప్రయోగం లో పొరపాటు జరగకుండ జాగ్రత్త పడాల్సింది గా నా మనవి... 🙏💐🕉️💐🙏

No comments:

Post a Comment