Saturday, September 21, 2024

🌹గుడ్ మార్నింగ్ 🌹మంచిగా బ్రతకటము ఎంత తెలికైనా విషయమో.... వున్నది ఉన్నట్లుగా ఉండటమే... నిజం చెప్పటం మన శరీర సహజ లక్షణం. ఎందుకంటే మన లోపల మనకే తెలిసే విషయం కనుక. న్యాయముగా, నిజాయితీగా జీవించటం చాలా తేలిక. కారణం మన లోపల మనకు సత్యము తెలుసు కనుక. అన్నీ మనకు తెలుసు. ఆ తెలిసిన వాటి ప్రకారం సహజముగా, వున్నది ఉన్నట్లుగా జీవించటమే మంచి. మంచి అంటే మనషికి సంబంధించిన అన్నిటిలో నిజాయితీగా ఉండటమే. ఇదే నిజము. 

కాని ఈ నిజములో ఎందుకు వుండలేమో?  ఇది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. మంచికి, సత్యానికి, పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. సహజముగా జీవిస్తే చాలు. అసత్యానికి, చెడుకు చాలా ప్రయత్నం కావాలి....

అంతరంగములో పుట్టిన నిజాన్ని  మార్చి అసత్యం చేసి బయటకు పంపాలి. ప్రతి అసత్యములో, అన్యాయములో, అధర్మములో - ఇలాగే మనలో పుట్టిన సహజ సత్యాన్ని మారుస్తూ బయటకు పంపాలి. ఆ మార్చి బయటకు పంపిన దానిని గుర్తుంచుకోవాలి. మళ్ళీ అలాగే ప్రవర్తించాలి.......

చెడుగా ఉండాలి అంటే మంచిగా ఉండటం అనే సహజ ప్రక్రియకు అనేక రెట్లు కష్టపడాలి. ఈ కష్టం చాలామందికి సహజమై పోయింది. తక్కువ శ్రమ కలిగిన సహజ మంచి అసలు ఆనవాలే లేకుండా ఎగిరిపోయింది.

ఈ స్థితికి కారణం వెతికితే ఉన్నదానికంటే ఎక్కువ కావాలన్న కోరిక తప్ప వేరే ఏమిలేదు.........

అయితే ఇక్కడ మనిషి వెర్రితనం, అజ్ఞానం ఎంత స్థాయిలో వున్నదో తెలుస్తున్నది.

జనన మరణాలు, మధ్యలో బ్రతకటానికి అవసరమైన సమస్తము సమకూర్చి బ్రతికిస్తున్న సృష్టిని మరచి - నా అసత్యాలతో - నా అధర్మాలతో, నా చెడు తెలివితో,క్రియలతో, నాకు నచ్చినట్టు ఆనందముగా బ్రతకవచ్చు అనుకోవటాన్ని మించిన అజ్ఞానం అసలు ఉంటుందా....

మనం సృష్టిలో ఒక చిన్న దూళి కణము. ఈ సత్యము తెలుసుకున్న మహనీయులు చెప్పిన సత్యమే -  ధర్మో రక్షతి రక్షితః - మంచిగా జీవించు - నీకు మంచే జరుగుతుంది. ఇది సృష్టి సూత్రము. 🌹god bless you 🌹


Source link -  http://youtube.com/post/UgkxTomPg-X5skq5uffnn2dDT9rjS-iJKaKu?si=1bnOROKJg-aMbALi

No comments:

Post a Comment