*ఆధ్యాత్మిక ప్రస్థానం.....*
*ఆధ్యాత్మిక ప్రస్థానం లో వేగంగా ప్రయాణం చేయాలనుకునే వారు కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. పుణ్యం కోసమో, మోక్షం వస్తుందనో, భగవంతుడి అనుగ్రహం కోసమో ఎన్నో మంచి పనులు, అన్నదానాలు, తీర్ధయాత్రలు, తపస్సులు, జపాలు, భగవన్నామ సంకీర్తనలు, మంత్రానుష్ఠానాలు, హోమాలు యజ్ఞాలు, గురు సేవలు మానవులు చేస్తుంటారు.*
*ఈ పుణ్యకార్యాల వల్ల ఎంతో తపశ్సక్తి, పుణ్యఫలం చేకూరుతుందనే విషయం సత్యం... నిర్వివాదాంశం. తపస్శక్తి ఎలా సంపాదించినా ఒక ప్రచండ శక్తిగా మనలో నిక్షిప్తమవుతుంది. ఇది కృతమయినా, కలియుగమైనా అనివార్యంగా జరిగితీరుతుంది. ఎంత మహాద్భుత శక్తి మనకి కలుగుతుందనే విషయం, మనం చేసే సాధనలపై ఆధారపడి ఉంటుంది. కృత యుగం లో నైనా, కలియుగంలో నైనా మనం చేసుకున్న పుణ్యం ఈ సంపాదిత పుణ్య ఫలం క్షయం కావడం మాత్రం మనం నిత్య జీవితం లోని మన ప్రవర్తన పైన ఆధార పడి ఉంటుంది.*
*ఎంత మహాద్భుత శక్తి సంపాదించుకున్నా, ఇంద్రియ నిగ్రహం కోల్పోయి, ప్రపంచాన్ని పీడించడం మొదలు పెడితే, ఆ పుణ్య ఫలం అంతా క్రమేపీ క్షీణిస్తుంది. రాక్షసులకి దుర్మార్గాల వల్ల తపస్శక్తి నశిస్తే, ఋషులకి మునులకి కూడా వరాలు, శాపాలు ఇవ్వడం వల్ల తపస్శక్తి పుణ్య సంపాదిత ఫలం పోతుంది.*
*విశ్వామిత్రుడికి మేనక వల్ల కొంత... త్రిశంకు మహారాజుకి త్రిశంకు స్వర్గం సృష్టించి ఇవ్వడం వల్ల కొంత నశించదనే విషయం అందరికీ తెలిసిందే. ఇది మనకి కూడా వర్తిస్తుందనే విషయం గ్రహించాలి. ఋషులని, జ్ఞానులని ఉత్తములని నిందిస్తే , అవమానిస్తే, మన వాక్కు ద్వారా మనం చేసిన విష్ణు సహస్ర నామ ఫలం, లలితా సహస్రనామ ఫలం, దాన ఫలం, అనేక సత్కర్మలు చేసి సంపాదించుకున్న పుణ్య ఫలం క్షయ మవుతుంది. అందుకే మనం మౌనాన్ని సాధన చేయాలి. వాక్కు పై నిగ్రహం పోతే మన శక్తులన్నీ క్షీణిస్తాయి.*
*ప్రతి రోజు మనం చేసే పనులను ఒకసారి సమీక్షించుకోవాలి. ముఖ్యంగా మన వాక్కు ఎలా ఉపయోగపడుతున్నదనే విషయం గమనించాలి. మనం స్వల్పం గా పుణ్యాన్ని ఆర్జించి, ఇలా భారీగా వాక్కు ద్వారా పుణ్యఫలం అధికంగా పోగొట్టుకుంటే, జీవితంలో దాని పర్యవసానం ఎలా ఉంటుందో గమనించాలి.*
*అధికారం అహంకారం పెరిగిన వారికి వాక్కు దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ విభాగం దుర్వినియోగం చేస్తే ఆ విభాగమే శిక్షించబడుతుంది. వాక్కు దుర్వినియోగమైతే, ఆ వాక్కు శక్తిని కోల్పోవడమే కాక అనేక విధాలా నిర్వీర్యమవుతుంది. సృష్టిలోని ఈ విధి విధానం వల్లనే ఎందరో తపస్సంపన్నులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న తమ తపశ్శక్తిని కొల్పోయారు...*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment