నారద భక్తి సూత్రములు
44 వ సూత్రము
కామక్రోధ మోహ స్ర్ముతి భంశ బుద్ది నాశ సర్వనాశ కారణ త్వాత్"
దుస్సాంగత్యము వల్ల కామక్రోదాభివృద్దికి, స్మృతి భ్రంశానికి, బుద్ధినాశనానికి,చివరకు సర్వనాశనానికి కారణమౌతున్ది.
దుర్జన స్నేహం వల్ల అధర్మ పూరితమైన కోరికలు పెరిగి అవి తీరక/వాటి మీద విషయవాంఛ పెరిగి కామక్రోధాదులకు గురిఅవుతాడు.వాటి వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది.కృతజ్ఞత భావం,అభావం అవుతుంది.దానితో మనిషి మేలు మరిచి కృతఘ్నుడు అవుతాడు.వివేకం కోల్పోయి చివరకు అధోగతి చెందుతాడు.
భక్తుడు చెడు దృశ్యాలు చూడరాదు,చెడు అనరాదు,చెడు సంగతులు వినారాదు,వాటిని గూర్చి చర్చించరాదు,ఏకాంతముగా కూడా వాటిగురించి ఆలోచించరాదు.దృశ్యం మనస్సు పై ముద్ర వేస్తుంది,మనస్సు ఆలోచిస్తుంది అప్పుడు భక్తుడి మనస్సు కలుషితమై సన్మార్గం పతనమవుతుంది.
45 వ సూత్రము
"తరంగాయితా అపీమే సంగాత్ సముద్రా యంతి"
ఈ క్రమక్రోధాలు ప్రథమంలో చిన్న చిన్న అలలు గా పుట్టి క్రమం గా పెద్ద సముద్రం అంత అవుతాయి.
మొదట అల్పమైనవిలే అని అవగుణాల యెడల ఉపేక్ష చేస్తే అవి వెర్రితలలువేసి విజృంభిస్తాయి.బీజం లోనే తీసివేయాలి, లేకపోతె అవి పెద్ద ప్రమాదాలను తెచ్చిపెడతాయి. దుష్ట సాంగత్యం/దుష్ట ఆలోచన అసలు అంటుకునేకూడదు. అంటినచో వెంటనే తుడిచివేయాలి.
కామక్రోధాలు సద్విచారానికి రవ్వంతకూడా స్థానం ఇవ్వవు.కావునా భక్తులు దోషాలను నిశ్శేషం చేయాలి. దుస్సాంగత్యము వల్ల పతనమైన భక్తులు పెక్కుమంది.
No comments:
Post a Comment