*పెద్దలకు సవినయ నివేదన*
సభ్యులకు నమస్కారములు .
సృష్టికే ప్రతి సృష్టి చేయగల కలియుగ మానవుడు కలి దుష్ప్ర భావమును నిర్వీర్యము చేయ సంకల్పించి *ఓం సర్వేషాం స్వస్తిర్భవతు! సర్వేషాం శాంతిర్భవతు! సర్వేషాం పూర్ణ: భవతు!సర్వేషాం మంగళం భవతు!సర్వే సంతు సుఖినః!సర్వే సంతు నిరామయాః!సర్వే భద్రాని పశ్యంతు!మా కశ్చి దుఃఖ భగ్బవేత్!లోకాః సమస్తాః సుఖినో భవంతు!సర్వే జనాః సుఖీనో భవంతు!సమస్త సన్మంగళాని భవంతు* అంటూ కార్యాచరణకు పూనుకున్నాడు.
*అనుష్టానము ఒక్కటే వర్తమాన దోష నివారకము, ప్రపంచ శాంతి కారకము, మరియు సర్వారోగ్య ప్రదాయకమని మానవుడు విశ్వసించుచున్నాడు*.
భగవత్ కార్యాలలో *అనుష్టానం అను పదం వాడడం సర్వ సాధారణము. కాని, అనుష్టానం అను పదం యొక్క అర్థం విపులంగా పరిశీలిద్దాము. తోటి వారిని సంతోష పెట్టడం, తోటి వారి కన్నీరు తుడిచే కార్యమేదైనా అనుష్టానమే. ఫలానాలా చేస్తేనే అనుష్టానం అని గిటిగీసి చెప్పడానికి వీలులేని విస్తృతమైన అర్థం కల పదం అనుష్టానం*. సమాజ హితం కోసం ఏకాగ్రతతో నిరంతరం చేసేదే అనుష్టానం. *మన స్థాయిలో సమాజానికి ఉపయోగపడేలా మనం చేసే ప్రతిదీ అనుష్టానమే*.
ఆధ్యాత్మిక, పరమాత్మ, పారమార్థిక చింతనలో చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు ముందంజలో ఉండి ఇతర వర్ణాలకు మార్గదర్శకులుగా వ్యవహరించుచున్నారు. బ్రాహ్మణులంటే కుల బ్రాహ్మణులు మాత్రమే కాదు. అనేకార్థాలతో పాటు *బ్రహ్మ* పదమునకు మరియొక అర్థము *వేదము*. వేదమంటే *జ్ఞానము*. ఈ పదము నుండియే *బ్రాహ్మణ* శబ్ద ముద్భవించినదని భావించ వచ్చును. కాబట్టి వేదాధ్యయనము చేసిన వారెవరైనా బ్రాహ్మణ శబ్దమునకు అర్హులు. అనాదిగా వేదాధ్యయనము సాగించుచున్న ఆయా వంశీకులందరు బ్రాహ్మణులుగా పిలువ బడుతున్నారు. ప్రస్తుత కాలంలో అధిక శాతం బ్రాహ్మణులందరు కుల బ్రహ్మణులుగా జీవిస్తున్నారు. *అవుతే, కుల బ్రహ్మణులుగా మాత్రమే మిగిలిపోకుండా లోక కళ్యాణానికై గుణ మరియు జ్ఞాన బ్రాహ్మణులుగా ఎదగాలి*.
కొన్ని కొన్ని ముఖ్య విషయాలలో జాతి నిద్రావస్థలో ఉన్నప్పుడు జాతిని మేల్కొలిపి, సరి ఐన మార్గ దర్శనం గావించే మహానుభావులను *వైతాళికులు* అని, *సమాజోద్దారకులు* అని,
*మహాత్ములు* అని
*గౌరవంగా సంబోధించడం* వారి వృత్తి ప్రవృత్తిని యువతరం ఆదర్శంగా తీసుకోవడం అనుసరించడం
ఆనవాయితి. కులం ఏమైతే నేమి మనుసులొకటై మనుగడ సాగించిన నాడు జాతికి పునర్వైభవం ప్రాప్తిస్తుంది. గత చరిత్ర పరిశీలించినప్పుడు వైతాళికులుగా బ్రాహ్మణులతో బాటు ఇతర వర్ణం/ కులస్తులు కూడా ఉన్నారు. వీరందరూ నిరంతర సమాజ సేవా కార్యక్రమాల్లో నిష్ణాతులైందున వైతాళికులుగా కీర్తి పొందినారు. వారి మార్గదర్శకాలు మనకందరికీ అనుసరణీయములైయున్నవి.
ధన్యవాదములు.
(సశేషము)
No comments:
Post a Comment