Saturday, July 5, 2025

 *_....వ్యక్తిత్వ వికాసం...._* 
¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦

*_వ్యక్తిత్వ వికాసం గురించి ఒక పర్షియన్ అమ్మాయి చెప్పిన 30 చిట్కాలు_*

*ఒక పద్దెనిమిదేళ్ళ పర్షియన్ అమ్మాయి తన డైరీలో ఉత్తమమైన వ్యక్తిత్వం అలవరచుకోవడానికి కొన్ని చిట్కాలను రాసిపెట్టుకుంది. అవేంటో చూద్దాం....*

*_1. జీవితంలోని అన్నిటినీ ప్రేమించు - పుట్టిన ఊరుని, చేరిన నగరాన్నీ, చుట్టూ ఉన్న మనుషులనీ, ప్రకృతినీ, పరాశక్తినీ. ప్రేమలోంచి ఉద్భవించినవన్నీ ప్రేమతో మరింత వ్యాపింపజేస్తాయి._*

*_2. ఒక్కసారే ఒకరినే ప్రేమించు శాశ్వతంగా. పలుసార్లు పలువురితో ప్రేమలో పడొద్దు._*

*_3. హృదయపూర్వకంగా, నిజాయితీగా ప్రేమించు. ప్రేమ అనంత మైనది._*

*_4. అసంతృప్తిని వెల్లడి చెయ్యకు. కాలాన్ని శోకంతో వృధా చెయ్యకు. నిరాశావాదిగా ఉండకు._*

*_5. వర్తమానంలో జీవించు. ఎప్పటి పనులను అప్పుడే పూర్తిచెయ్యి. చేసే ప్రతి పనిలో ఉత్తేజం నింపు. విసుగు కలిగించే పనిలో కూడా ఉత్సాహం కలిగించే లక్షణాలను వెతుక్కో._* 

*_6. వాస్తవ పరిస్థితులని ఆనందంగా స్వీకరించు. ఆర్భాటం వద్దు, టెక్కు చూపించొద్దు._*

*_7. స్వతంత్రంగా ఆలోచించు, స్వతంత్రంగా జీవించు. పశ్చాత్తాపం చెందొద్దు. నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు._*

*_8. అజ్ఞాత భయాలతో జీవించవద్దు. అద్భుతమైన వాటిని ఆరాధించు, కొత్త అనుభవాల్ని ఆహ్వానించు._*

*_9. నీ ఆలోచనలను ఇతరులపై రుద్దకు, ఇతరుల ఆలోచనలకు విలువనివ్వు. గౌరవాన్ని యిచ్చిపుచ్చుకో._* 

*_10. నీకంటూ ఒక 'స్పేస్', మరియు' ప్రైవసీ' ఉంచుకో. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వు. ఏకాంతంలో రోజూ కొంతసేపు గడుపు._*

*_11. నీ జీవన విధానాన్ని నిర్ణయించే అవకాశం ఇంకొకరికి ఇవ్వొద్దు. ఇతరుల సానుభూతిని ఆశించకు. అలాగే మరొకరి ప్రవర్తనలోని న్యాయాన్యాయాలు విచారించవద్దు.._*

*_12. అందరినీ అన్నివేళలా సంతృప్తిపరచలేం. ఆ ప్రయత్నం అసలు చెయ్యకు._*

*_13. నీ ప్రవర్తన ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా ఉండేలా చూసుకో - నీ ఆలోచనలు, విశ్వాసాలకు అనుగుణంగా._*

*_14. సౌమ్యంగా ఉండు, మొండిగా ప్రవర్తించకు._*

*_15. మూఢమైన సంప్రదాయాలను, కాలంచెల్లిన నమ్మకాలనూ విడిచిపెట్టు._*

*_16. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో, ఆత్మన్యూనతకు లోనుకాకు, ఆత్మస్థైర్యం సంపాదించుకో._*

*_17. క్రమశిక్షణ, నిబద్ధత పాటించు. చిత్తశుద్ధి చూపించు._*

*_18. నవ్వుతూ ఉండు, నవ్విస్తూ ఉండు. ఇతరులను అపహాస్యం చెయ్యద్దు. ఇతరులను చూసి నవ్వకు, వారితో కలిసి నవ్వు. నీ చుట్టూ ఆనందమయమైన వాతావరణం ఏర్పాటు చేసుకో._*

*_19. నీ దినచర్యను ఒకేలా ఉంచకు, వైవిధ్యభరితంగా ఉంచుకో._*

*_20. నీ పనిని ప్రేమించు, కష్టపడు, మెరుగుపరుచుకుంటూ ఉండు._*

*_21. ధనసంపదని మాత్రమే లక్ష్యంగా చేసుకోకు, వివేకంలో ధనవంతుడివికా._*

*_22. నేర్చుకోవాలన్న తపనను వదలద్దు. జ్ఞానదాహాన్ని తీర్చుకుంటూండు. గురువు పాత్రకన్నా శిష్యుని పాత్రనే ఎంచుకో. నిరంతర విద్యావ్యాసంగంలో నిమగ్నుడివికా,_*

*_23. విశ్వసనీయమైన వ్యక్తిగా నైతిక విలువలకు కట్టుబడి ఉండు._*

*_24. ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు._*

*_25. జీవితంలోని పైపై మెరుగులకు మోసపోకు. జీవితాన్ని తరచి చూడు. లోతుగా జీవించటానికి ప్రయత్నించు._*

*_26. మేధస్సును పదునుపెడుతూండు, సృజనాత్మకశక్తిని మేల్కొలుపు._*

*_27. అవసరమైనదాని కన్నా ఎక్కువసేపు నిద్రపోవద్దు. నిరాశా నిస్పృహలకి లోనుకావద్దు._*

*_28. నీ చుట్టూ ఉన్నవారిని బృందాలుగా విడదీసి చూడవద్దు. నిందించవద్దు._*

*_29. సంబంధ బాంధవ్యాలని బలపరచుకుంటూ ఉండు._*

*_30. నిన్ను నివ్వు తెలుసుకో. సహజంగా ఉండు. నిన్ను నువ్వు ప్రేమించు. ఇతరుల్లా ఉండాలని కోరుకోవద్దు._*

*ఒక టీనేజర్ యిలా ఆలోచించిందా...!!! అని మనం ఆశ్చర్య పోనక్కరలేదు. నిజానికి ఇలా రాసిన ఈ అమ్మాయి ఇప్పుడు మధ్య వయస్కురాలు. వెనక్కి తిరిగి చూసుకుని తనే ఆశ్చర్యంకన్నా ఎక్కువ బాధ పడింది. తను రాసిపెట్టుకున్న గుణాల్లో అధికశాతం తనే అలవరచుకోలేకపోయినందుకు.🙄🙄🙄*
¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦¦

*ఇటీవల ఇంటర్నెట్లో మరో టీనేజర్ _"సుప్రభాత ప్రేరణ"_ అనే శీర్షికతో యిలా రాశాడు: 'ప్రతిరోజూ పొద్దున పక్కమీదనుంచి లేస్తూనే, నన్ను నేను ప్రశ్నించుకుంటాను, జీవితంలో విజయం సాధించటానికి పనికివచ్చే సూత్రాలు ఏమిటి? అని. నా గదిలో నాకు ఎదురుగానే నా ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది.*

*_🌹'ఫ్యాను 'కూల్'గా ఉండమంటుంది, నిండుకుండలా తొణకవద్దని చెప్తుంది._* 

*_🌹 ఆదర్శాలను ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకోమంటుంది పైకప్పు._*

*_🌹 కిటికీ: ప్రపంచాన్ని పరిశీలించమంటుంది._*

*_🌹తలుపు: గమ్యానికి దారిచూపుతూ.. తెరుచుకుని ముందుకు సాగమంటుంది._*

*_🌹అద్దం: అందాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి పనినీ చేసేముందు ఆలోచించమంటుంది._*

*_🌹గోడగడియారం: ప్రతి క్షణం అమూల్యమని గుర్తుచేస్తూంటుంది._*

*_🌹క్యాలండర్: ఎప్పటికప్పుడు పనులు పూర్తి చెయ్యమంటుంది._* 

*_🌹తివాచీ: నేలమీద మోకరిల్లి ధ్యానం చేయమంటుంది, ప్రార్థించమంటుంది._* 
~~~~~~~~~~~~~~~~
*_భగవద్గీతలో ఏముంది?_*

*వ్యక్తిత్వ వికాసం అనేది ఒక కొత్త సంకల్పం కాదు. అది మన ప్రాచీన గ్రంథం 'భగవద్గీత'లో ఎప్పుడో వెలువడింది. కురుక్షేత్రంలో అర్జునుడి ప్రత్యర్థులు అతని తాతలూ, గురువులూ, సోదరులే...!* 

*యుద్ధంలో వారిని చంపాలనే ఆలోచన అతనికి గుండెలో దడ పుట్టించింది. 'నా బంధుజనాన్ని నేను చంపలేను, నాకు రాజ్యం వద్దు,' అంటూ గాండీవాన్ని జారవిడిచి నేలకూలబడ్డాడు.*

*అప్పుడు కృష్ణుడు, _“అర్జునా! బుద్ధిమంతులు చావు, బతుకుల గురించి విచారించరు. సుఖదుః ఖాలను, జయాపజయాలను సరిసమానంగా చూడటం వివేకవంతుల లక్షణం. హృదయ దౌర్బల్యం మానసిక బలహీనతకు దారితీసి ఆత్మవిశ్వాసాన్ని హరిస్తుంది. అంతర్గత బలహీనత వ్యక్తిత్వంపై ప్రభావం చూపిస్తుంది. దానితో ఆత్మన్యూనత ఏర్పడుతుంది. లక్ష్యంలేని జీవితానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు. నీ మనసులోని సందేహాలను, భయాలను తొలగించుకో,”_ అంటూ హితబోధ చేస్తాడు. అలా ‘వ్యక్తిత్వ వికాసం అనే ఆలోచన ప్రప్రథమంగా క్రీస్తుపూర్వం 5 వేల సంవత్సరాల క్రితమే మనకి చేరింది.*
*************
*రోజులు మారాయి,  విలువలూ మారాయి. దీనికి ముఖ్య కారణాలలో ఇటీవలి సినిమాలు కూడా ప్రముఖపాత్ర వహిస్తున్నాయట! తొలితరం సినిమాలను తలచుకుంటూ _“స్వర్ణయుగం”_ గడిచిపోయిందన్న గుమ్మడి గారి లాగానే మరికొందరూ బాధపడుతున్నారు.*

*అదే విషయాన్ని 'పాపినేని శివశంకర్' గొంతుతో వింటే...* 

*_అన్ని హత్యలూ హంతకులే చేయరు_*
*_కొన్నింటిని సినిమాలు కూడా చేయగలవు_*
*_కసిని, కత్తుల్ని, వేటకొడవళ్ళనీ, సంస్కార సంహారాల్నీ_* 
*_తుపాకుల్ని, అశ్లీల తుపానుల్ని_* 
*_తెరచాటున వేరొక్కరీతిగా దాచిపెట్టగలవు!_* 
*_ఎవడికీ కనబడదు..._* 
*_ఎవడెప్పుడు ఏ ఆయుధంతో_* 
*_ఏ పూల చెట్టుని_* 
*_అందంగా వికసించిన నేరానికి_* 
*_నరికేస్తాడో తెలియదు!_*
*_గొంతు కలిపి మరికొందరు పాడుతుంటారు._*
_(—పాపినేని శివశంకర్)_ 
~~~~~~~~~~
_(సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, --ఆర్. శాంతసుందరి గారి *"విజయంవైపు అడుగులు"* అనే పుస్తకం నుండి...)_ 
::::::::::::::::::::::::::::::::::::::::::::::
*_{నేను చదివిన పుస్తకం నుండి మీకందించాను: —వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment