Saturday, July 5, 2025

 *కేరళ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంకి సంబందించిన సరస్సులో ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనబడటం ప్రతిసారి జరుగుతోంది.*

*దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న బబియా అక్టోబర్ 9, 2022 న మరణించింది.'బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు.*

*ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి* *ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపరి ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా. దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే... ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🐊🍁 🙏🕉️🙏 🍁🐊🍁

No comments:

Post a Comment