🙏🙏🙏🙏🙏
మాంగల్య ధారణ
మాంగల్యం తంతునానేనా
మమ జీవన హేతునా
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం
మంగళ సూత్రాన్ని వరుడు వధువు కంఠానికి మూడు ముళ్లు వేసి కడతాడు.
ఈ విషయం లలితా సహస్ర నామాలు 12 వ శ్లోకం, అమ్మవారి మాంగల్యం గురించి
'కామేశ బధ్డమాంగల్యసూత్ర శోభిత కంధరా' కామేశుడు = ఈశ్వరుడు
కంధరా = కంఠము
అలాగే సౌందర్య లహరి 69 శ్లోకం.
మాంగల్య ధారణ కంఠానికే ఎందుకు కడతారు ? ఈ ప్రశ్నకు జవాబు కంఠం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటే మనకు అర్ధమవుతుంది
కంఠం లేదా మెడ ముఖ్యమైన తల, మొండెం భాగాలను కలుపు తుంది. కంఠం క్రింది భాగంలో షట్ఛక్రాలలో ఒకటైన 'విశుధ్ది చక్ర'ము కలదు. శ్వాస గొంతు ద్వారా ప్రవహిస్తుంది.
విశుధ్డి చక్రం లేదా గొంతు చక్రాన్ని ' వజ్రాంగం' అని అంటారు. ఈ చక్రం గురించి లలితా సహస్ర నామాలు 97, 98 శ్లోకాలలో వివరించ బడినది. ఆకాశ తత్వం కలిగినది. ఆకాశం పంచ భూతాలలో సూక్ష్మాతి సూక్ష్మం. ఈ చక్రం వాక్కుకి సంబంధించినది. అధిష్టాన దేవత 'వజ్రేశ్వరీ దేవి. వజ్రం అనగా వాక్కు. ఈ అమ్మవారు వాక్ శుధ్దిని ప్రసాదిస్తుంది. పెళ్లి మంత్రాలు వాక్కు ప్రమాణాలకు సంబంధించినవి.
వాక్కు స్వర పేటిక ద్వారా వచ్చే నాదం ఘర్షణకు గురై అగ్గి పుడుతుంది. ఘర్షణను మంత్ర శాస్త్రంలో 'రేఫం' అంటారు. దీనినే అగ్ని బీజం అంటారు. మంత్ర బీజాక్షరాలు 'ఓం, క్లీం, జ్రీం'. ఓం - ప్రణవం, క్లీం - కామ కలా బీజం, జ్రీం - వజ్రేశ్వరి బీజాక్షరం.
విశుధ్డి చక్ర అధిపతి ' జీవుడు. ఇక్కడ పంచ ప్రాణాలలో ముఖ్యమైన 'ఉదాన ప్రాణం' ఉంటుంది. ఇది బ్రహ్మ చైతన్యానికి చిహ్నం. ఈ చక్రం యొక్క గుణాలు : నిజాయితీ, స్పష్టత, ఆత్మ విశ్వాసం, సమతుల్యత, ప్రశాంతత మొదలైనవి. ఇది శారీరక మరియు ఆధ్యాత్మిక శుద్ధికి కేంద్రం. శ్వాస శక్తి లేదా ప్రాణ శక్తి దీని ద్వారా ప్రవహిస్తుంది. ఇక్కడ మనస్సు శుద్ధి చేయబడును. మాంగల్య ధారణలో వరుడు మూడు ముళ్ళు త్రికరణశుద్ధిగా వేస్తాడు. అనగా మనసా, వాచా (వాక్కు), కర్మణా(శరీరం). ఇవన్నీ ఇక్కడ శుద్ధి చేయబడతాయి.
ఈ చక్రం లేదా పద్మము లో 16 దళాలు కలవు. ఈ 16 సంస్కృత భాషలోని అచ్చులకు ప్రతీకలు. అచ్చులు భాషకు ఆధారాన్ని ఇస్తాయి. అమ్మవారి మంగళ సూత్రం మూడు ముళ్ళు గురించి సౌందర్య లహరిలో మూడు ఏకమైతే పవిత్రత అదే జ్ఙానం. కంఠంపై మంగళ సూత్రం మూడు ముళ్ళు మూడు శరీరాలకు ప్రతీకలు. అవి స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరం. ఈ ముడు ఒకదానితోఒకటి బంధించ బడతాయి. అనగా జన్మ జన్మల బంధం అని అర్ధం.
ఇన్ని రకాలుగా కంఠం శుభప్రదమైనది కావున మాంగల్యధారణకు అత్యుత్తమ స్థానమైనది.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment