Saturday, July 5, 2025

 *మీ జీవిత కాలం 80 సంవత్సరాలకు పొడిగించు కోండి. మరి , 60 నుండి 80 సం//ల వరకు సుఖంగా, సంతోషంగా  గడపాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.*

*జపాన్‌కు చెందిన మానసిక వైద్య నిపుణుడు **హిడేకి వాడా** రాసిన **"80 ఇయర్ వాల్"** అనే పుస్తకం 5 లక్షల కాపీలు అమ్ముడై, దేశంలోనే బెస్ట్ సెల్లర్ అయింది.*

*ఈ పుస్తకంలో 60 నుండి 80 ఏళ్ల వయస్సులో ఉన్నవారికి ఆనందంగా జీవించేందుకు కీలకమైన  కొన్ని సలహాలు ఉన్నాయి. 

------అవే ఇవి:*

1. *రోజూ నడవండి.*నడక వలన మెదడు చురుకుగా ఉంటుంది.

2. *కోపం వచ్చినప్పుడు లోతుగా ఊపిరి తీసుకోండి.*

3. *ఎసి వాడితే ఎక్కువగా నీరు త్రాగండి.*

4.*గుర్తుపట్టలేకపోవడం వయస్సు వల్ల కాదు, మెదడును వాడకపోవడం వల్ల.*

5. *అత్యధిక మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు.* డా. సూచించిన మందులే వాడండి.

6. *బిపి, షుగర్‌ను కృత్రిమంగా తగ్గించాల్సిన అవసరం లేదు.*

7. *ఒంటరిగా ఉండటం ఒంటరితనమేమీ కాదు, అది సంతోషకర సమయం.*

8. *ఆలస్యం గా నిద్ర లేవడం తప్పేమీ కాదు.

9. *వృద్ధుల్లో డ్రైవింగ్ ప్రమాదకరం కావచ్చు, లైసెన్స్ తీసుకోవడంపై పునఃపరిశీలన చేయండి.*

10 *మీకు ఇష్టమైన పనులే  చేయండి. ఇష్టంలేనివి చేయకండి.*

11. *ప్రకృతిసిద్ధమైన కోరికలు వయస్సుతో పోవు.*

12. *ఎప్పుడూ ఇంట్లోనే ఉండకండి, అప్పుడప్పుడూ బయటకు వెళ్ళండి.*

13. *ఇష్టం వచ్చినట్టు తినండి. కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు.*

14. *ఏ పని అయినా జాగ్రత్తగా చేయండి.*

15 *ఇష్టంలేని వ్యక్తులను దూరంగా పెట్టండి.*

16. *రోజంతా టీవీ చూడొద్దు.*

17. *జబ్బుతో పోరాడకండి, మందులు వేసుకుంటూ దానితో కలిసి జీవించండి.*

18. *తాజా పండ్లు, సలాడ్లు తినండి.*

19 *స్నానం 10 నిమిషాల్లో పూర్తి చేయండి.*

20. *నిద్ర రావడం లేదంటే బలవంతంగా నిద్రపోవద్దు.*

21 *సంతోషకరమైన పనులు చేయడం మెదడును చురుకుగా ఉంచుతాయి.*

22. *మీ మనసు ఎలా చెబితే అలా మాట్లాడండి. "ఎలా మాట్లాడాలి?" అనే ఆలోచనలు చేయకండి.*

23. *ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను త్వరగా నిర్ణయించుకోండి.*

24.పట్టుదలలు, పంతాలు వదిలేయండి. స్నేహితులతో తరచుగా మాట్లాడుతూ ఉండండి.*


25 *నేర్చుకోవడం ఆపినప్పుడు ఎవరమైనా వృద్ధులం అవుతాము.*

26. *పెద్ద పేరు, కీర్తి కోసం తపన పడవద్దు. ఉన్నదే చాలనుకోవాలి.*

27. ఇది మరువకండి *నిర్దోషత వృద్ధుల ప్రత్యేకత.*


28. * ఉదయం పూట సూర్యరశ్మిలో కూర్చోవడం మంచిది. విటమిన్ D .  ఉచితంగా లభిస్తుంది..*

29. *ప్రతి రోజు ప్రశాంతంగా జీవించండి.*

30. *ఆసక్తి, కోరిక, ఉత్సాహం, సాహిత్యం , కళలు , పఠనం జీవితాన్ని పొడిగిస్తాయి.*

31. *ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి.*

32. *స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి.*

33. * మీ జీవిత నిర్ణయాలు మీ చేతిలోనే ఉంచుకోండి.*

34. *ప్రతి విషయాన్ని శాంతిగా అంగీకరించండి.*

35. *సంతోషంగా ఉండే వారు ఎప్పుడూ అందరిచే ప్రేమించబడతారు.*


*ఈ సూచనలు అందరు సీనియర్ సిటిజన్స్ కు అత్యంత ఉపయోగకరమైనవి!*


----- సేకరణ.

No comments:

Post a Comment