Saturday, July 5, 2025

 *వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం గొప్ప

*నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు.*
*మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా..*
*అలాగే ఇతరుల పనులను మనం సమర్థంగా చేయడం కంటే  మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిదని తెలుసుకో*
*నువ్వు చేసే పనిని ఆనందిస్తూ చేస్తేనే అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతావని గుర్తించు..*
*పక్కవాడి పనిలో వేలు పెట్టనంతవరకు నీ పని సాఫీగా జరుగుతుంది..*
*ఎప్పుడైతే ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే కుతూహలం నీలో మొదలవుతుందో అప్పటినుంచి నీ పని నాశనమవుతుంది...*
*కాబట్టి నువ్వు చేసే పని మీద ఏకాగ్రత నిలిపితే, పక్క వాళ్ళ పనిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా నీ ప్రతి పని సఫలీకృతం అవుతుందని గ్రహించు..*
*చేసే పని నీది అయినప్పుడు, శ్రమ కూడా నీదే అవ్వాలి, ఆలోచన కూడా నీదే అవ్వాలి.. అలా మీరు చేసే ప్రతీ పనిలో ప్రతీ ఒక్కరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....*

No comments:

Post a Comment