Thursday, November 28, 2024




 చక్రార్థ నిరూపణ

  (చక్ర విజ్ఞానం)

ఉప చక్రాలు - లలనా చక్రం

📚✒️భట్టాచార్య

      మన శరీరం లో ఉన్న 7 ప్రధాన చక్రాలు కాక ...ఇంకా ఇతర చక్రాలు /శక్తి కేంద్రాలు ఉన్నాయి. 

అందులో తాలు చక్రం లేదా లలనా చక్రం ఒకటి.  ఇది అర్థ చంద్రాకారంగా ఉండడం వలన  ఈ ప్రదేశానికి cresent moon చిహ్నంగా చూపిస్తారు. 

బిందువు అంటే చుక్క అని అర్థం. కర్మలు శిఖా స్థానంలోనే దాక్కొని ఉంటాయి.

 పూర్వకాలంలోనూ /ఈనాటి కాలంలోనూ కొందరు సాధకులు   ఈ శిఖను బాగా బిగించి, ముడి కట్టుకుని , వేదాధ్యయనం చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే అనుకోండి. నిద్ర మత్తు స్తబ్ద స్థితులనుండి ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడానికి ఇలా చేస్తూ ఉండేవారు.

 ఈ స్థానాన్ని ఎప్పుడూ జాగృతితో ఉంచి ...ఇక్కడ ఉండే అమృతాన్ని ఎప్పుడూ క్రింద పడకుండా చూసుకోవాలి. 

ఈ లలనా చక్రాన్ని "తాలు చక్రం" అనికూడా అంటారు. ఈ లలనా చక్రం చైతన్యవంతం కాకపోతే, జీవితం బాధాకరంగా ఉంటుంది. ఈ చక్రం చైతన్యం కావడానికి "ఖేచరి" ముద్ర సహాయకారి. (ఈ ముద్రను గురువు సహాయంతో అభ్యసించాలి) 

ఈ చక్రస్థానాన్ని ఉత్తేజ పరచడానికి షణ్ముఖీ ముద్ర, నవముఖీ ముద్ర వేసుకోవాలి. ఈ లలనా చక్రమును కొన్ని సార్లు "తాలు చక్రము" అని కూడా అంటారు. ఇది మన నోటి కుహరంలో గల అంగిలి యొక్క మూలంలో ఉంటుంది. సాధన తీవ్ర దశలలో "అమృతం"  బిందువు నుండి స్రవిస్తున్నపుడు...ఈ స్రావం , లలనా చక్రంలోనే ఒకింత సేపు నిల్వ ఉంటుంది. ఈ స్రావము మరల విశుద్ధ చక్రముచే శుద్ధి చేయబడుతుంది. 

ఒక సాధకుడు ఖేచరీ ముద్రలో సిద్ధుడైతే, ఈ అమృత స్రావము లలనా చక్రము నుండి విశుద్ధ చక్రం వైపునకు పయనిస్తుంది.

 విశుద్ధ చక్రంలో ఈ అమృతం శుద్ధి చేయబడుతుంది. విశుద్ధ చక్రం సక్రియంగా లేకపోతే, ఆ అమృత స్రావం మణిపూరకం వైపు వెళుతుంది. మణిపూరకంలో ఈ స్రావం కలిసిపోతుంది.

 హఠ యోగ సిద్ధాంతాలు ఏమి చెబుతున్నాయంటే, ఈ అమృత పానం వలన జీవిత కాలం పొడిగించబడుతుంది. కాయ సిద్ధి కలుగుతుంది.

     సౌభాగ్యోపనిషత్తు ప్రకారం ఈ తాలు చక్రం 12దళముల కాంతివంతమైన కమలంగా ఉంటుంది.

 కొన్ని తంత్ర గ్రంథాలు ఈ చక్రానికి 64 దళాలు వెండి రంగులో ఉంటాయని, వీటికి "ఘంటిక" అనే పేరు గల కాంతివంతమైన ఎర్రని రంగు గల అంచులుంటాయని, ఈ చక్రం చైతన్యవంతం అవ్వడం వలన ....చంద్రుని శక్తి "అమృతం" రూపంలో స్రవిస్తుందని చెబుతున్నాయి.

 ఈ చక్రం సంపూర్తిగా చైతన్య వంతం అయిన యోగికి "శూన్య అవస్థ" అనుభవానికి వస్తుందని తాంత్రికులు చెబుతారు.

 ఈ "తాలు చక్రం" యొక్క 64 సూక్ష్మ దళాలు, 64గురు యోగినుల  గృహములుగా చెప్పబడినవి. అష్ట సిద్ధులు ఆశించేవారు, ఈ చక్రాన్ని చైతన్య పరచుకోవడం ముఖ్యం. సాధనలో కొన్ని సార్లు ఈ చక్రం చైతన్యవంతమైనది గానూ, ఇబ్బంది కరమైనది గానూ అనిపిస్తుంది. సాధకులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

విశుద్ధ, తాలు చక్రం/లలనా చక్రాలు ప్రక్క ప్రక్కనే ఉంటాయి.ఇక్కడి నుండీ అమృతం క్రిందకి జాలువారుతూ ఉంటుంది.

ఆ అమృతం మణిపూరకానికి చేరుకున్నప్పుడు అక్కడి అగ్ని తత్వం వల్ల ఆవిరై పోతుంది. శరీరంలో ఎక్కడైనా విష పదార్థాలు పేరుకొని ఉంటే వాటిని శుద్ధి చేయగలిగే శక్తి ఈ అమృతానికి ఉంది.

ఈ బిందువిసర్గం/లలనా చక్రం అత్యున్నత సత్యలోకంతో అనుసంధానమై ఉంటుంది. ఇది ఆనందమయ కోశ స్థానం. ఇక్కడ మత్తు కలిగించే రసాలు ఉద్భవిస్తాయి. 

ఖేచరీ ముద్రవలన ఈ అమృతం క్రింద పడి వృథా కాకుండా నిలువ వుంటుంది.              

No comments:

Post a Comment