Saturday, November 30, 2024

మనసు తీరు తెలుసుకో!

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*

  *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

       *మనసు తీరు తెలుసుకో!*


*మనిషి ఒక్కోసారి ఉన్నది పోగొట్టుకొని బాధపడతాడు. అర్హత లేకపోయినా లేనిదాని కోసం ఆరాటపడి, అహరహం శ్రమించి పని సాఫల్యం చేసుకుంటాడు. కార్యం సఫలం కాకపోతే ఖిన్నుడవుతాడు. నిజానికి తాను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేప్పుడు ఏమి తెచ్చాడని, తాను ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడాలి?! చిన్న పిల్లలు చూసిన ప్రతిదీ కావాలని మారాం చేస్తారు. ఏమీ తోచనప్పుడు ఏడుపు లంకించుకుంటారు. అప్పుడు వారు ఆడుకొనేందుకు తల్లి ఏదో ఒక ఆట వస్తువును ఇస్తుంది. సహజంగా సగటు మనిషి మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వాన్ని పోలి ఉంటుందంటారు వైజ్ఞానికులు! మనిషి సహజ రీతిలో బాల్యం నుంచి కౌమార, యౌవన దశలకు చేరుకున్నవాడే. పసిబిడ్డలకు కావలసిన ఆట వస్తువులు పెద్దలకు అక్కరలేదు.*


*కొందరు పెద్దలు శిశు మనస్తత్వంతో పెద్దపెద్ద కోరికలే కోరుకుంటారు. భారీ కోరికలు సులభంగా తీరేవి కాదు కాబట్టి మనిషి అసంతృప్తితో జీవించ వలసి వస్తుంది. అలౌకిక ఆనందాన్ని పొందగల జ్ఞానశక్తి, బుద్ధి కుశలత ఉండికూడా మానవుడు దుఃఖితుడై ఆనందానికి దూరం కావడం నిజానికి విచారించవలసిన విషయం! భయం, కోపం, అసహ్యతా భావం, లోభం, పరవస్తు వ్యామోహం వంటివి రజో గుణ, తమోగుణ ప్రధాన లక్షణాలు! వీటికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు బోధిస్తాయి. సాత్విక గుణ సంపన్నత, సాధించి తీరవలసిన అంశం. సత్వ రజస్తమో గుణ లక్షణాలకు అనుగుణంగా దేహం ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అనుభవాలు వస్తాయి. అవే సుఖదుఃఖాలు! మనిషి తీవ్రంగా భయపడినప్పుడు రోగలక్షణాలు పొడచూపుతాయి. చిత్తం ప్రశాంతమైనప్పుడు రోగాలు పూర్తిగా అదుపులో ఉంటాయి. భయం విసర్జనీయ లక్షణమని శాస్త్రాలు చెప్పిన అంశాన్ని మానవ దేహం రుజువు చేస్తున్నదా అన్నట్లు ప్రశాంత చిత్తాన్ని సాధించిన సాధకుడు ఆందోళనలు తగ్గి ఆనందభరిత జీవనం చేస్తాడు. భారతీయ తత్వచింతన, శాస్త్ర పరిజ్ఞానం ఒకే బండికి కట్టిన ఎద్దుల్లా సమన్వయం చెంది ముందుకు సాగడం సనాతన ఆధ్యాత్మికవాదులు హర్షించే విషయం! కల్మషాలు తొలగించిన అనంతరం పరిసరాలు పరిశుభ్రమై ఆహ్లాద భరితమైనట్లు త్రిగుణాల్లోని దోషాలు తొలగిన అనంతరం సాధకుడి చిత్తస్థితి నిర్మలమై అమందానందానుభూతితో ప్రకాశిస్తుంది.*


*యోగా అధ్యాపకులు అభ్యాస సమయంలో శరీరంలో జరిగే మార్పులను గమనించమని విద్యార్థులకు చెబుతారు. శ్వాస నియంత్రణ భంగిమల వల్ల రక్త ప్రసరణలో ఆరోగ్యానికి మేలు చేసే సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని యోగశాస్త్రం చెబుతుంది. మనుషులందరూ ఒకే అవయవ అమరిక కలిగిఉన్నా స్వభావరీత్యా వారివి భిన్న మనస్తత్వాలు. కొందరు కలుపుగోలువారు. మరి కొందరు ముభావ స్వభావులు. కొందరు మనసులోని మంచి భావాలను వెల్లడించి తోటివారి మనసులు చూరగొనే అవకాశం వచ్చినా తమ అభిప్రాయాలను పంచుకోరు. సానుకూల మనస్తత్వ శోభితులు ఇంకొందరు, ఎదురుపడినవారిని పలకరించకుండా ముందుకు సాగరు. ఆప్యాయతలను వ్యక్తపరచడం వల్ల బంధాలు బలపడతాయి. మనసు చంచలమేగానీ అది మాయా మర్మం ఎరగనిది. లోకానికి వెల్లడి కాకపోయినా అది మన నుంచి మనకు బోధపడగల ఏ సత్యాన్నీ దాచదు. మన (ఆత్మ)తీరుకు అనుగుణంగా మనసును మలచుకొని రాజమార్గంలో నడిపిస్తే అది కష్టాలను కొని తేదు. ఇరుకు దారుల్లో దాని పయనం సాగనీయకపోతే మన మనసు వల్ల మనకే కాదు, ఎదుటివారికీ కష్టాల బెడద ఉండదు. జీవితం శుభప్రదమై ఆనందాలు వెల్లివిరుస్తాయి.*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

పంచభూత లింగములలో ఐదవ వాయులింగం - శ్రీకాళహస్తీశ్వరుని గురించి తెలుకుసుకుందాం...!!*

 *పంచభూత లింగములలో  ఐదవ వాయులింగం - శ్రీకాళహస్తీశ్వరుని గురించి తెలుకుసుకుందాం...!!*
🕉️🚩🚩🕉️

🌸శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది.

🌿తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది, ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది.

🌸బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ - I తరువాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు.

         🌹  క్షేత్ర పురాణం  🌹

🌿సువర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగం, లింగానికెదురుగా వున్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు.

🌸ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రాలయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చతురస్రంగా వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం.

🌿వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

🌸కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది.

🌿భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

🌸ఈ దేవాలయం చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరం ఉంది.. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రంను, తారకమంత్రంను ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం.

🌿దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రం స్థాపించారు.

🌸ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

🌹దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు  🌹

🌿ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది.

🌸ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది.

🌿ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం

       🌹  ఆలయ విశేషాలు  🌹

🌸స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.

🌹 శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం  🌹

🌿ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి.

🌸దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.

  🌹  నాలుగు దిక్కుల దేవుళ్ళు  🌹

🌿గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు.

🌸ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం.     🌿పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు.

🌸శ్రీకాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగము).

🌿స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

            🌹  గోపురాలు  🌹

🌸ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు.

🌿జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని,

🌸ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి.

🌿స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

🌸ఇతర శివలింగాలు, పరివార దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు.

🌿భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి.

🌸వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

🌿ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

         🌹  మంటపాలు  🌹

🌸ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని.

🌿నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

      🌹  రాహు కేతు క్షేత్రం   🌹

🌸ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట.

🌿ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

          🌹  మంటపాలు  🌹

🌸దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది.

   🌹 పాతాళ గణపతి ఆలయం 🌹

🌿ఈ ఆలయమునకు ప్రవేశ ద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.

🌸పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి.

🌿చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది.

🌸అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.    🌿మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

🌸మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు.

🌿పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఆనవాయితీ గా మారింది..స్వస్తి.. 🚩🌞🕉️🙏
 🌄 *జై శ్రీమన్నారాయణ* 🌄
🔯 *శుభమస్తునిత్యం* 🔯
                        RAMANA'M 
 🌱 *సర్వహిత సద్వచనం* 🦜

🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷


     🌱 నేటి మంచిమాట 🌱

🌸1) ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.🪷

🌿2)  వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.🪷

🌸3)  అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.🪷

🌿4) జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.🪷

🌸5)  భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.🪷

🌿ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.🪷

🌸జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.🪷

🌿అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.🪷

🌸వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.🪷

🌿 ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.🪷

🌸కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి.🪷

🌿 దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు.🪷

🌷అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. 
అదే దైవ సాక్షాత్కారం అంటే...🪷

🌻 *జై శ్రీమన్నారాయణ* 🌻
 *పెద్దలకు సవినయ నివేదన*

సభ్యులకు నమస్కారములు .

సృష్టికే ప్రతి  సృష్టి చేయగల కలియుగ  మానవుడు  కలి దుష్ప్ర భావమును నిర్వీర్యము చేయ సంకల్పించి *ఓం సర్వేషాం స్వస్తిర్భవతు! సర్వేషాం శాంతిర్భవతు! సర్వేషాం పూర్ణ: భవతు!సర్వేషాం మంగళం భవతు!సర్వే సంతు సుఖినః!సర్వే సంతు నిరామయాః!సర్వే భద్రాని పశ్యంతు!మా కశ్చి దుఃఖ భగ్బవేత్!లోకాః సమస్తాః సుఖినో భవంతు!సర్వే జనాః సుఖీనో భవంతు!సమస్త సన్మంగళాని భవంతు* అంటూ కార్యాచరణకు పూనుకున్నాడు.

 *అనుష్టానము ఒక్కటే వర్తమాన దోష నివారకము, ప్రపంచ శాంతి కారకము, మరియు  సర్వారోగ్య ప్రదాయకమని మానవుడు విశ్వసించుచున్నాడు*. 
భగవత్ కార్యాలలో *అనుష్టానం అను పదం వాడడం సర్వ సాధారణము. కాని, అనుష్టానం అను పదం యొక్క అర్థం విపులంగా పరిశీలిద్దాము. తోటి వారిని సంతోష పెట్టడం, తోటి వారి కన్నీరు తుడిచే కార్యమేదైనా అనుష్టానమే. ఫలానాలా చేస్తేనే అనుష్టానం అని గిటిగీసి చెప్పడానికి వీలులేని విస్తృతమైన  అర్థం కల పదం అనుష్టానం*. సమాజ హితం కోసం ఏకాగ్రతతో నిరంతరం చేసేదే అనుష్టానం. *మన స్థాయిలో సమాజానికి ఉపయోగపడేలా మనం చేసే ప్రతిదీ అనుష్టానమే*.

ఆధ్యాత్మిక, పరమాత్మ, పారమార్థిక చింతనలో చతుర్వర్ణాలలో  బ్రాహ్మణులు ముందంజలో ఉండి ఇతర వర్ణాలకు మార్గదర్శకులుగా వ్యవహరించుచున్నారు. బ్రాహ్మణులంటే కుల బ్రాహ్మణులు మాత్రమే కాదు. అనేకార్థాలతో పాటు  *బ్రహ్మ* పదమునకు మరియొక అర్థము *వేదము*. వేదమంటే *జ్ఞానము*.  ఈ పదము నుండియే *బ్రాహ్మణ*  శబ్ద ముద్భవించినదని భావించ వచ్చును. కాబట్టి వేదాధ్యయనము చేసిన వారెవరైనా బ్రాహ్మణ శబ్దమునకు అర్హులు. అనాదిగా వేదాధ్యయనము సాగించుచున్న ఆయా వంశీకులందరు బ్రాహ్మణులుగా పిలువ బడుతున్నారు. ప్రస్తుత కాలంలో అధిక శాతం బ్రాహ్మణులందరు కుల బ్రహ్మణులుగా జీవిస్తున్నారు. *అవుతే, కుల బ్రహ్మణులుగా మాత్రమే మిగిలిపోకుండా లోక కళ్యాణానికై  గుణ మరియు జ్ఞాన బ్రాహ్మణులుగా ఎదగాలి*.

కొన్ని కొన్ని ముఖ్య విషయాలలో జాతి నిద్రావస్థలో ఉన్నప్పుడు జాతిని మేల్కొలిపి, సరి ఐన మార్గ దర్శనం  గావించే మహానుభావులను *వైతాళికులు* అని, *సమాజోద్దారకులు* అని,
*మహాత్ములు* అని
 *గౌరవంగా సంబోధించడం* వారి వృత్తి ప్రవృత్తిని యువతరం ఆదర్శంగా తీసుకోవడం అనుసరించడం
 ఆనవాయితి. కులం ఏమైతే నేమి మనుసులొకటై మనుగడ సాగించిన నాడు జాతికి పునర్వైభవం ప్రాప్తిస్తుంది. గత చరిత్ర పరిశీలించినప్పుడు వైతాళికులుగా బ్రాహ్మణులతో బాటు ఇతర వర్ణం/ కులస్తులు కూడా ఉన్నారు. వీరందరూ నిరంతర  సమాజ సేవా కార్యక్రమాల్లో  నిష్ణాతులైందున వైతాళికులుగా కీర్తి పొందినారు. వారి మార్గదర్శకాలు మనకందరికీ అనుసరణీయములైయున్నవి.

ధన్యవాదములు.
(సశేషము)
 షోడశ సంస్కారాలు~
సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.

సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:

1) గర్భాదానం.
స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.

2) పుంసవనం.
స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

3) సీమంతం.
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

4) జాతకర్మ.
బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:

మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.
ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.
శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.
5) నామకరణం.
నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:

మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;
రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;
మూడవది ఇలవేలుపును బట్టి;
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.
చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.

6) నిష్క్రమణ.
బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

7) అన్నప్రాశన.
మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు.

ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.

8) చూడాకరణ.

పుట్టు వెండ్రుకలు తీయించడం.
పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

9) కర్ణవేధ.
చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:

క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,
దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.

10) అక్షరాభ్యాసం.
బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.

11) ఉపనయనం.
అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;
వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;
గరిష్ఠ వయోపరిమితి:

బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;
వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

12) వేదారంభం.
అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది:

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,
మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,
నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.
1) కేశాంతం.
పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది.

ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

14) సమావర్తనం.
చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

15) వివాహం.
హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.

వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

16) అంత్యేష్టి.

హిందూ మతం అంత్యక్రియలకు
హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.

దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.

ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.

శాంతికర్మ

స్మారకం

శ్రాద్ధం

సపిండాకరణ.           
 Vedantha panchadasi:
భీష్మాఽ స్మాదిత్యేవమాదావస్గఙ్గస్య పరాత్మనః ౹
శ్రుతం తద్యుక్తమప్యస్య క్లేశకర్మాద్యసఙ్గమాత్ ౹౹107౹౹

107.  ఈశ్వరుని వలని భీతిచే ప్రకృతి ప్రవర్తించునని శ్రుతి చెప్పును.ఈశ్వరుడు అసంగుడైనను జగన్నియామకుడు.క్లేశకర్మాదులు ఈశ్వరుని స్పృజింపవు గనుక జగత్ర్పభుత్మము ఈశ్వరునికి తగియున్నది.తైత్తిరీయ ఉప.2.8.1 కఠ ఉప.2.3.3. నృసింహతాపనీయ ఉప.2.

జీవానా మప్యసంగత్వా త్ల్కేశాదిర్న హ్యథాపి చ ౹
వివేకాగ్రహతః క్లేశకర్మాది ప్రాగుదీరితమ్ ౹౹108౹౹

108.  ఆ మాటకు,జీవులు కూడా అసంగులగుటచే క్లేశకర్మాదుల వారిని కూడా అంటవు.కాని తమ నిజ స్వరూపమును గూర్చిన అజ్ఞానము వలన ప్రకృతి వికారములైన బుద్ధ్యాదులతో తాదాత్మ్యమును భావించుకొని క్లేశాదులతో సంబంధపడును.
చూ.100 వ శ్లోకము.

వ్యాఖ్య: ఏ యుగంలోనైనా పరమాత్మ యొక్క రూపకల్పనతోనే సృష్టి జరుగుతుంది. హిరణ్యగర్భుడు యుగాలు మారినా పరమేశ్వరుని మాయామయ స్వరూపంగా తన శక్తిని కోల్పోడు.ఈశ్వరాదులు యధావిధిగా వారి కార్యప్రపంచ నిర్మాణాన్ని కొనసాగిస్తుంటారు.

పరబ్రహ్మకు మహాప్రళయంలోనూ అంతం ఉండదు.అలాగే శబ్దం నిత్యం అనాది అని అంగీకరించటం వల్ల వేదవాక్కు అవిచ్ఛిన్నంగా పరబ్రహ్మము నుండి సంప్రాప్తమవుతుంది.

సంసారంకూడా అనాది కాబట్టి జగత్ సృష్టి కల్పాంతంలోను,పునః పూర్వ రూపంతో ఆవిర్భవించి కొనసాగుతుంది.
సుషుప్తిలోంచి జాగ్రదవస్థకు వచ్చిన వ్యక్తి తన పూర్వప్రజ్ఞను కోల్పోకుండా ఎలా సామాన్యంగా కార్యకలాపాలు చేసుకుంటాడో అలాగే ప్రళయాంతంలో అనిత్యాలన్నీ నశించినా, ఆద్యాంతాలు లేని నిత్యమైనవి ఉంటాయి.

సుషుప్తిలో పురుషుడు ఆత్మ పరమాత్మతో ఐక్యంపొంది, హృదయంలో శ్రోత్రాది ఇంద్రియ వ్యవహారం
(చక్షుశ్శోత్రం మనోవాక్కులు)అంతా లీనమైపోయి వ్యక్తంకావు.తిరిగి మెలుకువ వచ్చిన వెంటనే మండుతున్న అగ్ని విస్ఫులింగాల్లా ఆత్మ నుండి సర్వత్ర తిరిగి వ్యాపించి,ఇంద్రియాలు వాటి యొక్క అధిస్ఠాన దేవతలు యథాప్రకారం వాటి కార్యకలాపాలు కొనసాగిస్తాయి.

ఇంద్రియములు గ్రహించె గుణము కలవి.కోరికలు లేకపోతే ఇంద్రియములు లకు పనే లేదు.కోరికల యొక్క ఇంద్రియముల యొక్క వ్యాపారాన్ని నడిపేదే మనస్సు. బుద్ధి వలనే భోక్తృత్వం;కర్మఫలం భోక్తను చేరుకోవటం జరుగుతుంది.

అందువల్ల మనస్సు కంటే బుద్ధి గొప్పది.ఆత్మ బుద్ధి కంటే మహత్తైనది.ఆత్మయే రథాన్ని అధిరోహించిన రథికుడు-ప్రభువు.

శరీరాదులందు రథాది రూపకల్పన చేసి శరీర,ఇంద్రయ,మనో బుద్ధులు, కోరికలు,భోగములు వీటన్నిటితో కూడి ఉన్న భోక్త సంసారగతిని పొంది భోగములను అనుభవించటానికి ఎంత అవకాశమున్నదో,అంతే అవకాశం భోగత్యాగంతో నివృత్తి మార్గంలో మోక్షసాధనకు సంసారబంధ విముక్తితో "పరమగతి"ని పొందటానికి ఉంది.

ప్రత్యగాత్మయే నువ్వు,నీ కర్మ ఫలసాక్షి నీ హృదయ స్థానంలో ఉన్న ప్రత్యగాత్మయే అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్ధేశ్యం.     
 

🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
చక్రార్ధ నిరూపణ/ షట్చక్ర నిరూపణ - 5

          విశుద్ధ చక్రం

📚🖊️ భట్టాచార్య

విశుద్ధ చక్ర ఉనికి : 

ఈ విశుద్ధ చక్రం కంఠానికి చెందిన, స్వరపేటిక ప్రాంతంలో ఉంటుంది.
ఇది మన శరీరమందలి చోటును అంటే ఆకాశ తత్వాన్ని నియంత్రణ చేస్తుంది.

 ఈ చక్రాధిష్ఠాన దేవత పేరు ‘‘వజ్రేశ్వరి ’’. ఈ దేవత ఒకే ఒక ముఖంతో పాటల వర్ణం (తెలుపు, ఎరుపుల మిశ్రమం) లో ఉంటుంది. మన శరీరమందలి సప్త ధాతువులలోని ‘త్వక్’ అనగా చర్మ ధాతువునకు అధిదేవతగా ఉన్నది.

లలితా సహస్రం - విశుద్ధ చక్రం :

లలితా సహస్రంలో విశుద్ధ చక్ర వర్ణన ఇలా ఉంది...

శ్లో  విశుద్ధి చక్ర నిలయా రక్త వర్ణా త్రిలోచనా ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా 

శ్లో || పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ 
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ ||

ఇక్కడి వ్యాహృతి : 

  " ఓం జనః ". 

శ్రీ చక్రార్చనలో ఈ చక్రాన్ని  " సర్వార్థ సాధక చక్రావరణ " అని చెప్తారు.

విశుద్ధ చక్ర వర్ణన : 

ఈ విశుద్ధ చక్రంలో ఒక త్రికోణం ఉంది. అందు వృత్తాకార మండలము కలదు. దీనిరంగు తెలుపు. ఇది ఆకాశ తత్వం కలది. ఇందులో కర్మేంద్రియమైన వాక్కు. శబ్దతన్మాత్ర కలవు. అంటే వినిపించేటట్లు చేసే తత్వం. దీనిపైన వర్తుల ఆకారంలో చంద్రమండలము నందు ఆకాశబీజమైన ‘హం’ ఉన్నది. ఈ బీజం తెల్లని రంగులో ఉండి పాశం ధరించిన ఏనుగుపైన కూర్చుని ఉంది. ఈ బీజం (హం) ఒడిలో వృషభ వాహనముపై అధిష్ఠించిన సదాశివుడున్నాడు. ఈయన అర్ధనారీశ్వర రూపం కలిగి ఉన్నాడు. పురుషరూపం తెల్లగాను, స్త్రీ రూపం బంగారు వర్ణంగాను ఉన్నారు.

 ఈయన ఐదుతలలు, పది చేతులతో, శూల, టంక, వజ్ర, ఖడ్గ, అగ్ని, నాగేంద్ర, అంకుశ, పాశ, ఆయుధములు, అభయ ముద్ర ధరించి ఉన్నాడు.

 ఈ సదాశివుడు శరీరమంతా భస్మం ధరించి, పులి చర్మం కట్టుకుని మెడలో నాగాభరణాలు ధరించి ఉన్నాడు. ఆయన తలపై నున్న చంద్రరేఖలో నుండి అమృత బిందువులు ఊరి ఫాలభాగముపై జారుతున్నాయి. చక్రకర్ణికలోని చంద్ర మండలములో అస్తి ఆసనంపై ఈ చక్రాధిష్టాత్రియైన ‘‘శాకిని’’ అధిష్ఠించి ఉంది. 

విశుద్ధ చక్ర అధిష్ఠాన దేవత :

 వజ్రేశ్వరి ( ఈ దేవత ఒకే ఒక ముఖంతో పాటల వర్ణంతో ఉంటుంది )

ధాతువు : సప్త ధాతువులలో చర్మ ధాతువుకు ఈ వజ్రేశ్వరి అధిదేవత.

విశుద్ధ చక్రంలో ఒక త్రికోణం ఉంటుంది. అందులో వృత్తాకార మండలం ఉంటుంది. దీని రంగు తెలుపు. ఇది ఆకాశ తత్వం కలది. ఇందులో కర్మేంద్రియమైన వాక్కు, శబ్ద తన్మాత్ర కలవు.

విశుద్ధ చక్ర సాధన : 

విశుద్ధ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదనములకి సంబంధించి...ఆయా సాధకుల సాధనను అనుసరించి...సాధనా స్థితులు వస్తాయి.

ఈ చక్ర ఉద్దీపనకై ‘‘హం’’ అనే బీజ మంత్రం నిరంతరం ఉచ్ఛారణ చెయ్యాలి. అలాగే ఈ చక్రము యొక్క దళముల యందు గల బీజాక్షరాలు కూడా నిరంతర ఉచ్ఛారణ వలన , ఈ చక్రం జాగృతమవుతుంది.  ఈచక్రం యొక్క శక్తికి అవరోధం కలిగించే విషయములు ఇతరులను తిట్టుట, అరచుట, అసూయ చెందుట, మొదలగు గుణములు. ఒకసారి శ్వాసపీల్చి వదిలితే, ఈ చక్రము నందలి నాడులు వేయిసార్లు స్పందిస్తాయి. మధురంగా పాడగలగడం, మృధువైన స్వరంతో మాట్లాడగలగటం, మొదలైన విభూతులు, విశుద్ధ చక్రం సక్రమంగా పనిచేయడం వల్లనే లభిస్తాయి. విశుద్ధి అంటే శుభ్రం చేయడం.

విశుద్ధ చక్ర జాగృతి, సిద్ధి పొందిన యోగి స్వర సిద్ధి పొందుతాడు. అపరిమితమైన ఊహాశక్తిని సృజనాత్మక శక్తిని పొందుతాడు.

ఈ విశుద్ధ చక్ర శుద్ధి అవుతున్న క్షణాన...కొంత మంది ఉన్నత స్థాయి సాధకులకు, " హం " అనే మధ్య బీజాక్షరము గల 16 దళాల కమలము గోచరించింది.

విశుద్ధ చక్రం - మంత్రానికి స్పందన :

 ఈ విశుద్ధ చక్రం మంత్రోచ్ఛారణలకు స్పందిస్తుంది.

" హ్రీమ్ " మంత్రోచ్ఛారణతో ఈ చక్రాన్ని ఉద్దీపింపజేసుకోవచ్చును.

ఈ చక్రము నందు 1000 నాడులు కలవు. ఒక సారి శ్వాస పీల్చి వదిలితే ఈ వేయి నాడులు స్పందిస్తాయి.

విశుద్ధ చక్రం - కూర్మ నాడి : 

విశుద్ధ చక్రంలో "కూర్మ నాడి " ఉంటుంది. ఈ కూర్మనాడిని చైతన్యవంతం చేయగలిగితే ఆకలి దప్పికలు తగ్గిపోతాయి. ఖేచరి ముద్రలోని ఆంతర్యం ఇదే.

 ఈ చక్రం జాగృతమైతే వచ్చే అనుభూతులు :

విశుద్ధ చక్ర సిద్ధి అయినవాడు, ఆకాశ ధారణ ముద్రలో సిద్ధి పొందినచో, ఆకాశ గమన సిద్ధి పొందగలడు.

విశుద్ధ చక్రం జాగృతమయ్యేటప్పుడు త్రికాలజ్ఞానం పెరుగుతుంది.
 భూత, భవిష్యత్తు వర్తమానాలను   చెప్పగల శక్తి వస్తుంది.

 యోగ సాధనలో నిరాహారంగా ఉన్ననూ, జీవించి ఉండే శక్తి వస్తుంది. ఇతరుల ఆలోచనలను గ్రహించగలరు.

విశుద్ధ చక్రంలో కుండలినీ వికాసం కలిగితే, ఇతరుల మనో భావాలు తెలుసుకునే సిద్ధి వస్తుంది. త్రికాల జ్ఞానము అనగా  " భూత - భవిష్యత్ - వర్తమాన కాలాల జ్ఞానం " కలుగుతుంది.

 మానవ శరీరంలో గల షట్చక్రాలు నేరుగా ఒకదానితో మరొకటి
 అనుసంధానమై ఉంటాయి. ఈ చక్రాలన్నీ ఒక దానికొకటి పరి పూరకాలు. 

విశుద్ధ చక్రం - స్వాధిష్ఠాన చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక చక్రం బలహీన పడితే, తత్సంబంధ చక్రం కూడా బలహీన పడుతుంది.

వీటిని ఎండోక్రైన్ వ్యవస్థ (endocrine system) నిర్వహిస్తుంది. ఈ ఎండోక్రైన్ వ్యవస్థ - చక్ర వ్యవస్థ పరస్పర పరి పూరకాలు.

సప్త చక్రాలు (సహస్రారం తో కలిపి) కాంతి మండల ప్రాంతం మరియు మెరిడియన్ వ్యవస్థల (meridian system) మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా విభిన్న శక్తి స్థాయిల్ని ( energy levels ) ఏర్పరుస్తుంది. ఈ శక్తి భౌతికంగా శరీరంలోనికి ప్రవహించడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది.

విశుద్ధ చక్ర వర్ణన : విశుద్ధ చక్రానికి 16 దళాలు గల వాగ్దేవి శబ్దాలయిన అచ్చులు ఉంటాయి.

అవి " అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, ఋం, ౠం, లుం, లూం, ఎం, ఐం, ఓం, ఔం, అం, అః "

ఈ విశుద్ధ చక్రపు బీజ మంత్రం " హం ".

లౌకిక సంబంధాల నుండి విడివడి అలౌకిక విషయాలతో అనుసంధానమయ్యే చక్రమే " విశుద్ధ చక్రం ".

ఈ విశుద్ధ చక్ర దళాలలో ప్రతి దానికి బిందువుంటుంది.

ఈ విశుద్ధ చక్రం సదాశివునికి స్థానమైనది.

ఈ చక్ర తత్వం : ఆకాశ తత్వం

ఈ చక్రం మన శరీరమందలి చోటును ( space ) అనగా ఆకాశతత్వాన్ని నియంత్రిస్తుంది.

 విశుద్ధ చక్రం బాగు లేకపోతే : విశుద్ధ చక్రం క్రియాత్మకంగా లేనట్లయితే థైరాయిడ్ సమస్యలు వస్తాయి, ఎక్కువగా లేదా తక్కువగా చురుగ్గా ఉండటం, ఆతురత ( బహళ చక్ర సమస్య, అయితే ఇది ప్రధానం గొంతు చక్రానికి సంబంధించినది), ఆస్తమా, ఊపిరితిత్తుల్లో నిమ్ము, వినికిడి, ధనుర్వాతం వంటి సమస్యలు ఏర్పడతాయి... ఇవి ఆజ్ఞా చక్రానికి సంబంధించిన సమస్యలకు కూడా అనుసంధానం అవుతాయి.

 ఈ చక్రం సమంగా పనిచేయకపోతే,  జీర్ణ వ్యవస్థ లోపాలు, నోటిపుండ్లు, గొంతులో పుండు, గొంతులో కాయలు ఏర్పడతాయి. ఈ చక్రంలో అడ్డంకులు ఉంటే, ఆత్మ స్థైర్యం లోపిస్తుంది. వెన్నెముక సమస్యలు కూడా వస్తాయి. వాటి నుండి బయట పడడానికి సింహ గర్జన, సింహాసనం సాధన చేయాలి. ఈ సాధన వల్ల గొంతులో కఫం పేరుకుపోవడం వలన ఏర్పడ్డ సమస్యలు తొలగిపోతాయి.

విశుద్ధ చక్రం బలపడాలంటే సర్వాంగాసనము, విపరీత కరణి ముద్ర, మత్స్యాసనము, ఉజ్జయీ ప్రాణాయామముతో పాటు ఆకాశముద్ర లేదా ఉదాన ముద్ర ఆరు మాసాలు వేస్తే ఈ చక్రం బలపడుతుంది.

 విశుద్ధ చక్రము - థైరాయిడ్ గ్రంథి :

ఇది “థైరాయిడ్” గ్రంథికి సంబంధించి యున్నది.
 ఆకాశ తత్వం ఈ చక్ర లక్షణం.
 ఇది వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియం తో అను సంథానమై ఉన్నది.

 ఈ విశుద్ధ చక్రం పంచ వాయువు లలో ఒకటైన "ఉదాన వాయువు" తో అనుసంథానమై యున్నది…

ఇక్కడి అధిష్ఠాన దేవత “సదాశివుడు”. ఇక్కడి  శక్తి “శాకిని…
ఈ చక్రం నేరుగా మెదడుతో అను సంథానమై యుంటుంది…

"తమసోమా జ్యోతిర్గమయ"

 విశుద్ధ చక్రము - సిద్ధులు : ఆయా చక్రాలు జాగృత పరిచినప్పుడు, కొన్ని రకాల శక్తులు మరియూ సిద్ధులు వస్తాయి. విశుద్ధ చక్రం జాగృతం అయినప్పుడు " Telepathic Communication " అనుభవం వస్తుంది. ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్థానాన్ని జాగృత పరుస్తున్నప్పుడు, ఒక్కోరకమైన అనుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలతో భయాందోళనలు చెందకుండా ముందుకు సాగిపోవాలి.

 విశుద్ధి లేదా విశుద్ధ, అంటే ప్రధానమైన అర్ధం వడపోత (filtration). మీ విశుద్ధ చక్రం ఉత్తేజితం (క్రియాశీలం) అయితే, అన్నిటినీ వడపోస్తుంది.

విశుద్ధ చక్రం ఉత్తేజితం అవటమంటే, ఒక విధంగా మీకు రహస్య (మార్మిక) శక్తి పొందే ప్రయోజకత్వం కలుగుతుంది. 

విశుద్ధి రహస్య శక్తులకు కేంద్రం.

 మన పురాణాల్లో......పరమశివుడి కంఠం "నీలం" రంగులో ఉండడం, విశుద్ధ చక్రం యొక్క ప్రతీకాత్మక వర్ణన.

 విశుద్ధ చక్రానికి  థైరాయిడ్ గ్రంథికి గల సంబంధము - వైజ్ఞానిక విశ్లేషణ: 

 ఇది చాలా పెద్ద గ్రంధి. Larynx  కి దగ్గరగా wind pipes కి పైన కంఠము వద్ద ఉన్నది. ఇది  sex gland గా తరచూ వర్ణిస్తారు.  దీనిని మూడవ ovary గా వర్ణిస్తారు. అనేక ovation cases లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతేకాక కి tissues మధ్య భేదాలను గుర్తించగలదు. దీనికి anti toxic power ఉన్నది.  విష ప్రభావం నుంచి రక్షణ ఇస్తుంది. మరియు విష నిరోధక శక్తిని పెంచుతుంది. విషం అనగా విషయ వాసనల వైపుకి మనలను ఆకర్షించే స్పందనలు.

ఈ చక్రానికి సంబంధించిన గ్రంథి " థైరాయిడ్ ". థైరాయిడ్ గ్రంథి , విశుద్ధ చక్రము పరస్పరం పరిపూరకంగా ఉంటాయి.

విశుద్ధ చక్రం సరిగ్గా పనిచేయించగలిగితే, థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుంది.

 థైరాయిడ్ గ్రంథి యొక్క అతిముఖ్య క్రియాకలాపం ఏమిటంటే శక్తి యొక్క మెటబాలిజమ్ నియంత్రిస్తుంది. అందువల్ల దీనిని శక్తి రూపాంతరీకరణ యొక్క  లూబ్రికేటర్ (efficient lubricator) గా పేర్కొంటారు. శరీరము లో ఉన్న శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన ఉత్ప్రేరకము. ఇది జీవించే విధానం యొక్క వేగాన్ని నియంత్రణ చేస్తుంది.

 ఈనాటి వేగవంతమైన జీవితం ....కారణమేమిటంటే - విశుద్ధ చక్రము యొక్క క్రియాశీలతే కారణము. ఇది endocrine system యొక్క ఆధార శిల.

విశుద్ధ చక్ర సిద్ధి అయిన సాధకుడు, కొన్ని సార్లు తాను జ్ఞానిననే మాయలో పడతాడు. ఈ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

విశుద్ధ చక్రం యందు ఏకాగ్రంగా ధారణ చేసి, ధ్యానం చేస్తే, సాధకునిలో  ఆకాశం లాంటి నిర్మలత్వం, స్వచ్ఛత వస్తాయి.
ఆనందమయ స్థితి ( BLISS ) వస్తుంది.

విశుద్ధ చక్రం సమతా స్థితిలో ఉండాలంటే         " వాక్సుద్ధి " అవసరం. వాక్సుద్ధి ఉంటే " వాక్సిద్ధి " వస్తుంది.                
 నారద భక్తి సూత్రములు

48 వ సూత్రము 

"యః కర్మ ఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వ ఓ భవతి" 

కర్మ ఫలం పరిత్యంజించాలి,కర్మలను త్యంజించాలి,ద్వంద్వాన్ని విడిచి అద్వైతం కావలి.

భక్తుడు కర్మఫలం ఏమిటని ఆలోచించకుండా తన కర్తవ్యాలను చేసుకుంటూపోవాలి,కర్మ ఫలం భగవత్ ఆధీనం, ఏతత్ఫలం శ్రీ ప్రమేశ్వర్పణమస్తు అని భావన చేసి సర్వ కర్మ ఫలాన్ని భగవంతుని అర్పించాలి. అప్పుడు భక్తుడు ఏది చేసిన భగవత్కార్యమే. ఆ పరిస్తుల్లో భక్తుడు కర్మ ఫలాన్ని గూర్చి ఆలోచించనవసరం లేదు.  
భక్తుడు కర్మ త్యాగి కూడా కావలి,అయితే అది అసంకల్పిత చర్యగా సాగాలి, ఆపని చేస్తున్నట్టు భక్తునికి స్పృహే ఉండరాదు( నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ప్రతిఫలాన్ని ఆశించక).
అప్పుడు సర్వం ఆభగవంతుడే కర్మ కలాపం నిర్వర్తిస్తాడు భక్తుని ద్వారా. ఆ స్థితి ని అందుకున్నపుడే భక్తుడు కర్మ త్యాగి అవుతాడు.

భక్తుడు సుఖ దుఃఖాలను,లాభనష్టాలను,రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలి,వానికి స్వర పర భేదం ఉండరాదు.స్థితప్రజ్ఞుడై నిర్ద్వంద్వత్వాన్ని పొంది అద్వైతాన్ని ఉపాసించాలి.       

అనన్య భక్తి, సద్గురు సాగత్యం ద్వారా పై లక్షణాలను అలవరుచుకొని మాయ జాలాన్ని దాటాలి భక్తుడు.

49 వ సూత్రం
"వేదానా మపి సన్న్యస్యతి కేవల మవిఛ్చిన్నానురాగం లభతే"
సృష్టిని ప్రకటించే వేదాలను వదలటం ద్వారా  ప్రపంచ  ధ్యాస పోతుంది. భక్తుడు ప్రపంచాతీతుడు,నిష్కామి అయి ప్రేమామృత వార్ధిలో తన్మయుడై ఉంటాడు.
ఆదశ లో లౌకిక వైదిక కర్మలు యధావిధిగా సాగవు.అన్ని బంధాలు సడలిపోతాయి,భక్తుడు బంధవిముక్తుడు అవుతాడు.పామునుండి కుబుసం విడిచినట్లు మాయ భక్తుడునుండి విడిపోతుంది.ఆ స్థితి పరమ భక్తి ప్రేమ యొక్క పరిపక్వదశ,పరమాత్మ భక్తిలో మునిగిన ఆ భక్తునికి భగవంతుడు సారూప్య దశను ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ భక్తుడు "సోహం" అయి ప్రకాశిస్తాడు.     

కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు ధర్మ శాస్త్రం చెప్పిన మాట

 కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు ధర్మ శాస్త్రం చెప్పిన మాట

నీవు చేసిన మోసం ఎవరూ గమనించలేదనుకుంటే అదే నీ కర్మ నీవు చేసిన మోసాల వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళ నేను బాగా మోసగించాను అనుకుంటున్నావే ఊరివారి సొమ్ముతో నీవు ఈరోజు అందరికన్నా లగ్జరీగా బతుకుతాండొచ్చు. నీ మనస్సాక్షిని నీవు మోసం చేస్తుండొచ్చు కానీ ఈ మోసానికి నిన్ను భగవంతుడు శిక్షించడు ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు కానీ కర్మ అన్నది నిన్ను వదలదు నీ కుటుంబాన్ని వదలదు నీ వంశాన్ని వదలదు ఏడేడు జన్మలు అయినా కూడా కర్మ అనేది నిన్ను వదిలిపెట్టదు 
#వంకదారువెంకటకృష్ణ 
#వంకదారు


 శ్రమ శక్తి
********
అనగా అనగా ఒక ఇల్లు, దాన్ని ఆనుకొని ఒక చీమల పుట్ట ఉండేవి.ఆ చీమల పుట్టలో చాలా రాణీ చీమలూ, వాటికి పదింతలు మగ చీమలూ, వాటికి వందరెట్లు సేవక చీమలూ ఉండేవి. మగ చీమలు సేవక చీమలకు పనులు నేర్పిస్తూ ఉండేవి. సేవక చీమలన్నీ అవి ఏమి చెబితే అవి శ్రద్ధగా చేస్తూ ఉండేవి.ఒకసారి ఆ ఇంటావిడ ఘుమఘుమలాడే పాయసం చేసింది. ఆ వాసనకే చీమలన్నీ మత్తెక్కిపోయాయి."ఎక్కడ, పాయసం? ఏది, పాయసం?" అరిచాయి రాణీ చీమలు. "పోండి,వెళ్ళి వెతకండి" ఆజ్ఞలు జారీ చేశాయి మగ చీమలు- ఇల్లంతా వెతకటం మొదలుపెట్టాయి, సేవకచీమలు.అయితే ఆ ఇంటావిడ చాలా తెలివైనది- ఆమెకు తెలుసు, ఈ చీమల ప్రతాపం. అందుకని ఆవిడ ఒక ప్లేటులో నీళ్ళు పోసి, దాని మధ్యలో‌ ఒక గ్లాసును బోర్లించింది. ఒంటి స్తంభం మేడలాగా ఉన్న ఆ గ్లాసుమీద పాయసం గిన్నెను పొందికగా కూర్చోబెట్టింది.సేవక చీమలు హడావిడిగా వెళ్ళి వెతికాయి. ప్లేటు మీదికి ఎక్కి, నీళ్ళ అంచుల వెంబడే తిరిగి చూశాయి: "ఉహుఁ..వేరే దారి లేదు- పాయసం గిన్నెను అందుకోవాలంటే నీళ్ళలోకి దూకాల్సిందే-""నీళ్ళలోకి దూకద్దులే, ఊరికే చచ్చిపోతాం" అని కొన్ని చీమలు వెనక్కి వెళ్ళాయి, ఉత్త చేతులతో. రాణీ చీమలకు కోపం వచ్చి వాటిని అంతం చేసేశాయి.మిగిలిన సేవక చీమలకు అర్థమైంది- 'వేరే దారి లేదు- దూకాల్సిందే' అని.అంచు వెంబడి ఉన్న చీమలు ముందుగా దూకాయి, నీళ్ళలోకి. వాటి వెనకనే రెండో వరస- వెంటనే మూడోవరస- ఇట్లా వందలాది వరసల చీమలు నీళ్ళలోకి దూకి, చచ్చి తేలాయి నీళ్లలో.తర్వాత వచ్చిన సేవకచీమలు నీళ్లలో తేలుతున్న చీమల మీదుగా దూక్కుంటూ ముందుకు పోయి, పాయసం గిన్నెను అందుకున్నాయి.పాయసం వేడిగా ఉన్నది. దాంతో కాళ్ళు కాలి ఇంకా చాలా చీమలు చచ్చిపోయాయి.వాటిమీదినుండి పైకెక్కి, పాయసాన్ని అందుకున్న చీమల్లో అధిక శాతం ఆ పాయసంలోనే పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.కొన్ని సేవకచీమలకు పాయసం దొరికినట్లే దొరికింది.అయితేనేమి, అంతలోనే వచ్చిన ఇంటావిడ వాటిని దులిపేసి, పాయసాన్నంతా తమ పిల్లలకు వడ్డించేసింది! దులిపేయబడ్డ సేవకచీమలు నోట్లో కొంచెం కొంచెం పాయసాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాయి. మగచీమలు, ఆడచీమలు వాటిని చాలా అభినందించాయి. ఆపైన అవి తెచ్చిన పాయసాన్ని తీసుకొని, తమలో తాము పంచుకొని తిన్నాయి!చీమల సమాజంలో ఏదో తప్పుంది. మన సమాజం కూడానూ- సరిగా లేదు. ఒకరు గెలవాలంటే ఎంతో మంది ఓడిపోవాలి, ఎందుకో.ఎన్నెన్ని పోటీ పరీక్షలున్నాయో చూడండి! ఒక్కొక్క పోటీ పరీక్షలోనూ గెలిచేది అతి కొద్ది మందే. అయినా వాటిమీద ఆశతో ఎంతోమంది పిల్లలు తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. చదువులు వ్యాపారం అయిపోయి, సున్నితత్వం లోపించి, మొరటుగా మారిపోవటం మూలాన ఎందరి పసితనాలు వికసించకుండానే ముగిసిపోతున్నాయో! ఎందరెందరి జీవితాలుఎటెటు పోతున్నాయో!ఇదే పరిస్థితి అన్ని రంగాలలోనూ ఉన్నది- ప్రతి అభివృద్ధి వెనకాలా చెప్పలేనంత వెనకబాటు తనం ఉన్నది. ప్రతి విజయం వెనకా లెక్కలేనన్ని అపజయాలు ఉన్నాయి.ఈ పరిస్థితులు మారతాయని ఆశిద్దాం. ఒకరి గెలుపు కోసం వెయ్యిమంది శ్రమ దోపిడీకి గురికాని రోజుల్ని తీసుకొద్దాం.
 *ఓసారి చదవండి మనిషికి ఉన్న బంధాలన్నిటిలోకెల్లా భాగస్వామితో ఉండే బంధమే అత్యుత్తమమైనదని నా అభిప్రాయం.*

*తల్లితండ్రులు జీవితంలో కొంతకాలమే మనతో ఉంటారు. మనకి కలిగే సంతానం కూడా కొంత వయసొస్తే తమ జీవితాలు తాము చూసుకుంటారు. బంధువులు , ఇతర స్నేహితులు కూడా మన జీవితంలో కొంతవరకూ మాత్రమే ఉంటారు కానీ ఒక్క భాగస్వామి మాత్రమే మనతో చివరి వరకూ ఉంటుంది.ఉంటాడు*

*ఒక్క భాగస్వామికి మాత్రమే బయట ప్రపంచానికి కూడా తెలియని మన బలాలూ , బలహీనతలూ , భయాలు , ఉద్వేగాలూ అర్ధమవుతాయి.*

*ఎంత దగ్గరి బంధువులతోనైనా , స్నేహితులతోనైనా మన సమస్యలు కొంత స్థాయి వరకూ మాత్రమే చెప్పుకోగలం. ఎంతకాదనుకున్నా ఇతరులతో మన సమస్యలు చెప్పుకోడానికి కొంత వ్యక్తిత్వం అడ్డొస్తుంది. అమితమైన దుఃఖం కలిగినప్పుడు  తల్లితండ్రులతోనో అది పంచుకోవాల్సివచ్చినప్పుడు వారిని కౌగిలించుకుని మరీ ఏడవడానికి ఎంతోకొంత సంశయం కలుగుతుంది - కానీ భాగస్వామి దగ్గర మాటలు కూడా అవసరం లేదు -దుఃఖం కలిగినప్పుడు ఆమె / అతని యొక్క చిన్న కౌగిలి చాలు నిశ్చింత కలిగేందుకు. తల రాస్తూ నుదిటిపై తను పెట్టే చిన్న ముద్దు చాలు " నీకు నేనున్నాను " అని కొండంత ధైర్యం కలిగేందుకు.*

*శారీరక దగ్గరతనంతో మొదలైన ఆ దగ్గరితనం క్రమక్రమేణా మానసిక దగ్గరితనంగా మారుతుంది.*

*అలా కష్టసుఖాలను సమంగా పంచుకుంటూ కాలం గడిచేకొద్దీ ప్రేమ ఎక్కువవుతూ అన్యోన్యంగా జీవించే భార్యాభర్తలలో ఏ ఒక్కరు మరోకరికి అందుబాటులో కొన్నిరోజులు లేకున్నా వారిని తలుచుకుని దుఖపడడం సహజం...*

పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

*పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!* 


*💥ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...*

*💥ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు.* 

*💥ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...*

*💥మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.*

*💥ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...*

*💥మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు."*

*💥మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...*

ఉదాహరణకు ఒక జరిగిన కథ...

💥కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

💥తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.

💥ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 

💥పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 

💥అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

💥ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 

💥ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.

*💥నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి..

💥ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.

💥ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...

💥కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

💥అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 

*💥ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.*
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-

 🕉️ ఓం శ్రీ మాత్రే నమః 🕉️

*గ్రామ దేవతల పేర్లు*


  🙏🪔🌹🌴🌹🪔🙏                

*గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-

*పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం.

*ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు వారిలో కొందరు.

1. పాగేలమ్మ
2. ముత్యాలమ్మ
3. గంగమ్మ
4. గంగానమ్మ
5. బంగారమ్మ
6. గొంతెమ్మ
7. సత్తెమ్మ
8. తాళమ్మ
9. చింతాలమ్మ
10. చిత్తారమ్మ
11. పోలేరమ్మ
12. మావుళ్లమ్మ
13. మారెమ్మ
14. బంగారు బాపనమ్మ
15. పుట్టానమ్మ
16. దాక్షాయణమ్మ
17. పేరంటాలమ్మ
18. రావులమ్మ
19. గండిపోచమ్మ
20. మేగదారమ్మ
21. ఈరినమ్మ
22. దుర్గమ్మ
23. మొదుగులమ్మ
24. నూకాలమ్మ (అనకాపల్లి,  
                           విశాఖజిల్లా)
25. మరిడమ్మ
26. నేరెళ్లమ్మ
27. పుంతలో ముసలమ్మ (మెయ్యెరు,     
   అత్తిలిదగ్గర, పశ్చిమగోదావరిజిల్లా)
28. మాచరమ్మోరు
29. మద్ది ఆనాపా అమ్మోరు
30. సొమాలమ్మ
31. పెద్దయింట్లమ్మ
32. గుర్రాలక్క(అంతర్వేది, 
     తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ)
33. అంబికాలమ్మ
34. ధనమ్మ
35. మాలక్షమ్మ
36. ఇటకాలమ్మ
37. దానాలమ్మ
38. రాట్నాలమ్మ
39. తలుపులమ్మ
40. పెన్నేరమ్మ
41. వెంకాయమ్మ
42. గుణాళమ్మ
43. ఎల్లమ్మ (విశాఖపట్నం )
44. పెద్దమ్మ
45. మాంటాలమ్మ
46. గంటాలమ్మ
47. సుంకులమ్మ
48. జంబులమ్మ
49. పెరంటాలమ్మ
50. కంటికలమ్మ
51. వణువులమ్మ
52. సుబ్బాలమ్మ
53. అక్కమ్మ
54. గనిగమ్మ
55. ధారాలమ్మ
56. మహాలక్షమ్మ
57. లంకాలమ్మ
58. దోసాలమ్మ
59. పళ్ళాలమ్మ(వానపల్లి,     
                తూర్పుగోదావరిజిల్లా)
60. అంకాళమ్మ.
61. జోగులమ్మ
62. పైడితల్లమ్మ
63. చెంగాళమ్మ
64. రావులమ్మ
65. బూరుగులమ్మ
66. కనకమహాలక్ష్మి(విశాఖపట్నం)
67. పోలమ్మ
68. కొండాలమ్మ
69. వెర్నిమ్మ
70. దే శిమ్మ
71. గరవాలమ్మా
72. గరగలమ్మ
73. దానెమ్మ
74. మహాంకాళమ్మ
75. వేరులమ్మ
76. మరిడమ్మ
77. ముళ్ళ మాంబిక
78. యలారమ్మ
79. వల్లూరమ్మ
80. నాగులమ్మ
81. వేగులమ్మ
82. ముడియలమ్మ
83. రేణుకమ్మ
84. నంగాలమ్మ
85. చాగాలమ్మ
86. నాంచారమ్మ
87. సమ్మక్క
88. సారలమ్మ
89. మజ్జిగౌరమ్మ
90. కన్నమ్మ -పేరంటాలమ్మ
91. రంగమ్మ -పేరంటాలమ్మ
92. వెంగమ్మ -పేరంటాలమ్మ
93. తిరుపతమ్మ
94. రెడ్డమ్మ
95. పగడాలమ్మ
96. మురుగులమ్మ(బండారులంక,    
             తూర్పుగోదావరిజిల్లా)
97. కుంచమ్మ విశాఖపట్నంలో
98. ఎరకమ్మ
99. ఊర్లమ్మతల్లి
100. మరిడమ్మ
101. సుంకాలమ్మవ్వ ఉన్నారు .

నుసకపల్లి, పామర్రుమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .

1. నుసకపల్లమ్మ
2. వెలగలమ్మ
3. ఊర్లమ్మతల్ల (గణపవరం,  
                 కర్లపాలెం మండలం,     
                       గుంటూరుజిల్లా)
4. పైళ్లమ్మతల్లి
5. బల్లమ్మతల్లి
6. లొల్లాలమ్మతల్లి
7. ఊడలమ్మ తల్లి
8. కట్వాలాంబిక
9. నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10. సింగమ్మతల్లి
11. ఘట్టమ్మతల్లి
12. అంజారమ్మతల్లి
13. మంత్రాలమ్మ తల్లి
14. పాతపాటేశ్వరి తల్లి
15. కుంకుళమ్మ ద్వారకా తిరుమల
16. చౌడమ్మ నందవరం కర్నూల్ 
                                     జిల్లా

అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .

*అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు🙏

*మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?

మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?


*గ్రామదేవతా వ్యవస్థ:

గ్రామాలలో వెలిసే దేవత,దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను  గ్రామదేవతలని అంటారు.

సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,
ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.

ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము
సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో
అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు
ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.

ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా
నియమించారు పూర్వీకులు.

అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, 
ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా  శక్తివున్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా  ఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.


*గ్రామదేవతల ఆవిర్భావము:

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.

అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామ దేవతలను ఏర్పాటు చేసారు
తొలి దశలో.

*పృధ్వీ దేవత:
మొదటిది పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము,
కుంకుళ్ళు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.

గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.

జొన్నలు పండేచోట జోన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు.

మొదటిసారిగా పండిన పంటను 
ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటలో కొంత యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.

పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తేగాని చేనుకి వెళ్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.

ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.


*జల దేవత:
రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.


*అగ్ని దేవత:
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. (చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది వింటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).

సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.

ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).


*వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.
కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.


*ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము. ఎత్తులో వున్నందున కొండమ్మ ను
ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.


*గ్రామదేవతా నామ విశేషాలు:

మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.

సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.

‘ఎల్ల' అంటే సరిహద్దు అని అర్ధము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.

ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి…
'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.

ప్రతివ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే
ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=
కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.

స్వచ్ఛమైన అమ్మ అనే అర్ధములో (స్వచ్ఛమని)సు+అచ్ఛ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.

సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.
'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములోఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.

ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి
లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.

శంకరునితో కలసి అర్ధనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆ కారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా
అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.

పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.
ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.
తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత
పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.

పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=
సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.

గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 

అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది
కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.

బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.

అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ
అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.

భోజనాన్ని అందించగల తల్లి అనే అర్ధములో
బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=
బోనాలమ్మ.

అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.

లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది
కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.

ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!

*పేర్లు ఏవైతేనేమి, ఆ తల్లి ఎప్పుడూ మనకు తోడుగా, అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది...

🙏🪔 సంధ్యా దీప నమోస్తుతే🪔🙏
.

Friday, November 29, 2024

 *సోమరిపోతు మహావీరునికీ జై (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూర్లో ఒక పెద్ద సోమరిపోతు వుండేటోడు. వాడు చిన్నప్పట్నించీ చిన్న పని గూడా చేసేటోడు కాదు. ఎప్పుడు చూడు తినడం పన్నుకోవడం అంతే... పెండ్లయినా కొంచం గూడా మారలేదు. పెండ్లామే గొణుక్కుంటా అన్ని పనులు చేసుకొనేది.
ఒకసారి పెండ్లాం బైటకు పోతా “ఇదిగో... పొయ్యి మీదికి అన్నంగిన్నె ఎక్కిచ్చినాను. ఐదునిమిషాలాగి దించండి. నేను సంతకు పోయి సరుకులు తీసుకోనొస్తా" అని చెప్పి పోయింది. వీడు సరేలే అని తలూపినాడుగానీ అట్లాగే నిద్రపోయినాడు. పెండ్లాం సరుకులు తీసుకోనొచ్చి అలసిపోయి అన్నం తిందామని చూస్తే ఇంగేముంది ఒక్క మెతుకు గూడా లేదు. అంతా నల్లగా మాడిపోయి బొగ్గులెక్క అయిపోయింది. దాంతో ఆమె కోపంగా "ఇట్లాగయితే సంసారం సాగినట్లే. ఏం మొగోనివయ్యా నువ్వు పొద్దున లేసినప్పటి నుంచీ కాళ్ళూచేతులు లేనోని లెక్క ఊరికే కూచుంటావు గానీ ఒక్కపని గూడా చేయవు. చుట్టుపక్కల చూడుపో... అందరిండ్లలో మొగోళ్ళు ఎట్లా పని చేస్తా వున్నారో" అనింది.
దానికి వాడు "ఏందీ... నేనేం పని చెయ్యడం లేదా... పొద్దున్నుంచీ వంద ఈగలు చంపినాను తెలుసా... ఏమనుకుంటావున్నావో" అన్నాడు కోపంగా. 
"ఏందీ... ఎన్ని చంపినావు" అనింది పెండ్లాము. 
"వంద... వంద... చంపినానే వుత్త చేతుల్తో.... అదీ ఒక్కరోజులోనే" అన్నాడు మరింత గట్టిగా. 
సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు పక్కింటి పుల్లమ్మ పోతా వుంది. ఆమె ఆ మాటలు వినింది. “అబ్బా... ఏమో అనుకుంటిగానీ వీడు పెద్ద వీరుడే. ఒక్క రోజులోనే వంద మందిని వుత్త చేతుల్తో చంపడమంటే మాటలా" అనుకోని వెనకింటామెకు చెప్పింది. ఆమె ముందింటామెకు చెప్పింది. ఆమె పక్క వీధామెకు చెప్పింది. ఆమె వాళ్ళ బంధువులకు చెప్పింది. అట్లా ఒక్క రోజులోనే గడ్డివాములు గదా ఒకటంటుకుంటే గాలికి పక్కనున్నవన్నీ సరసరసర అంటుకున్నట్లు వూరువూరంతా తెలిసిపోయింది. 
ఆ మాటలు ఒక సైనికుడు విన్నాడు. “అబ్బా... ఒక్కరోజులోనే వందమందిని వుత్త చేతుల్తో చంపినాడంటే వీడెవడో సామాన్యుడు గాదు. రాజుగారికీ సంగతి చేరవేయాల్సిందే" అనుకోని వురుక్కుంటా పోయి విషయం చెప్పినాడు. 
రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయినాడు.
"పొండి... పోయి... ఆ వీరున్ని తీసుకోని రాపోండి. అటువంటోడు మన ఊరిలో వుంటే మన రాజ్యానికెంతో మంచిది" అని సైనికులను పంపిచ్చినాడు.
ఆ సోమరిపోతు ఇంట్లో హాయిగా మంచమ్మీద కాలు మీద కాలేసుకోని కూర్చోని వేడివేడి పకోడీలు తింటా వున్నాడు. దూరంగా ఏవో గుర్రాలు వస్తా వున్న చప్పుడు వినబడింది. పక్కనే వున్న కిటికీ తెరచి చూసినాడు. దూరంగా గుర్రాలు, సైనికులు కనబన్నారు. 
“యాడికో పోతావున్నట్టున్నారు. మనకెందుకులే" అనుకున్నాడు. 
కాసేపటికి చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది. కిటికీ తెరచి చూసినాడు. ఇంటి ముందు గుర్రాలు దిగుతా కనబన్నారు. పక్కింటికేమోలే అనుకోని మళ్ళా కిటికీ మూసేసినాడు. 
అంతలో తలుపు తట్టిన చప్పుడయింది. 
“ఏమే... ఎవరో వచ్చినట్టున్నారు. కొంచం పోయి చూడు" అన్నాడు మంచమ్మీద నుంచి లేయకుండానే. ఆమె పోయి తలుపు తెరిచింది. ఎదురుగా సైనికులు కనబన్నారు. 
వాళ్ళు లోపలికి వచ్చి ఆ సోమరిపోతుకి వంగి వంగి నమస్కారం చేసి "అయ్యా.... మిమ్మల్ని తీసుకోని రమ్మని రాజుగారు పంపిచ్చినారు. ఒక్కసారి వచ్చిపోండి" అన్నారు. 
"నేనా..... ఎందుకు... ఏం చేసినాను" అన్నాడు వాడు భయపడుతూ. 
"అయ్యా... మీరు ఒక్కరోజులోనే వుత్త చేతుల్తో వందమందిని చంపినారంట గదా... ఆ మాట ఆనోటా ఈనోటా పడి రాజుగారికి తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలుచుకోని రమ్మన్నాడు" అని చెప్పినారు. 
దానికి వాడు "నేనా నేనెవ్వరినీ చంపలేదే... మీరు ఎవరో అనుకోని ఇక్కడికి వచ్చినట్టున్నారు" అన్నాడు. 
ఆ మాటలకా సైనికులు "అయ్యా... మీకు గమ్మత్తులు ఆడడానికి మేమే దొరికినామా... మీరెంత దాచి పెట్టుకున్నా ఇప్పుడు మీ గురించి తెలియనోళ్ళు ఈ వూరిలో ఒక్కరు కూడా లేరు. తొందరగా రండి. రాజుగారు మీ కోసం ఎదురు చూస్తా వున్నారు" అన్నారు. 
ఆ మాటలినగానే సోమరిపోతు గుండె దడదడలాడింది. వెళితే ఏమవుతుందో తెలీదు. వెళ్ళకుంటే వదలరు. ఏదయితే అదయిందని “సరే... నాకో గుర్రాన్ని వదిలి మీరు పోండి. నేనొస్తా" అన్నాడు. వాళ్ళు సరేనని గుర్రాన్ని వదిలి పోయినారు.
సోమరిపోతు పెండ్లాన్ని పిలిచి "ఏమే... నాకెందుకో భయంగా వుంది. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో... నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పినాడు. 
వానికి గుర్రమెక్కడం గానీ, దాన్ని తోలడంగానీ రాదు. దాంతో నిచ్చెన తెప్పించుకోని గుర్రం ఎక్కినాడు. దాన్ని ఎట్లా తోలాల్నో అర్ధంగాక మొలతాడుకు కట్టుకున్న పిన్నీసు తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక్క గుచ్చు గుచ్చినాడు. 
అంతే... ఆ నొప్పికి తట్టుకోలేక అది రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకు పోసాగింది. వాడు భయంతో గట్టిగా దాని మెడ కరుచుకున్నాడు. అది నిమిషాల్లో సైనికులందరినీ దాటిపోయింది.
అదే సమయంలో రాజు అంతఃపురం పైన తిరుగుతా వున్నాడు. ఆయనకు గుర్రమ్మీద దూసుకోని వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. 
“ఆహా... ఏమి వేగం... మెరుపులెక్క వస్తా వున్నాడు. రాజ్యంలో ఇంతమంది సైనికులుండి ఏం లాభం... ఏ రోజూ ఎవడూ ఇంత వేగంగా పోవడం చూడలేదు" అనుకున్నాడు. 
రాజు ఆ సోమరిపోతు సభలోకి రాగానే పెద్ద యెత్తున సన్మానించి నగలూ, వజ్రాలు బహుమానంగా ఇచ్చి “నీలాంటోడు మాకెంతో అవసరం. ఎప్పుడయినా ఏదయినా ఆపద వస్తే కబురు పంపుతాను. వచ్చి సాయం చేయండి" అని చెప్పి పంపిచ్చినాడు. వాడు నగలతో, వజ్రాల హారాలతో తిరిగి ఇంటికి రాగానే చూసి వాని పెండ్లాం సంబరపడింది. ఒకొక్కటే అమ్ముకుంటా హాయిగా కాలం గడపసాగినారు.
ఒకసారి రాజ్యంలో కొంతమంది దొంగలు పడినారు. చీకటి పడితే చాలు ఎప్పుడు ఎక్కడినుంచి ఎవరింటి మీద పడతారో తెలీదు. క్షణంలో రావడం వున్నదంతా దోచుకోవడం మరుక్షణంలో మాయమై పోవడం చేసేవాళ్ళు. సైనికులు వీధివీధినా కాపలా కాస్తా వున్నా వాళ్ళని పట్టుకోలేక పోతా వున్నారు. ప్రజలందరూ రాత్రయితే చాలు భయంతో గజగజా వణికిపోతా తలుపులేసుకోని బిక్కుబిక్కుమంటా గడపసాగినారు. దాంతో రాజు లాభం లేదనుకోని సోమరిపోతుని పిలిపించినాడు.
"ఒక్క రోజులోనే వందమందిని వుత్త చేతుల్తో చంపిన మహా వీరుడా... నీకు తెలియనిదేముంది. వూర్లో దొంగలు పడి నెలరోజుల నుంచీ ముప్పుతిప్పలు పెడతా వున్నారు. నీకు ఎంతమంది సైనికులు కావలసి వస్తే అంతమందిని తీసుకోని పో. వాళ్ళని మాత్రం దొరికితే పట్టుకో... దొరక్కుంటే చంపెయ్యి" అన్నాడు. 
ఆ మాటలింటానే సోమరిపోతు గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకు కనబడనీయకుండా “రాజా! ఈ మాత్రం పనికి మళ్ళా నాకు తోడు సైనికులెందుకు. నేనొక్కన్నే పోయి వాళ్ళని పట్టుకోనాస్తాలే" అని చెప్పి ఇంటికి పోయినాడు. 
పెండ్లాంతో “ఏమే... ఈ రోజుతో ఇంక నా పని అయిపోయినట్లే. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో... నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి రాత్రికి ఘుమఘుమలాడేలా మాంచి బిర్యానీ చేయించుకోని మూటగట్టుకోని బైలుదేరినాడు.
కొంచెం దూరం పోయినాక ఒక పెద్దతోట కనబడింది. దాంట్లోకి పోయి అంగీలో దాచి పెట్టుకున్న విషం తీసి బిర్యానీలో కలిపినాడు. ఇంక ఇది తిని చచ్చిపోతే సరి. లేకుంటే రేపు అందరి ముందూ పరువు పోతుంది అనుకున్నాడు. అంతలో వానికి బాగా నిద్ర వచ్చింది. 
"సర్లే ఎట్లాగూ చచ్చిపోయేదే గదా... కాసేపు హాయిగా నిద్రపోయి ఆ తర్వాత చచ్చిపోదాం" అనుకోని మూట పక్కనే పెట్టుకోని అట్లాగే నిద్రపోయినాడు.
ఆరోజు రాత్రి దొంగలు ఎవరింట్లో దొంగతనం చేయాల్నో ఆలోచించుకోవడానికని ఆ తోటలోనే సమావేశమయినారు. వాళ్ళకి ఘుమఘుమలాడి పోతా బిర్యానీ వాసన వచ్చింది. యాడుందబ్బా అని వెదుక్కుంటా వస్తే వీడు నిద్రపోతా కనబన్నాడు. వాళ్ళు నెమ్మదిగా వాని పక్కనున్న మూట తీసుకోని పోయి విప్పినారు. బిర్యానీ కొంచెమే వుంది. 
దాంతో “సర్లే... ఎంతుంటే ఏమిలే... వాసనే ఇంత కమ్మగా వుంటే... తింటే ఇంకెంత రుచిగా వుంటుందో" అని ఆ ముప్పయి మంది తలా ఒక ముద్ద తిన్నారు. అంతే... కాసేపటికి అందరూ విషమెక్కి ఎక్కడోళ్ళక్కడ పడి చచ్చిపోయినారు.
పొద్దున్నే ఆ సోమరిపోతు లేసి చూస్తే ఇంగేముంది. పక్కనే దొంగలు ఒకరుగాదు ఇద్దరుగాదు ముప్పయిమంది ఒకరి పక్కనొకరు చచ్చి పడున్నారు. పక్కన మూట లేకపోవడంతో వానికి విషయమంతా అర్ధమైంది. వెంటనే వురుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకోనొచ్చి ఆ శవాలన్నీ అందులో యేసుకోని రాజభవనానికి బైలుదేరినాడు. 
అట్లా పోతావుంటే దారిలో చూసినోళ్ళంతా "ఉత్త చేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై" “ఒక్క రాత్రిలో ముప్పయిమంది దొంగల్ని మట్టి కరిపించిన మహా వీరునికి జై" అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటా బండి వెనకాల్నే రాసాగినారు. ఆ అరుపులు విని రాజు బైటకు వచ్చినాడు. 
చూస్తే ఇంగేముంది బండి మీద ముప్పెమంది దొంగల్ని వేసుకోని రొమ్ము విరుచుకోని ఠీవిగా వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. 
వెంటనే రాజు మేడ దిగి వానికి ఎదురొచ్చి “భళా... వీరా... భళా... ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్కరోజులోనే ఒక్కనివే చేసి చూపించినావు. నువ్వురా వీరునివంటే" అని మెచ్చుకోని పెద్ద ఎత్తున బండి నిండా నగలు, వజ్రాలూ ఇచ్చి పంపిచ్చినాడు. అట్లా కొద్దిరోజులు గడచిపోయినాయి. 
అంతలో యాన్నుంచొచ్చిందో ఏమోగానీ ఒక పెద్దపులి వూరి మీదకొచ్చి పడింది.
రాత్రయితేచాలు దొరికినోన్ని దొరికినట్టు చంపి తినేయసాగింది. సైనికులు దాన్ని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించినారు గానీ అది ఎవరికీ దొరకక పోగా వాళ్ళనే ఒక పదిమంది దాకా చంపేసింది.
దాంతో పులి పేరు చెబితే చాలు అందరూ భయంతో గజగజా వణికిపోసాగినారు. చీకటి పడితే చాలు ఎంత పనున్నా సరే ఎక్కడోళ్ళక్కడ పరుగుపరుగున ఇళ్ళకు చేరుకోని తలుపులు బిగించుకోని లోపలనే కూచోసాగినారు.
దాంతో రాజు ఇట్లాగయితే లాభం లేదనుకోని సోమరిపోతుని పిలిపించినాడు. 
“ఉత్త చేతుల్తో వందమందిని, ఒక్క రాత్రిలో ముప్పయి మంది దొంగల్ని మట్టి కరిపించిన మహావీరుడా... నీకు తెలియనిదేముంది. వూర్లోకి ఒక పెద్దపులి వస్తూ జనాలని ముప్పుతిప్పలు పెడతా వుంది. నీకు ఎంతమంది సైనికులు కావలిస్తే అంత మందిని తీసుకోని పో. కానీ దాన్ని మాత్రం వదలొద్దు. దొరికితే పట్టుకో... దొరక్కుంటే అక్కడికక్కడే చంపెయ్యి" అన్నాడు. 
ఆ మాటలకా సోమరిపోతు భయంతో గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకు కనబడనీయకుండా పెద్ద మొనగాని లెక్క “ఈ మాత్రం దానికి మళ్ళా సైనికులెందుకు రాజా. నేనొక్కన్నే పోయి దాన్ని పట్టుకోనొస్తాలే" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాడు. పెండ్లాంతో “ఏమే... ఈ రోజుతో ఇంక నా పని అయిపోయినట్లే. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో. నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి నిచ్చెనేసుకోని గుర్రమెక్కి రాత్రి వూర్లోకి బైలుదేరినాడు.
అది అమావాస్య. చుట్టూ చీకటి. దారిలో ఒక్కరు గూడా కనబల్లేదు. అందరూ తలుపులేసుకోని ఎవరిండ్లలో వాళ్ళు దాచి పెట్టుకున్నారు. సోమరిపోతుకు భయంతో ఒళ్ళంతా గజగజా వణికిపోసాగింది. గుర్రాన్ని తీసుకోని పోయి ఎవరూ లేని ఒక చోట కట్టేసి ఆ చెట్టు కిందే నిండుగా కంబలీ కప్పుకోని పన్నుకున్నాడు.
అర్ధరాత్రయింది. పెద్దపులి వూరంతా తిరిగి తిరిగి అలసిపోయింది. యాడా దానికి తినడానికి ఏమీ దొరకలేదు. అప్పటికీ నాలుగు రోజుల నుంచి దానికి అదే పరిస్థితి. అన్ని ఇండ్లు మూసేసున్నాయి. కోళ్ళు, మేకల్తో సహా అన్నీ లోపల పెట్టి తాళాలేసుకుంటాన్నారు. తినడానికి తిండి లేక అది నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా సోమరిపోతు పన్నుకున్న చెట్టు దగ్గరకు వచ్చింది. పెద్దపులిని చూడగానే గుర్రం భయపడి తాడు తెంపుకోని వురకసాగింది. కానీ పెద్దపులికి దాని వెంటపడి వేటాడే ఓపిక లేదు. దాంతో అట్లాగే నెమ్మదిగా వాని దగ్గరకు రాసాగింది. అంతలో ఆ అలికిడికి ఆ సోమరిపోతు కప్పుకున్న కంబలితో సహా లేచినాడు. పెద్దపులికి చీకట్లో అదేందో అర్థం కాలేదు. 
"ఇదేం జంతువబ్బా... నల్లగా ఇంత పెద్దగా వుంది. ఈ అడవిలో నేనెప్పుడూ చూడలేదే" అని భయంతో వణికిపోసాగింది. 
అంతలో ఆ సోమరిపోతు నిద్రమబ్బులో ఎదురుగా వున్నది వాని గుర్రమే అనుకోని దాన్ని పట్టుకోని తాడుతో దూరంగా చెట్టుకు కట్టేసి మళ్ళా నిద్రపోయినాడు. దాంతో పెద్దపులికి ఆ రాత్రిగూడా తిండి లేక ఆకలికి తట్టుకోలేక ఆఖరికి అది అట్లాగే చచ్చిపోయింది.
ఆ సోమరిపోతు పొద్దున్నే లేసి చూస్తే ఇంగేముంది... పెద్దపులి చచ్చిపోయి కనబడింది. వెంటనే వాడు వురుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకోనొచ్చి దాని శవాన్ని అందులో యేసుకోని రాజభవనానికి బైలుదేరినాడు. అట్లా పోతావుంటే దారిలో చూచినోళ్ళంతా "ఉత్త చేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై” “ఒక్క నిమిషంలోనే పెద్దపులిని మట్టి కరిపించిన మహావీరునికి జై” అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటా బండి వెనకాల్నే రాసాగినారు. 
ఆ అరుపులు విని రాజు బైటకు వచ్చినాడు. చూస్తే ఇంగేముంది బండి మీద పెద్దపులి శవాన్ని వేసుకోని రొమ్ము విరుచుకోని ఠీవిగా వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. వెంటనే రాజు మేడ దిగి వానికి ఎదురొచ్చి “భళా వీరా... భళా... ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్కరోజులోనే ఒక్కనివి చేసి చూపించినావు. నీలాంటి వీరుడు మూల్లోకాల్లోనూ యాడా వుండడు" అని మెచ్చుకోని పెద్ద ఎత్తున గౌరవించి బండి నిండా బంగారం, వజ్రాలూ, నగలూ ఇచ్చి పంపిచ్చినాడు.
అట్లా కొద్దిరోజులు గడిచి పోయినాయి. మొగుడూ పెండ్లాలు హాయిగా రాజిచ్చిన బంగారం, నగలూ అవసరానికి అమ్ముకుంటా కాలు మీద కాలేసుకోని కాలం గడపసాగినారు. 
అంతలో పక్క ఊరి రాజు ఈ రాజ్యంపైకి దండయాత్రకి బైలుదేరినాడు. వూరి పొలిమేరల్లో సైన్యాన్ని ఆపి "మర్యాదగా వచ్చి లొంగిపోయి కప్పం కట్టి నాకు సామంతునిగా వుంటావా... లేక దాడి చేసి రాజ్యం మొత్తం ఆక్రమించుకోమంటావా ఏదో ఒకటి చెప్పు" అని కబురు పంపించినాడు. రాజుకు ఏం చేయాల్నో పాలుపోలేదు. అవతల సైన్యం చానా పెద్దది. గెలవడం చానా కష్టం. అట్లాగని లొంగిపోదామా అంటే ఆ అవమానం కన్నా చావడం మేలు అనిపించింది. ఆ సమయంలో రాజుకి సోమరిపోతు గుర్తుకొచ్చినాడు. వెంటనే సైనికులను పంపి వాన్ని పిలిపించినాడు.
"ఉత్త చేతుల్తో వందమందిని, ఒక్కరాత్రిలో ముప్పయిమంది దొంగల్ని, ఒక్క నిమిషంలోనే పెద్దపులిని మట్టికరిపించిన మహావీరుడా... నీకు తెలియనిదేముంది. పక్క ఊరి రాజు మన మీదకు దండయాత్రకొచ్చినాడు. ఇది మనవూరి పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. నీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకోనిపో. ఇంకెప్పుడూ నిన్ను ఏ కోరికా కోరి ఇబ్బంది పెట్టను. ఈ ఒక్కసారికి సాయం చేయి చాలు" అన్నాడు.
యుద్ధం అనే మాట వినగానే సోమరిపోతు గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకి కనబడనీయకుండా “రాజా... ఇదే ఆఖరిసారి అంటా వున్నావు గదా... అట్లాగే చేద్దాం. ముందు నేను పోతా...
వెనుక సైన్యాన్నంతా రమ్మను" అని చెప్పి ఇంటికి పోయినాడు.
పెండ్లాంతో "ఏమే... ఇన్ని రోజులూ ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నాగానీ... ఇంగ ఈ రోజుతో నా పని అయిపోయినట్లే... ఎందుకయినా మంచిది. నే పోగానే పెట్టి సర్దుకోని డబ్బులు తీసుకొని పుట్టింటికి పో. నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి బైలుదేరినాడు.
ఆ సోమరిపోతు పోయేసరికి సైనికులంతా సిద్ధంగా వున్నారు. ఒక మంచి నల్లని మేలు జాతి గుర్రాన్ని సోమరిపోతు కోసం సిద్ధంగా వుంచినారు. రాగానే అందరూ "మహావీరునికి జై" 
"మహా వీరునికి జై" అని అరుస్తా భుజాల మీదకు ఎత్తుకొని పోయి గుర్రమ్మీద కూచోబెట్టినారు. 
"మహావీరా... ఇది అట్లాంటిట్లాంటి మామూలు అల్లాటప్పా గుర్రం కాదు. దీనంత వేగంగా వురికే గుర్రం ఈ చుట్టుపక్కల ఏడేడు లోకాల్లో యాడా లేదు. నీ కోసమే ప్రత్యేకంగా తెప్పించినాం" అన్నారు. ఆ గుర్రాన్ని చూడగానే సోమరిపోతు భయంతో గజగజా వణికిపోయినాడు. యాడ కిందపడిపోతానో ఏమో అనే భయంతో “రేయ్... నన్ను గుర్రానికి గట్టిగా తాళ్ళతో కట్టెయ్యండ్రా" అన్నాడు. 
అది విని రాజు "మహావీరా ఏందిది" అన్నాడు ఆచ్చర్యంగా. దానికి సోమరిపోతు వెంటనే "రాజా... యుద్ధరంగంలోంచి నేనన్నా వెనక్కి రావాలి. నా శవమన్నా వెనక్కి రావాలి. అంతేగానీ పొరపాటున గూడా శత్రువులకు వెన్ను చూపగూడదు. కత్తి గుండెల్లో దూసుకుపోయినా సరే చివరి రక్తం బొట్టు వరకూ పోరాడాలి. అందుకే ఇలా కట్టేసుకుంటున్నా" అన్నాడు. ఆ మాటలినగానే సైనికులందరూ "మహావీరునికి జై" "మహావీరునికి జై" అని అరుస్తా తాము గూడా గుర్రాలకు కట్టించుకోసాగినారు.
సోమరిపోతు సైనికులతో "ముందు నేనొక్కన్నే పోతా... నేను పోయిన అర్ధగంటకు మీరు బైలుదేరండి" అని చెప్పి బైలుదేరినాడు. కొంచం దూరం పోగానే బతికుంటే సాలు బలుసాకైనా తిని బతకొచ్చు... సైనికులు వచ్చేసరికి ఇక్కడినుంచి ఎవరికీ తెలియని వేరే వూరికి పారిపోవాలి" అనుకోని పిన్నీసు తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక్క గుచ్చు గుచ్చినాడు. అంతే ఆ గుర్రం అదిరిపడి సర్రుమని ఉరకడం మొదలు పెట్టింది.
ఆ గుర్రం అట్లాంటిట్లాంటి మామూలు గుర్రం కాదు కదా... అప్పటికే ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న గుర్రం. దాంతో శత్రువులు వున్న వైపే వురకడం మొదలుపెట్టింది. అది చూసి భయపడిన సోమరిపోతు దాన్ని ఆపాలని ఎంత చూసినా అది ఆగకుండా మరింత వేగంగా మెరుపులెక్క దూసుకుపోసాగింది. ఆ వేగానికి సోమరిపోతుకి కళ్ళు తిరగసాగినాయి. భయంతో ఒళ్ళంతా చెమట పట్టసాగింది. ఎట్లాగయినా సరే దాన్ని ఆపాలనుకున్నాడు.
అంతలో ఎదురుగా రెండు పెద్ద తాటి చెట్లు పక్కపక్కనే కనబన్నాయి. గుర్రాన్ని వాటి మధ్యలో వురికించినాడు. తాటి చెట్లు దగ్గరికి రాగానే వాటిని గట్టిగా పట్టుకుంటే గుర్రం ఆగిపోతుందిలే అనుకున్నాడు.
కానీ ఆ తాటి చెట్లకు మొదలు దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేసినాయి. లోపలంతా డొల్లడొల్ల అయిపోయి తేలికగా అయిపోయినాయి. ఈ రోజో రేపో కూలిపోవడానికి సిద్ధంగా వున్నాయి. అది వానికి తెలీదు. గుర్రం వాటి మధ్యలోంచి పోతుండగానే చేతుల్లో రెండుచెట్లు గట్టిగా పట్టేసుకున్నాడు. 
కానీ గుర్రం మెరుపులెక్క దూసుకోని పోతావుంది గదా... ఆ వేగానికి ఆ రెండు చెట్లు వేళ్ళతో సహా లేచి పైకి వచ్చేసినాయి.
గుర్రమ్మీద రెండు చేతుల్లో రెండు తాటి చెట్లను పట్టుకోని దూసుకొస్తావున్న వాన్ని చూడగానే శత్రు సైన్యాలు అదిరిపడినాయి. 
“రేయ్... వుత్త చేతుల్తో వందమందిని ఒక్కరోజులో చంపిన మహావీరుడు తాటి చెట్లు ఎత్తుకోని చిరుతపులిలెక్క వస్తా వున్నాడు. వానికి దొరికినామంటే మనపని అయిపోయినట్లే. సున్నంలోకి ఎముకలు గూడా మిగలవు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండ్రోయ్" అంటూ గట్టిగా అరుస్తా అందరూ తలా ఒక దిక్కు కిందామీదా పడి వురకసాగినారు. సోమరిపోతు అక్కడి కొచ్చేసరికి ఒక్కడుగూడా మిగలలేదు.
వాని వెనుక అర్ధగంటకు బైలు దేరిన సైనికులు అక్కడికి చేరుకునే సరికి సోమరిపోతు ఒక్కడే నవ్వుతా కులాసాగా కనబన్నాడు. 
వెంటనే వాళ్ళు “ఉత్తచేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై" 
“ఒక్క నిమిషంలోనే శత్రు సైన్యాలనంతా పారద్రోలిన మహావీరునికి జై" అంటూ వాన్ని గుర్రమ్మీద నుంచి దించి భుజాల మీదకు ఎత్తుకోని తప్పట్లు కొట్టుకుంటా, చిందులు తొక్కుకుంటా, బాణాలు కాల్చుకుంటా రాజు దగ్గరికి తీసుకోనొచ్చినారు. రాజు వురుక్కుంటా మేడ దిగొచ్చి “శభాష్ వీరా... శభాష్... వీరునివంటే నువ్వే ఒక్క రక్తం చుక్క గూడా చిందకుండా విజయం సాధించినావ్... నీలాంటోడు ఒక్కడుంటే చాలు... ఈ ప్రపంచాన్నే జయించొచ్చు" అంటూ మెచ్చుకోని వాళ్ళ రాజ్యానికి సైన్యాధ్యక్షునిగా చేసినాడు. 
అప్పటికే సోమరిపోతు వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యాలకంతా తెలిసిపోవడంతో ఆ రాజ్యంవైపు కన్నెత్తి చూడడానికి గూడా అందరూ భయపడిపోయినారు. దాంతో ఆ సోమరిపోతు హాయిగా కాలుమీద కాలేసుకోని కులాసాగా జీవితమంతా గడిపినాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 🚩 " కన్యాశుల్కం"..🚩

✍కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరం లో జరిగింది. అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం.

కథ!

♦కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ.
 అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతూన్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు.

♦ అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటూన్న గిరీశం అనే మోసకాడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా, ఆ పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు. 

♦విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు. 

♦మరోవైపు గతంలో గిరీశం పోషణలో ఉండే మానవత్వం కలిగిన సాని మనిషి మధురవాణి, లుబ్దావధాన్లును మోసం చేసి పెళ్ళికి ఒప్పించి డబ్బు తీసుకుందామని ప్రయత్నిస్తున్న రామప్పంతులు వద్దకు చేరారు. 

♦కుమార్తెకు ఆ పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి ఆ పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు.
 
♦కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు సాధ్యమైనంత బాధపెట్టి, నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు. 
♦ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు ఈ పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు. 
♦ఈ కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు.
 
♦చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది

సర్దేశాయి తిరుమల రావు “కన్యాశుల్క నాటకకళ” అనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించాడు .

♦మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచి,చెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డ,మంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు.
 
♦మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. 
♦గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. 
సుబ్బి రంగస్థలంపైకి రాని “నాయిక” వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు ,వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక కర్త ఉద్దేశం కావచ్చు. 
ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. 
♦“సామూహిక పాత్రీకరణ” అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, 
రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.
♦ఈ నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. 
ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. 
నాటకం మొదలు, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. 
గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు? 
ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి
 మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా,
ఆ పనులవల్ల ఏ ప్రయోజనం, మార్పూ కనుపించదు.

♦గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక,.మాయమాటల్తో 
పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం 
ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గురజాడ సృష్టించి ఉండవచ్చు. 
♦“డామిట్‌ ! కథ అడ్డం తిరిగింది” అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.
♦ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర “మధురవాణి”. 
ఈ పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. 
మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. 
♦రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే 
ఆమె మనసు అర్ధమవుతుంది.

♦వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, 
అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి. 
దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి 
కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో “వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. 
“ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా 
అనకుండా ఉండలేక పోతాడు. 
అయితే నాలుగో అంకంలో “నీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు 
ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.
♦ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్ర్యోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కొక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.
♦డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో” అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు

సేకరణ 🌹.
 *చిన్నప్పుడు.. అవును బాగా చిన్నప్పుడు...*
*రకరకాల బ్రేక్ఫాస్ట్లు తెలీవు, డబ్బు ఖర్చు కూడా తెలీదు, అలాగని పొదుపూ తెలియదు..!!*
*పోల్చుకోవడాలూ... ఆడంబరాలు అసలే తెలీదు...(ఈ చివరివి ఇప్పటికీ తెలీవు, తెలిసినా ఇష్టపడను)*

*పొద్దు పొద్దున సరిగ్గా ఆరు గంటలకి "ఆ డబర్రొట్టియో " (బన్స్ ) అంటూ ఒక పొడవాటి రేకు ట్రే లో బన్స్ ని పెట్టుకుని మా వాడకట్టు లో  ఒక కుర్రాడు అమ్మేవాడు.*

*అప్పటికే స్నానం చేసి, పూజ చేస్తున్న నాన్న చేతి లో జపమాల పట్టుకుని బయటకొచ్చి ఆ కుర్రాణ్ని పిలిచేవాడు.*
*నాకూ అక్కకు పావలా కి రెండు బన్ను లు కొనేవారు. అప్పటికే మెలకువ తో ఉన్న దొంగ నిద్ర పోయి, చంగున లేచి కూర్చునేదాన్ని.*

*పళ్లు తోముకుని, ఫ్రెష్ అయ్యి, ఆ బన్ను నా చేతికెప్పుడిస్తారా అని కూర్చునేదాన్ని.*

*మా అమ్మ పెద్ద గలస్ లో చాయ్ తో పాటు బన్ను కూడా  తెచ్చి, ముందు పెట్టేది.*

*ప్రతి రోజూ పావు లీటర్ బర్రె(గేదె) పాలు మాత్రమే తీసుకునేది అమ్మ. అందులోనే రెండు పూటలా చాయ్ మరియు మజ్జిగ.*

*మరి రంగు, రుచి, చిక్కదనం, గడ్డ పెరుగు అంటే ఏవిటో తెలీదు. వంకలు పెట్టడం, అది బాలేదు, ఇదిలాగే ఉండాలి అని కూడా తెలీని అమాయకత్వం.*

*అమ్మ ఏది వడ్డిస్తే అది ఆవురావురంటూ తినేయడం. మహా అంటే మొదటి వాయి నాన్న కలిపిచ్చేవారు.*

*ఇక స్కూల్(ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల) కి వెళ్ళేటప్పుడు,  నిన్న రాత్రి మిగిలిన చద్దన్నం లో నూనె వేసి మిరప్పండు తొక్కో(పచ్చడి) చింతకాయ తొక్కో కలిపి నాకూ, అక్కకి పెద్ద పెద్ద లడ్డూల్లా చేసి చేతి లో పెట్టేది  అమ్మ...*

*గబ గబా తింటూ మధ్యలో ఉస్స్స్ ఉస్స్...(కారం, ఘాటు) అని సౌండ్స్ చేస్తూ తినేసి స్కూల్కి వెళ్ళేవారిమి.*

*మధ్యాహ్నం ఒంటిగంటకి ఇంటి బెల్ కొట్టగానే వచ్చేసి, అమ్మ వడ్డించే భోజనం (ఒక్కటే కూర లేదా పప్పు, చల్ల) తినేసి ఒకయిదు నిమిషాలు కూర్చుని అమ్మని చూసేదాన్ని.*

*అప్పటికే పనంతా (ఇల్లు శుభ్రం, అంట్లు, బట్టలు, వంట, ఆవిడ భోజనం) చేసేసి, విశ్రాంతి దేవత లా చిరి చాపలో ఒక మెత్త(తలగడ) పై తల ఆనించి హాయిగా సిలోన్ లో వచ్చే పాటల్లో మధ్యలో తన గొంతు కలుపుతూ వింటూ ... విశ్రాంతి తీసుకునేది.*

*మళ్లీ మధ్యాహ్నం స్కూల్ కి వెళ్లి, సరిగ్గా నాలుగ్గంటలకు ఇంటికి రాగానే.. మధ్యాహ్నమ్  మిగిలిన అన్నం కాస్త కలిప్పెట్టి, చాయ్ ఇచ్చేది.*
*అవి కానిచ్చేసి,  ఆడుకొవడానికి వీధిలోకెళ్లేదాన్ని.*

*మమ్మల్ని చూస్తూ అరుగు మీద గోడకు ఆనుకుని, మా నాన్న కోసం ఎదురు చూస్తూ నుంచునేది అమ్మ. అలా ఆడుకునే మమ్మల్ని చూడటమే ఆమెకి కాలక్షేపం.*

*ఆరింటికి లోపలికెళ్లి దేవుడికి సంధ్య వేళ అని దీపం వెలిగించి, పొయ్యి మీద(కట్టెలా పొయ్యి) రాతిరి భోజనం కోసం బియ్యం పెట్టేది.*

*ఈలోపు నాన్న వచ్చేసేవారు.. నాన్న చేతి సంచీలో  ఏవుందా అని కాచుకుని చూసేదాన్ని.. ప్రతిరోజూ సాయయంత్రపు దేవుడి ఆరగింపు కోసం వస్తూ వస్తూ  ఏదో ఒక రకమైన పండు తెచ్చెవారు.*

*అసలు మాకప్పుడు ఎన్ని రకాల ఫ్రూట్సో, సలాడ్సో ఇవేమీ తెలీదు.*

*ప్రతి నెల తనఖా(సాలరీ) రాగానే ఒక కొవాబిళ్ల ల స్వీట్ పాకెట్ తెచ్చేవారు నాన్న… అది కూడా ఆరగింపు చేసి అందరికీ సమానంగా పంచేవారు. ఆయనకెమీ మిగుల్చుకోకుండా..*

*"నాన మరి నీకూ" అని అడిగితే.. "నువ్వు తింటే నేను తిన్నట్టే అమ్మీ" అని నవ్వుతూ తల నిమిరేవారు...*
*ఏదీ ఆశించని ప్రేమ.. ఒక స్వచ్ఛత ఆయన కళ్ల లో...*

*కాసేపయ్యాక, అమ్మ కోవా బిళ్ల లో సగం నాన్నకిచ్చి చేరిసగం తినేవారు.*
*"అమ్మ నీకు సగమే చాలా " అంటే... "నాన్న తింటే నేను తిన్నట్టే" అనేది.. నవ్వుతూ...!!*

*ఉన్నంత లో తినడం, ఉన్నదాంట్లో పంచుకోవడం... మనకు లేనిది, లేమి అనేదే తెలియకపోవడం..!!*

*అలా కాలక్షేపంగా మాట్లాడుతూ.. రేడియో లో పాడి, పంట కార్యక్రమం అవగానే భోజనాలు, ఆ వెంటనే నిద్ర..!!*

*ఎంత అందమైన అమాయకమైన బాల్యం... కారణాలు తెలీదు, అంతరాలు, అంతస్తులూ తెలీదు... దోపిడీ తెలీదు,*

*కుటుంబము, వీధిలో ఆడుకునే దోస్తులూ పండక్కి నాన్న తెచ్చే తాన్ క్లాత్ తో అమ్మ కుట్టించిన గౌన్ వేసుకున్నప్పుడు కలిగే మురిపం తప్ప ఇంకే ప్రపంచమూ తెలియదు.*

*ఆ బాల్యపు ఒడిలో.. స్వచ్చమైన ప్రేమ లో, కల్మషం లేని చిరునవ్వు లో నేనెప్పటికీ పసి పాపనే..!!*
 *`నేనుముందుపోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు`* . 
*పైనున్న భగవంతుడికి తెలుసు. .......*                                                               

*2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది...*

*సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.*
 
*తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట.* 
*భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.*
                                                                                                            *భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు...*
 
*కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా !* 

*ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం  తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు*

*‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం*

 *ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!*
                                                                                                                                                                                      *నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు* 
*పైనున్న భగవంతుడికి తెలుసు.*
 *ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు.* 
*ఆ తర్వాత నా సంగతి చూడు’*
*అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.*
*‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు.* 
*నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది.* 
*చీకటంటే భయం.* 
*ఉరిమితే భయం.* 
*మెరుపంటే భయం.* 
*నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?* 
*అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని* 
*లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’.*  *`ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !`*
                                                _
     *నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే..* *పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.*
                                                                                                                                                 *ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.*
                                                                                                                                                                                                                                                                                                                                                       *సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని..*

*`తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.`* 

*`కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.`*
 
*భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.*

 *`భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది.`* 
*`భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.`*

*స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది*. 

*తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది.*
*`అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది.`* 
*`ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.`*
                                                                                                                                                                                                                            *భావోద్వేగ బలం ఆమెదే :-*

*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, `స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది`.* 
*సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.*
*ఒక విధంగా చెప్పాలంటే..*
*ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌.*
*ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.*
*ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..*

*అందుకే...*
*`ఆడదే ఆధారం, మగాడికి ఆడదే సర్వస్వం...`*