Thursday, November 28, 2024

 *శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు..!?*

*🌸పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు.. శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు.* 

*🌿అలాగే.. విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు. శివ కేశవుల్లో బేధం లేనపుడు.*

*🌸ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డనామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ పోస్టులో చూద్దాం.*

*🌿మానవ శరీర నిర్మాణం ప్రకారం.. కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు.*

*🌸ఇది బయటకు కనపడకపోయినా.. దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది.*

*🌿ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు.*

*🌸ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమంగా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు.*

*🌿ఐతే హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు. ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా శివుడు అలా ధరిస్తాడట.*

*🌸అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు. పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే.. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి.*

*🌿కనుక వాటికి గుర్తుగా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూదిని ధరిస్తూ ఉంటారు.*

*🌸అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరు గా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువు గా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు.*

*🌿ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపం గా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు.*

🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁

No comments:

Post a Comment