🙏 *రమణోదయం* 🙏
*అంతర్ముఖమైన మనస్సుతో "నేను నేను" అని ఆ దివ్యనామాన్నే విడవక భావించినా కూడా, అహంకారం సమూలంగా నశించేట్టు దాని ఉత్పత్తి స్థానంలో సాధకుని చేర్చి తరింప చేస్తుంది.*
వివరణ: *"నేను నేను" అని భావిస్తున్నా కూడా అక్కడికి చేరుస్తుందని "నేను ఎవరు?" గ్రంథంలోని బోధయే ఈ వచనం.*
ప్రారబ్దం-అదృష్టం వేఱు వేఱు అనుకున్నా కూడా
శివదర్శనం చేసుకోవడం - ప్రారబ్దం.
శివుడే తానైపోవడం - అదృష్టం!
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
పుట్టుక మునుపు
మరణం తర్వాత కూడా
"నేనుంటాను" అన్న జ్ఞానం
కలగడమే తరించడం అంటే...
అంతటా భగవంతుని దర్శించాలంటే
మొదట మనస్సులో భగవంతుని
భావించడం నేర్చుకోవాలి.
అలా భావన చెయ్యడమే ధ్యానం.
ధ్యానం అనుభూతికి దారితీస్తుంది.
అనుభూతి ఆత్మలో కలుగవలసినదే.
భగవద్ద్యానమైనా, ఆత్మ ధ్యానమైనా,
రెండింటి లక్ష్యం ఒక్కటే.
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.716)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment