Saturday, July 5, 2025

 *పూర్వం బస్సులో టికెట్ చెకింగ్ సమయంలో ఫ్రీగా వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనా పట్టుబడితే, కండక్టర్ కి జరిమానా విధించి, రిమార్క్ వ్రాసేవారు ఇన్స్పెక్టర్ లు.*

*ఇలా చాలాకాలం సాగింది. కానీ, మార్పు లేదు. ఒకసారి సంస్థ దీనిని కొద్దిగా మార్పు చేసి, కండక్టర్ తో పాటు ప్రయాణీకులు నుంచి కూడా జరిమానా వసూలు చేయడం ప్రారంభించింది. అంతే, ఎగబడి టికెట్ తీసుకోవడం మొదలైంది.,*😊

*ఒక ఇంట్లో భార్యాభర్తలు తగవులు ఆడుకుంటూ ఉంటారు. కారణం, పిల్లలకి రోజూ ఏదోఒకటి కొనిపెడుతూ, డబ్బు తగలేస్తోందని భర్త గారి ఆవేదన.*

*తరుచుగా బస్సుల్లో ప్రయాణించే ఆమె ఒక ఆలోచన చేసింది. "ఏకపక్షంగా ఎందుకు మాటపడాలి? పిల్లలను కూడా భాగస్థులని చేస్తే?" అక్కడి రూలు నేను ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదూ" అని.*

*ప్రతిరోజూ పిల్లలు ఏది కావాలన్నా, అది ఎందుకు? ఎంత ఖర్చు? దాని వల్ల ఎవరికి ఉపయోగం? లేకపోతే బ్రతుకు కష్టమా? అనే వాటికి సమాధానాలు ఒక పుస్తకంలో వ్రాసి చూపిస్తే, ప్రయోజనాన్ని బట్టి కొంటాను" అని రూలు పెట్టింది.*

*ఫలితం, పిల్లల కోరికలు తగ్గి పోయాయి. డబ్బు ఖర్చు తగ్గినందుకు భర్త హ్యాపీ. గొడవ జరిగి చాలా కాలం అయింది.*👌

*సమస్య ఒకరి తలపై ఎప్పుడూ ఉంచుకోకూడదు. నలుగురినీ భాగస్థులని చేస్తే, మనసు కాస్త తేలిక పడుతుంది.*💕

*శుభోదయం.*🙏

No comments:

Post a Comment