ఫోటో లో నాతో ఉన్నది మా మావయ్య గారు తెలగరెడ్డి సత్యనారాయణ గారు
పెళ్లి అయ్యి మొదటిసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు మా నాన్న లా అనిపించారు అప్పటినుంచి ఒక తెలియని గౌరవం ప్రేమ అభిమానం నాన్నని ఎలా చూస్తానో ఆయన్ని కూడా అలాగే చూసేదాన్ని మా అత్తగారికి తెలియకుండా బీడీలు కొనిచ్చేదాన్ని
మా ఇద్దరి మధ్య మామ కోడళ్ళ బంధం కంటే తండ్రి కూతుర్ల బంధమే ఎక్కువగా ఉంటుంది వయసు పెరిగిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు అటువంటి ఇబ్బందుల్లో ఆయనకి మతిమరుపు కూడా వచ్చింది. ఆయన చాలావరకు అన్ని విషయాలు అందర్నీ మర్చిపోయారు కానీ ఆయన గుర్తున్న ఒకే ఒక్క మనిషి భార్గవి మాత్రమే, మా అత్తయ్య గారు అంటారు ఇదేమి చిత్రమో నన్ను కూడా మర్చిపోయి నిన్ను గుర్తు పెట్టుకున్నారు అని
నేను ఎప్పుడు ఫోన్ చేసినా లేదా ఎప్పుడు ఇంటికి వెళ్లిన మావయ్య గారు అని పిలవంగానే అమ్మ అని వెంటనే రెస్పాండ్ అయ్యేవారు మా అత్తయ్య గారు మా ఆడపడుచు ఇద్దరు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు నీ గొంతు వింటే మీ మామగారికి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తదిఅని అనేవారు ఆయన నాతో అని అమ్మ అమ్మ అని మాట్లాడుతూనే ఉండేవారు
అత్తయ్య గారితో మా వారితోటి మాట్లాడే మాటలు కంటే కూడా నాతో మాట్లాడే మాటలు ఎక్కువగా ఉండేవి
ఆయన చివరి వయసు వచ్చేసరికి తన సొంత పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్లు ఆ సమయంలో నేను మా వారు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నావ్ ఇక ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా వారు చేసే ఉద్యోగం కంటే కూడా నేను చేసే ఉద్యోగంలో జీతం ఎక్కువగా రావడం వల్ల మీరు ఉద్యోగం మానేసి మావయ్య గారిని చూసుకోండి నేను ఉద్యోగం చేస్తాను, కుటుంబ బాధ్యత నేను తీసుకుంటాను పెద్దవాళ్ల బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి తన చేత ఉద్యోగం మాన్పించేసి మావయ్య గారు చూసే బాధ్యత ఆయనకి అప్పచెప్పాను
మేము చేసే ఉద్యోగాలకి మాకు వచ్చే ఆదాయానికి ఒక మనిషిని పెట్టుకుని చూసుకోవచ్చు కానీ మా ఇద్దరికీ మనసుకు రాలేదు ఎవరో మనిషి ఎలా చూస్తారో మనిషిని విసుక్కుంటారో ఏంటో అని ఒక ఫీల్ వచ్చేసింది అందుకే ఆఖరి నాలుగేళ్లు తన తండ్రిని స్వయంగా చూసుకున్నాడు
మా వారు ఒక రెండేళ్లు తను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని చూసుకున్నారు అప్పుడు నేను పిల్లల్ని పెట్టుకొని కొలహాపూర్ లో ఉండేదాన్ని ఆఖరి రెండేళ్లు అయితే గనక అత్తయ్య గారిని మావయ్య గారిని ఇద్దరినీ కొల్హాపూర్ తీసుకొచ్చేశారు. ఇక్కడే ఆయన జనవరి 1 2025 మధ్యాహ్నం 1.30 కి శి వై క్యం చెందారు అప్పటి వరకు కూడా వాళ్ళ మా దగ్గరే ఉన్నారు
నిన్న జీవితంలో చేసిన ఏదైనా మంచి పని ఉంది అంటే కనుక మా మావయ్య గారికి సునాయస మరణం ఇవ్వటమే ఆఖరి వయసులో తన కొడుకు ని తన మనవడిని తన మనవరాలని తన కళ్ళ ముందు ఉంచగలగటమే తను ఎలా చనిపోయాడో తనకి తెలియకుండా చేయడమే నేను చేసిన మంచి పని అని నేను అనుకుంటాను
ఎన్ని కష్టాలు వచ్చిన ఒక వయసు వచ్చాక తల్లితండ్రులను దగ్గర పెట్టుకోండి అమ్మాయి లు మీ తల్లితండ్రులు లాంటి వారే మీ అత్తమ్మమాలు,
మనవడు మానవరాలిని చూడటం వారి హక్కు దాన్ని కాదనకండి తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తే మనం ఈ రోజు ఇలా ఉన్నాం అని మర్చిపోకండి
No comments:
Post a Comment