Thursday, November 28, 2024

 *`నాన్నా ఐ లవ్ యు...`*
*`ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు......`*
"*అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా  కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది...*
*" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు. విషయమేంటి..? " అని అడిగింది  పెద్దకోడలు...*
"*ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది...*
*కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా...!*
*మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను"*
*అంది చిన్నకోడలు...*
"*ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు...*
*"మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం...*
*అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి..*
*ఈ వయస్సులో ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది...*
*ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం*
*మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.*
"*దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు."* 
*అంది పెద్దకోడలు...*
*" మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు.*
*ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు...*
*తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని*
*చూసుకోవలని వారి ఉద్దేశ్యం....*
*కానీ రోజూ భార్యల నస భరించలేక ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు...*
*" నాన్నా..! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం.*
*మీకు కూడా వయస్సు అయింది... అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి*
*చూసుకునేది. దగ్గరిలోనే మంచి* *ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ*
*చేరుద్దామని అనుకుంటున్నాము.* *మీరేమంటారు..? "*
*" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని*
*బయలు దేరండి ఇద్దరూ..!?* *అన్నారు తండ్రి.*
*షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి...*
"*అదేంటి నాన్నా..! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి..? బయట*
*బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి...*
*ఆస్తిని మాకే కదా ఇవ్వాలి...* *ఆలోచించండి ఒకసారి..."*
"*నిజమే..! మీకే ఇవ్వాలి నా* *ఆస్తిని.కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది....*
*ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా  ఉన్నాం...*
*ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి...*
*నా తదనంతరం ఈ ఇల్లు మీకే..!* 
*పైన ఇంటి బాడుగతో, నాకు వచ్చే pension తో ఎలాగోలా* *బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు  తండ్రి...*
*" అదేంటి మామ గారూ..! ఊర్లో జనాలు ఏమనుకుంటారు..?* *బయటికి వెళ్ళి అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి....ఆలోచించండి"*
*అన్నారు కోడళ్ళు....*
*ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు* *వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు.*
*ఇది నా ఇల్లు...*
*నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా*
*ఇది నా సొంతం. నా గురించి* *ఆలోచించని మీరు జనాల గురించి*
*ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.*
*ఈ ఆలోచన*
*మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి*
*వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ*
*తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు...*
*షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ కోడళ్ళకు.*
*తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా*
*ఆశ్రమాలకు వెళ్ళిపోతు్న్నారు. వారు ఇలా తిరగబడితే తప్ప*
*గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న*
*తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ* 
*శరణాలల్లో ఉంటున్నారు...*
*వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది...*🙏
*తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ*
*చేయకండి....*
*వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి...*🙏

No comments:

Post a Comment