*ఆద్యాత్మిక సాధన.....*
*సాధన చేస్తుంటే ఎంత ప్రయత్నించినా మనసు విషయాల పైనే పరిగెడుతుంది. కామ క్రోధాది వికారాలాని జయించే ఏదైనా మార్గం ఏమిటి... అని అనుకుంటున్నవారికి...*
*మనసు లక్షణమే చంచలత్వం. దాన్ని నిల్పడం అంత తేలిక కాదు. కానీ నిల్పగల్గితే జన్మ ధన్యం. దానికి శాస్త్రం ఎన్నో మార్గాలు చెప్పింది. ముందుగా సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి స్నానదికాలు పూర్తి చేసుకొని ప్రాతః కాలంలోనే పూజ, భగవధారాధనా పూర్తి చేసుకోండి.*
*వీలైనంత వరకు ఎక్కువ జపం చేయండి. నిత్యం భాగవన్నామ స్మరణ చేస్తూ "మనసుని కుదురుగా నిల్పు దేవా పరమేశ్వరా"... అని ఆ ఈశ్వరుడుని గట్టిగా ప్రార్థించాలి. పరమేశ్వరుడుకి సంబంధించిన నమక చమకం లు మొదలైనవి చదువుకుంటూ ఉంటే తప్పకుండా కామ క్రోధాది వికారాలాను జయించగలం. ఇవి శాస్త్రంలో చెప్పిన కొన్ని మార్గాలు.*
*పరమేశ్వరుడే ఆది యోగి, కాబట్టి మన మానవ ప్రయత్నాలు మనం చేస్తూ* *వుంటే... ఆ ఈశ్వరుని దయవల్లే సాధ్యమౌతుంది అని గ్రహించి నిరహంకారంగా సాధన చేయడం ప్రధానం...*
*┈━❀꧁ఓం నమఃశివాయ꧂❀━┈*
*SPIRITUAL SEEKERS*
🍁🧘♂️🍁 🙏🕉️🙏 🍁🧘♀️🍁
No comments:
Post a Comment