. *☘️శివుడు రక్షింపబడుట☘️*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
*(2 వ భాగము)*
*ఈ భౌతికజగత్తు త్రిగుణఫలము కనుక నానారకాలైన ప్రకటములు ఈ మూడు గుణాల నుండే వస్తాయి. భౌతిక విజ్ఞానశాస్త్ర సహకారముతో నవీన నాగరికత. పలుయంత్రాలను, సౌఖ్యాలను సృష్టించింది. అయినా అవన్నీ త్రిగుణముల వివిధ అంతఃప్రక్రియలే అయియుంటాయి. శివభక్తులు పలు భౌతికసంపత్తులను పొంద గలిగినా వారంతా త్రిగుణ నిర్మితములైన వస్తువులనే ప్రోగుచేసికొంటున్నారని తెలిసికోవలసి ఉంటుంది. త్రిగుణములు తిరిగి పదహారు తత్త్వములుగా, అంటే దశేంద్రియములు (ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు), మనస్సు, పంచతత్త్వములుగా (పృథ్వి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) విభజింప బడినది. కనుక ఈ పదహారు తత్త్వములు త్రిగుణముల విస్తారములే. భౌతికసుఖము లేదా ఐశ్వర్యమంటే ఇంద్రియ భోగమనియే, విశేషముగా ఉపస్థము, జిహ్వ, మనస్సు భోగమనియే భావము. మనస్సును* *మధించడము ద్వారా మనిషి ఉపస్థభోగానికి, నాలుక భోగానికి నానారకాలైన ప్రీతికర వస్తువులను సృష్టించుకుంటాడు. ఈ భౌతికజగత్తులో మనిషి యొక్క ఐశ్వర్యము అతని ఉపస్థ జిహ్వ భోగము దృష్ట్యా అంచనా వేయబడుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే అతడెంత సమర్థవంతముగా మైథునభోగాన్ని అనుభవించ గలుగుతున్నాడు, రాజీపడనట్టి జిహ్వచాపల్యాన్ని రుచికరమైన ఆహారపదార్థాలను తింటూ ఎంత సమర్థవంతముగా తీర్చు కుంటున్నాడనే దృష్ట్యా అది గుర్తించబడుతుంది. ఉపస్థసుఖము, జిహ్వసుఖము అనే రెండు నియమాల ఆధారంగా సుఖాన్ని అధిగమించడానికి మానసికకల్పన ద్వారా భోగ్యవస్తువులను తయారు చేసేటట్లు భౌతిక నాగరికత ప్రేరేపిస్తుంది. శివభక్తులు ఎందుకు ఐశ్వర్యవంతులుగా ఉంటారని పరీక్షిత్తు శుకదేవగోస్వామిని అడిగిన ప్రశ్నకు సమాధానము ఇందులోనే ఉన్నది.*
*శివభక్తులు కేవలము భౌతికగుణాల దృష్ట్యానే ఐశ్వర్యవంతులై ఉంటారు. నిజానికి అటువంటి నామమాత్ర నాగరికత పురోగతి సంసార బంధనానికి కారణమౌతుంది. వాస్తవానికి అది పతనమేగాని పురోగతి కాదు. సారాంశమేమంటే శివుడు త్రిగుణాలకు ప్రభువు కనుక ఇంద్రియసంతృప్తి కొరకు ఆ గుణాల అంతఃప్రక్రియచే తయారైన వస్తువులు అతని భక్తులకు ఇవ్వబడతాయి. అయినా మనిషి అటువంటి గుణమయ అస్తిత్వము నుండి బయటపడాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. "ని స్త్రైగుణ్యో భవార్జున", త్రిగుణాలకు అతీతము కావడమే మానవజన్మ కార్యము. మనిషి "నిస్త్రైగుణ్యుడు" కానిదే భవబంధము నుండి బయటపడడు. ఇంకొక రకంగా చెప్పాలంటే శివుని నుండి లభించే వరములు ఐశ్వర్యయుతములుగా కనిపించినప్పటికిని అవి నిజానికి బద్ధజీవులకు లాభదాయకములు కానేకావు. శుకదేవగోస్వామి పరీక్షిత్తుతో పలుకుతూ "దేవదేవుడగు హరి ప్రకృతి. త్రిగుణాలకు పరమైనవాడు" అని చెప్పాడు. తనకు శరణుజొచ్చినవాడు ప్రకృతి త్రిగుణాల నియంత్రణను అధిగమిస్తాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. హరిభక్తులే త్రిగుణ నియంత్రణకు అతీతులై ఉంటారంటే నిక్కముగా ఆ దేవదేవుడు వాటికి అతీతుడే అయియుంటాడు. అందుకే శ్రీమద్భాగవతములో శ్రీహరియే (శ్రీకృష్ణుడే) ఆదిదేవుడని చెప్పబడింది. ప్రకృతులు రెండు రకాలుగా ఉంటాయి. అవే అంతరంగశక్తి, బహిరంగశక్తి అనేవి. శ్రీకృష్ణుడు ఆ రెండింటికి ప్రభువు. అతడు "సర్వదృక్కు". అంటే ఆంతరంగిక, బహిరంగ శక్తుల కలాపాలను అతడు వీక్షిస్తాడు. అతడు "ఉపద్రష్ట" (పరమ ఉపదేశకుడు) అని కూడ వర్ణించ బడినాడు. ఆతడు పరమ ఉపదేశకుడు కనుక తన నిర్దేశములను పాటించే దేవత లందరి కన్నను ఆతడు ఉన్నతుడు. భగవద్గీత యందు, శ్రీమద్భాగవతమునందు. చెప్పబడినట్లు భగవంతుని ఉపదేశములను ప్రత్యక్షముగా పాటించేవాడు క్రమముగా నిర్గుణుడు (గుణాతీతుడు) అవుతాడు. నిర్గుణునిగా కావడమంటే ఐశ్వర్యవిహీనుడై ఉండడమని అర్థము. ఎందుకంటే ఇదివరకే వివరించ బడినట్లు భౌతికసంపత్తులంటే త్రిగుణముల అంతఃప్రక్రియల వృద్ధి యనియే భావము. భగవదర్చనచే మనిషి భౌతికసంపత్తులతో గర్వితుడు కావడానికి బదులు కృష్ణభక్తి భావనలో ఆధ్యాత్మికజ్ఞాన పరిపూర్ణుడౌతాడు. నిర్గుణుడు కావడమంటే నిత్యమైన శాంతి, నిర్భయత్వము, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము పొందడమని అర్థము. భౌతికగుణ కల్మషము నుండి విముక్తికి ఇవి చిహ్నములు అవుతాయి.*
*పరీక్షిన్మహారాజు ప్రశ్నకు సమాధానమును తెలియజేస్తూ శుకదేవగోస్వామి అతని పితామహుడైన ధర్మరాజుకు సంబంధించిన ఒక చారిత్రాత్మిక సంఘటనను ఉదహరించారు. అశ్వమేధయజ్ఞాన్ని పూర్తిచేసిన తరువాత పెద్దల సన్నిధిలో ధర్మరాజు ఈ విషయాన్నే శ్రీకృష్ణుని అడిగాడు. శివభక్తులు ఐశ్వర్యయుతులుగా ఉంటే విష్ణుభక్తులు ఆ విధంగా ఐశ్వర్యయుతులు కాకపోవడానికి కారణమేమిటి? ఇక్కడ శుకదేవుడు "నీ పితామహుడు" అని ధర్మరాజును ఉద్దేశించి విశేషముగా . పలికాడు. ఆ రీతిగా పరీక్షిత్తు తాను శ్రీకృష్ణునికి సంబంధించినవాడనవి, తన తాతలు దేవాదిదేవునితో సన్నిహిత సంబంధము కలిగియుండేవారని తలచి. ధైర్యపడగలడు. స్వభావరీత్యా శ్రీకృష్ణుడు సర్వదా సంతుష్టుడై ఉండేవాడే అయినప్పటికిని ధర్మరాజు ఈ ప్రశ్నను అడిగినపుడు అతడు మరింత సంతుష్టుడయ్యాడు. ఎందుకంటే ఆ ప్రశ్న. దాని సమాధానము సమస్త కృష్ణభక్తులకు ఎంతో అర్థవంతమైనది. శ్రీకృష్ణ భగవానుడు ఏదేని విషయాన్ని ఒక ప్రత్యేక భక్తునితో మాట్లాడినపుడు అది ఆ భక్తునికే గాక ఇతర భక్తులందరికీ, నిజానికి సమస్త మానవాళికి ఉద్దేశించబడి ఉంటుంది. భగవంతుని ఉపదేశాలు బ్రహ్మరుద్రాది దేవతలకును ముఖ్యమైనవే అయియుంటాయి. సకలజీవుల లాభము కొరకు జగత్తులో అవతరించే భగవంతుని ఉపదేశాల నుండి లాభాన్ని పొందని వాడు నిక్కముగా దురదృష్ట వంతుడే అవుతాడు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"శివుడు రక్షింపబడుట" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment