Thursday, November 28, 2024

 *ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి.*

*ఒకటి తనని నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లికి,*

*రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి, కని, పెంచి, ఇచ్చే భార్యకి.*

*ఇద్దరు చేసింది ఓకే పని,*
*ఇద్దరు పడింది ఓకే కష్టం,*
*ఇద్దరు చూపించేది ఓకే ప్రేమ.*

*ఒకరు తను కళ్ళు తెరవగానే మొదటిగా చూసినవారు.*

*మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలి అనుకునేవారు.*

*ఎవరు ఎక్కువ కాదు,ఎవరు తక్కువ కాదు.*

*కాకపోతే*

*తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది,*

*ప్రతి భార్య చేరుకోవాలి అనుకునే గమ్యం కూడా అదే ......*

*అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందనంత ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది.*

*కానీ*

*ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక*

*అప్పుడు*

*తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది,*

*ముందు తల్లికి కొడుకు అయ్యాకే,*
*తనకి భర్త కాగలిగాడు అనే నిజం భార్యకి అర్థమవుతుంది....*

*ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.ఇద్దరిలో ఎవరు వారిది వారిలో ఏ  స్థానం తగ్గిన మగవాడి జీవితం తలకిందులు అవ్వుతుంది....*❤️

No comments:

Post a Comment