Sunday, July 6, 2025

 *నేటి మనభక్తి..!!!*

*భక్తి పేరుతో మనము దైవమును వెతుక్కుంటూ వెళ్తున్నాము... అయితే నిజమునకు భక్తి అంటే భగవంతుడే మనలను వెతుక్కుంటూ రావాలి.! అదీ అసలైన భక్తి , ఇట్టి భక్తి నేడు ఏ ఒక్కరి యందునూ లేదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు!!...*

*ఎలా???...*

*భగవంతుడు అంటే కేవలము కోరికలు తీర్చే కొండగట్టున ఉన్న ఒక రాతి విగ్రహం అనే భావనలో ఉంటున్నాం...*

*నా కోరిక తీరిస్తే మీకు అది ఇస్తాను, ఇది చేస్తాను అని దైవముతో బేరాలకు దిగుతూ భక్తిని వ్యాపారంగా మారుస్తున్నామంటే , దైవమును మనము ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో తెలుస్తూనే వుంది.! మలినమైన మనస్సుతో, స్వప్న దృశ్యములైన పదార్ధాలతో నిత్యసత్యమైన పరమాత్మ ప్రేమను కొనడం సాధ్యమవుతుందా.! ఆనాటి గోపికలు పరిపూర్ణమైన మనస్సుతో, శరణాగతి భావముతో తమ హృదయ కమలమునే కృష్ణునికి అర్పించి తద్వారా కృష్ణుని ప్రేమ మకరందమును గ్రోలగలిగారు...*

*మలినమైన మనస్సును గానీ, క్షణ భంగురమైన వస్తువులను గానీ వారు ఏనాడూ అర్పితము చేయలేదు...*

*కానుకలు ఇవ్వడం వలన మన కోరికలు తీరుతాయనుకుంటే దైవమును దైవముగా భావిస్తున్నామో లేక వ్యామోహసహితుడైన వ్యక్తిగా భావిస్తున్నమో అనేది ఎవరికి వారు విచారణ చేసుకోవాలి...*

*┈┉❀కృష్ణమ్ వందే జగద్గురుమ్❀┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁

No comments:

Post a Comment