అలిగి అరునెలలు నేను అత్తారింటికి వెళ్ళలేదు ఇప్పుడు ఆ అత్తగారికి నేను కోడలిని కాదు కూతురిని
ఫోటో లో కనిపిస్తుంది మా అత్తయ్య గారు తెలగరెడ్డి శుభలక్ష్మి గారు వరసకే అత్తగారు కానీ నిజానికి నన్ను కనని అమ్మ తను
పెళ్లి ఐనా కొత్తలో మా అయన కొండ మీద కోతిని అడిగిన తెచ్చేవాడు కానీ వాళ్ళ అమ్మ విషయం వచ్చేసరికి నన్ను రెండో స్థానానికి పడేసావాడు నేను కదా తనకి ముఖ్యం అందుకే అత్తగారంటే కోపం అప్పట్లో ఒకరకంగా అయన ప్రవర్తన ఇద్దరికీ మధ్య ఓ అగాధన్ని సృష్టించింది అని చెప్పవచ్చు,
అందుకే అత్తగారు ఏమి చేసిన నచ్చేది కాదు ఏమి చెప్పిన వ్యంగ్యం గా అనిపించేది, చిన్న విషయం చెప్పిన రాద్ధాంతం ల ఫీల్ అయ్యేదాన్ని వయసులో ఉన్న కదా అలానే ఉంటుంది
అలాంటి సందర్భం లో ఒక చిన్న సందర్భం నా మనసు తీసుకోలేక అత్తారింటికి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకునేలా చేసింది, మా వారు అడిగితె రానని చెప్పా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేసేదాన్ని పిల్లల్ని ఆయన్ని మాత్రమే పంపేదాన్ని
అలా అరునెలలు గడిచాక మా అమ్మ ఇక నేను వాళ్ళ ఇంటికి వేళ్ళను అని ఫిక్స్ అయ్యిపోయి నాతో ఏమన్నదీ అంటే ఇద్దరు విడివిడిగా మంచి వాళ్లే అత్తకోడళ్ళు ఐతే మీ అంత చెడ్డోళ్ళు లేరు ఒకసారి ఆలోచించు ఎన్నాళ్ళు ఇలా అని మీ అన్నయ్య భార్య కూడా ఇలా చేస్తే నేను తట్టుకోలేను మరి ఓ సారి ఆలోచించు అని చెప్పింది
ఆలోచించ అవును మా అమ్మ చెప్పింది నిజమే కదా మా అమ్మ లాగానే వాళ్ళ అమ్మ కూడ కదా మరి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్న, మా అమ్మ తిడితే నేను ఏమి ఫీల్ కాను కదా మరి ఎందుకు వాళ్ళ అమ్మ కాదు మా అత్తమ్మ తిడితే ఫీల్ అవుతున్న అన్న ఆలోచన నాలో మార్పుని తెచ్చింది
అప్పటి నుండి ఆమె లో అత్తగారిని కాదు ఓ స్నేహితురాలిని చూసా, తనతో స్నేహం చేశాను ఓ కొత్త ప్రపంచం చూసా మా అమ్మ లాగానే చూసా అంతే తను కూడ నాకు అమ్మ ఐ పోయింది చాలా నేర్చుకున్న మా ఈ అమ్మ దగ్గర
ఒకప్పుడు పినసీతనం అని చిన్నచూపు చూసా కాని అది జాగ్రత్త అని తెలిసాక ఆశ్చర్యపోయా మా మావయ్య గారు ఆర్థికంగా ఇబ్బంది లో ఉన్నప్పుడు తను సంసారం నిలబెట్టిన తీరు నాకు ఎంతో నచ్చిన విషయం నాకు పని మొత్తం ఆవిడే నేర్పింది బాధ్యతలు అన్ని నాకు అప్పగించింది
మావయ్య గారు మంచం లో ఉంటే ఎంత సేవ చేసారో కళ్లారా చూసా కదా అప్పుడు తన మీద ఇంకా గౌరవం పెరిగింది,ఓపిక నాకు తన ద్వారానే వచ్చింది నేను ఈ రోజు నేర్చుకున్న చాలా విషయాలకి స్ఫూర్తి మా అత్తగారే
మవయ్య గారి అనారోగ్యం సమయం లో తనని నా దగ్గరికి తెచేసుకున్న నిజానికి మా కాలేజీ లో పనిచేసే చాలా మందికి తను మా అత్తగారు అని తెలియదు అందరు మా అమ్మ అనే అనుకున్నారు అంటే ఎంత బాగా ఉండేవాళ్ళమో ఉహించుకోండి
మా అత్తగారు నాకు ఉదయాన్నే రోజు జడవేసేవారు నేను ఏది ఐనా డ్రెస్ లు లేదా చీరలు కట్టుకుంటే మురిసిపోయేవారు, నాకు ఇష్టం ఐనవి వండేవారు నిజానికి ఒక దశలో మా అయన కి కూడా డౌట్ నేను కొడుకు నా అల్లుడు నా అని అంత ఇష్టం గా ఉండేవాళ్ళం
మా అత్తగారు కాదు మా అమ్మే ఆవిడ
నేను తన కూతురినే కనలేదు కానీ పెంచింది కదా ఇప్పుడు కూడ పెంచుతుంది కదా లాలీస్తుంది ముద్దుచ్చేస్తుంది నేను చేసే అల్లరి ని కూడ ఆస్వాదిస్తుంది మా అయన తో గొడవ ఐతే నా పక్కన నిలబడుతుంది మరి అమ్మే గా కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమ ఎక్కువ అందుకే ఆవిడ కి నా మీద ప్రేమ ఎక్కువ నాకు తన మీద ప్రేమ ఎక్కువ
అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్లిన ఇప్పుడు భార్గవి ఆలా చేస్తుంది ఈ టైం కి క్లాస్ లో ఉంటుంది, ఇది ఇష్టం గా తింటుంది నాతో ఆలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెబుతూనే ఉంటారు ఆట ఇక మా ఆడపడుచు ఫోన్ చేసి మీ అత్తగారిని తీసుకోని పో లేచిన దగ్గర నుండి భార్గవి భార్గవి అని ఒకటే గోల, ని దగ్గర ఉంటే కూతురు దగ్గర ఉన్నట్టు నా దగ్గర ఉంటే కోడలు దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతుంది అని నవ్వుతు చెబుతుంది
మా అత్తగారి కి కన్నకూతురు కొడుకు కంటే కోడలే ఇష్టం ఇప్పుడు ఐతే కోడలే కూతురు అంటుంది తన కోడలు గురించి గొప్ప గా చెప్పుకుంటుంది అందరికి ఎంత గర్వాంగా చెప్పుకుంటారో భలే అనిపిస్తుంది నాకు కూడా
నిజం గా నాకు ఇంతకీ మించి గెలుపు ఏముంటుంది
మా అమ్మ పెంపకనికి ఇంతకీమించి గౌరవం ఏముంటుంది మా అమ్మ సరి ఐనా సమయంలో నాకు మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని బృందావనం చేసింది ఇప్పుడు అప్పుడప్పుడు అంటుంది ఆవిడా అత్తగారు నేను అమ్మ ని మర్చిపోకు అని 🤣🤣
ఇప్పుడు కొత్త గా ఉద్యోగం లోకి వచ్చిన చోట కూడా వాళ్ళు మా అత్తగారు కాదు మా అమ్మ అనే అనుకుంటున్నారు, ఇది కదా నిజం ఐనా బంధం అంటే
అందుకే చెబుతాను బంధాలకి గౌరవం ఇవ్వండి అని అమ్మ చెబితే నచ్చింది అదే మాట అత్తమ్మ చెబితే ఎందుకు నచ్చదు అమ్మ తిట్టినా ఎమ్ అన్న బాధ అనిపించదు మరి అత్తగారి విషయం లో ఎందుకు బాధ వస్తుంది మన తల్లితండ్రులు మనల్ని ఎలా పెంచారో భర్త తల్లితండ్రులు కూడా అలాగే పెంచారు ని తల్లితండ్రులు లాగానే వాళ్ళు కూడా త్యాగాలు చేశారు, మనం ఆ త్యాగాలని గుర్తించాల్సిందే అతని తల్లితండ్రులు దూరం చేసే హక్కు మనకి లేదు
ఒక ఆడదానికి మంచి జీవితాన్ని ఇచ్చేది భర్త ఐతే మానసిక ప్రశాంతత ని ఇచ్చేది మాత్రం అత్తగారే ఆమె ని స్నేహితురాలిగా చుడండి మీకు ఉన్న 99 సమస్యలు తిరిపోతాయి అత్త ని అమ్మ లా చుడండి మీకు మరో అమ్మ దొరుకుతుంది
Sekarana
No comments:
Post a Comment