Monday, September 16, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹ఈ విశ్వం విశాలము - అనంతము. అంటే అర్ధం - ఎంత వున్నదో ఊహించటానికి కూడా వీలుకాదు అని. మనకు కనపడిన, వినపడిన, తెలిసినవే మనకు సత్యాలు. ఈ విశ్వములో మనతో పాటుగా అనేకం వున్నాయి. వాటిలో కొన్ని మనకు తెలుసు. ఆ తెలిసిన విశ్వమే మన సత్యము. మనకు తెలియనది అనంతముగా వున్నది - అందులో తెలియనవి అనంతముగా వున్నవి. తెలిసినవి, తెలియనవి అన్నీ విశ్వ నియంత్రణలో సాగుతున్నవి. అన్నిటికి ఒక పద్దతి, విధానము, క్రమశిక్షణ వున్నది అన్నది మనకు విశ్వ పరిశీలనలో తెలుస్తున్నది. ఆ క్రమశిక్షణలోనే అన్నిటితో పాటుగా మనము వున్నాము అన్న మరుపులేని ఎరుకే జ్ఞానము. నేను వేరు కాదు - ఎప్పటికి పూర్తిగా తెలియబడని - మానవ పరిధికి కొంత మాత్రమే అర్ధమయ్యే - అనంత సృష్టిలో నా భావన, నా ప్రయత్నము, నా అనుభవము - అన్నీ పరిమితము - ఆ అపరిమిత అనంత, అఖండ, సర్వవ్యాపక - పూర్తిగా తెలుసుకోలేని, తెలియబడని సృష్టిలో - నేను కలిసే వున్నాను - కలిసే సాగుతున్నాను - ఎప్పటికి కలిసే వుంటాను అన్న ఎరుకే జ్ఞానము. ఇదే ఆధ్యాత్మికత. ఈ సత్యం గ్రహించిన ప్రతి ఒక్కరు వేరు భావన లేక సృష్టి సహజముగా జీవిస్తారు. ఈ సహజత్వములో సత్య అంగీకారమే తప్ప విభేధము, విరోధము,బాధ, భయము లేని సహజ ప్రశాంతత ఉంటుంది. అదే అంతిమ ఆధ్యాత్మిక సత్యము. ఇది కేవలం పరిశీలించి,తెలుసుకొని, అర్ధం చేసుకోవలసిన జ్ఞాన విషయమే తప్ప - ఇక్కడ ఎటువంటి మాయలు, మహిమలు వుండవు. ఈ విషయాలు అర్ధమయ్యేలా చెప్పేదే ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక స్వీయ చదువు.🌹god bless you 🌹

No comments:

Post a Comment