Thursday, November 28, 2024

 *ధ్యానం మార్గం*
ఆకాశంలో రాత్రివేళ అసంఖ్యాకంగా నక్షత్రాలు కనిపిస్తాయి.
సూర్యోదయమయ్యాక అవేమీ కనపించవు. అంతమాత్రం చేత ఆకాశంలో
నక్షత్రాలు లేవని చెప్పగలమా? అదే విధంగా మనలో ఉన్న అజ్ఞానం
(అవిద్య) కారణంగా భగవంతుని చూడలేకున్నాం. అంతమాత్రాన
భగవంతుడే లేడని అనలేం కదా!
❤️🕉️❤️
మన ఆలోచనలలో రెండు ప్రవాహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చేతనస్థాయిలో సాగుతుంటే, రెండవది అచేతన స్థాయిలో సాగుతూవుంటుంది. మీరు పని చేసేటప్పుడు చేతనస్థాయి ప్రవాహాన్ని ఆ పని వైపు, అచేతన స్థాయిలోని ప్రవాహాన్ని భగవంతునివైపు మళ్ళించండి. పని పూర్తి చేసినపుడు, రెండు ప్రవాహాలనూ భగవంతునివైపే లక్ష్యంగా ఉంచండి.
❤️🕉️❤️
లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి... అన్నీ నీలోనే
ఉన్నాయి.
❤️🕉️❤️
మానవునిలో ఏదేది ప్రబలమో, మంచిదో, శక్తిమంతమో అదంతా ఆ దివ్యత్వ వ్యక్తీకరణే. అనేకులలో అది గర్భితంగానే ఉన్నా, అందరూ దివ్యులే. కాబట్టి మనిషికీ మనిషికీ మధ్య నిజానికి భేదం లేదు. Swami Vivekananda.     

No comments:

Post a Comment