నాగులేరు చెన్నకేశవ స్వామి గుడి సమీపంలోని పల్నాటి వీరుల గుడిలో ఉన్న ఇద్దరు ముస్లింల సమాధుల అసలు కథ..
అక్కడున్న స్థానిక ధర్గా ముజావర్లు చెప్పే కథ ముందు చదవండి... దాని తర్వాత అసలు కథను చదువుదురు...
ఔరంగజేబు సైనికులు జాఫర్, ఫరీద్... వీరు యుద్ధం కోసం బయలు దేరుతూ మార్గ మధ్యంలో నాగులేరు ఇప్పుడు (పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతం) ఇక్కడికి వచ్చేసరికి రాత్రి అయ్యింది. వీరు ఆహారం కోసం కొన్ని రాళ్ళని పొయ్యి రాళ్లుగా పెట్టుకొని వంట చేసుకొని తిని పడుకున్నారు.
కలలో శ్రీ చెన్నకేశవ స్వామి కనిపించి నేను రాతి రూపంలో ఉంటే మీరు నన్ను పొయ్యి రాయిగా పెట్టి వంట చేసుకున్నారు అని ఆగ్రహించి వాళ్ళ కళ్ళు పోగొట్టారు. అప్పుడు వారు క్షమించమని అడిగితే స్వామివారు శాంతించి కళ్ళు ఇచ్చారు. వారు కృతజ్ఞతగా అక్కడ గుడి కట్టించారు. తర్వాత కాలంలో వారు చనిపోతే వారిమీద ప్రేమతో అక్కడ జనం వారిని ఆ గుడిలో సమాధి చేసినారు, పూజిస్తున్నారు. ఇదీ ముజావర్లు చెప్పే కథ.
ఇక్కడ మనం గమనించాల్సిన ఓ ముఖ్యమైన విషయం... ఏ హిందూ గుడిలోనూ శవాన్ని పూడ్చిపెట్టరు. ఆఖరుకు ఆ గుడి ప్రధాన పూజారినైనా, గుడి కట్టించిన రాజునైనా. అవునా?
ఇప్పుడు అసలు కథ తెలుసుకుందాం...
ఔరంగజేబు సైన్యంలోని ఒక పటాలానికి జాఫర్, ఫరీద్ లు నాయకత్వం వహించారు.
1687 లో గోల్కొండను జయించిన తర్వాత గుంటూరు మొఘలుల పాలనలోకి వెళ్లింది. ఈ జాఫర్ & ఫరీద్ లు నేటి కజకిస్తాన్ నుంచి వచ్చి ఔరంగజేబ్ సైన్యంలో చేరి పనిచేసేవారు.
వీళ్ళకు విగ్రహారాధన అంటే తీవ్ర వ్యతిరేకమైన భావన.
గుళ్ళు కూల్చి వాటిని దర్గాలుగా మార్చిన చరిత్ర వీళ్ళ సొంతం.
ఆ క్రమంలో వేల సంవత్సరాలనాటి నాగులేరు చెన్నకేశవ ఆలయ సమీపంలోని వీరులగుడిని ధ్వంసం చేసి మూలవిరాట్టును అత్యంత దుర్మార్గంగా అపవిత్రం చేశారు. నాటి గుడి సంరక్షకులైన వీర కన్నమదాసు వారసులు మాల సోదరులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.
చెన్నకేశవుడు మాలల కులదైవం. తమ కులదైవానికి జరిగిన అవమానాన్ని సహించలేక రాత్రికి రాత్రి ఈ జాఫర్, ఫరీద్ లు బసచేసిన గుడారాలను తగులబెట్టి వాళ్ళ సైన్యం మెడలను చేతులతో విరిచి చంపేశారు.
మూడు రోజులపాటు జాఫర్, ఫరీద్ ల తోపాటు వాళ్ళ జీహాడీ సైన్యాన్ని ఊచకోత కోశారు.
విషయం తెలుసుకున్న కొండవీడు జీహాడీ పాలకుడు భారీ సైన్యంతో తరలి వచ్చి వారంపాటు జరిగిన నాగులేరు యుద్ధంలో మాలసోదరులైన చెన్నమ దాసు, కన్నదాసులను ఇతర హిందూ వెలమ, క్షత్రియ, రెడ్డి వీర సోదరులనూ వధించి నాగులేరులో నెత్తురు పారించి తిరిగి ఆ గుడిని స్వాధీనం చేసుకున్నాడు.
కసితీరక... జాఫర్, ఫరీద్ ల శవాలను గుడి నడిబొడ్డున పాతిపెట్టి అక్కడ సమాధులను నిర్మించి ఎవడైనా సరే గుళ్ళోకి పోవాలంటే ముందుగా ' ఆ సమాధులకు సలాం చేసి ' దాటుకొని వెళ్లాలని శాసనం వేయించాడు.
అసలు సత్యం ఇదీ.
కాలక్రమేణా అసలు కథను మభ్యపరిచి వాళ్ళే గుడులు కట్టించారని ప్రచారంలోకి తెప్పించాడు కొండవీడు పాలకుడు. బ్రిటిష్ పాలనలో అక్కడున్న శాసనాన్ని చారిత్రిక ఆనవాళ్ళు లేకుండా తొలగించివేశారు.
ఇప్పుడు అక్కడి సామాన్య హిందువులే కాదు చరిత్రకారులం అని చెప్పుకునే మేథావులు కూడా ముస్లిములు కట్టించిన చెన్నకేశవ గుడి అంటారు. ఇదీ మన దౌర్భాగ్యం.
ఆలోచించండి..భారత్ లోని ఏ గుడిలోనైనా గర్భగుడికి సింహద్వారానికి మధ్యలో శవాలను పాతిపెట్టిన చరిత్ర ఉన్నదా??
వీళ్ళు మన సామాన్య హిందువులను తప్పుదోవ పట్టించి ఎవరైతే ఆ గుడిని కూలగొట్టారో వాళ్ళకే హిందువులు దండంపెట్టేటట్టు కుట్రపన్ని దాంట్లో విజయం సాధించారు.
అందుకే ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా షుమారు 4 లక్షల పైచిలుకు కనుమరుగైన లేక దర్గాలుగా మార్చబడ్డ దేవాలయాల చరిత్రను తవ్వితీస్తున్నారు.
పల్నాటి వీరుల పండుగ మొదలు కాబోతున్నది..పల్నాటి హిందూ బందువులందరికీ ఈ సత్యం తెలియాల్సిన అవసరం ఉన్నది..
మనదేశం మనచరిత్ర..మహచరిత్ర ఇది మహాదేవుని చరిత్ర. హరహార మహాదేవ్. భారత్ మాతాకీ జయ్..
#haraharamahadev #JagoHinduJago
#Palnadu #Karempudi #Brahmanayudu #PalnatiYuddham
No comments:
Post a Comment