Sunday, July 6, 2025

 నందీశ్వరునికి, నటనకి సంబంధం ఏమిటి? అతని పేరు మీదుగా అవార్డులు ఎందుకు ఇస్తారు?
జవాబు
శివుడు "నటరాజు" గా, సృష్టి, స్థితి, లయకారకుడిగా తాండవం (విశ్వ నృత్యం) చేస్తాడు. ఈ తాండవానికి మూలం నందీశ్వరుడే అని కొన్ని పురాణ కథలు చెబుతాయి. శివుడి ఆనతి మేరకు నందీశ్వరుడు బ్రహ్మకు నాట్యవేదాన్ని ఉపదేశించాడు అని, దానినే భరతముని నాట్య శాస్త్ర రూపంలో లోకానికి అందించాడు అని ప్రచారంలో ఉంది.( ఓం) భారతీయ శాస్త్రీయ నృత్యాలన్నిటికీ శివతాండవమే మూలం అని చెబుతారు. కాబట్టి, నందీశ్వరుడు కళలు, ముఖ్యంగా నృత్యం, నటనకు పరోక్షంగా ప్రేరణగా నిలుస్తాడు.( ఓం)
నాట్యం ఎలా పుట్టిందో, భావాలను ఎలా వ్యక్తపరుస్తుందో శారదా తనయుడు భావప్రకాశంలో ఇలా వివరించాడు.
ప్రళయం వచ్చినప్పుడు శివుడు లోకాలను నాశనం చేసి, తర్వాత ఆనందంగా తాండవం చేశాడు. ఆ తర్వాత తన కోరికతో విష్ణువును, బ్రహ్మను సృష్టించాడు. అప్పుడు మాయా స్వరూపిణి అయిన పార్వతి దేవి శివుడి పక్కన కూర్చుంది.(ఓం)
తర్వాత, శివుడి ఆదేశం మేరకు బ్రహ్మ లోకాలను సృష్టించాడు. అప్పుడు బ్రహ్మకు శివుడి పూర్వ చరిత్రను చూడాలనిపించింది. ఎలా చూడాలని ఆలోచిస్తుండగా, నందికేశ్వరుడు వచ్చి నాట్య వేదం నేర్పించి ఇలా చెప్పాడు: "నాట్య వేదంలో చెప్పిన విధంగా ఒక నాటకాన్ని నువ్వు తయారు చేసి, నటులకు చక్కగా నేర్పించు. ఆ నాటకాన్ని నటులు అభినయించినప్పుడు నీ గత కర్మలన్నీ నీకు కనిపిస్తాయి."(ఓం)
ఇది విన్న బ్రహ్మ సంతోషించి, దేవతలతో కలిసి 'త్రిపురదాహం' అనే నాటకాన్ని రచించి, నటులకు నేర్పించి ప్రదర్శించమని కోరాడు. వారు ఆ నాటకాన్ని బాగా ప్రదర్శించారు. ఆ ప్రదర్శన చూస్తున్న బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుండి శృంగారం మొదలైన నాలుగు ముఖ్యమైన రసాలు మరియు నాలుగు వృత్తులు (నాట్య పద్ధతులు) పుట్టాయి.(ఓం)
నందికేశ్వరుడు అభినయ దర్పణం రచించాడు. అందుకే అభినయానికి నంది అవార్డులు. ( ఓం)
నంది పురస్కారాలకు లేపాక్షి నంది పేరును స్ఫూర్తిగా తీసుకున్నారు. లేపాక్షిలోని ఏకశిలా నంది శిల్పం తెలుగువారి శిల్పకళా నైపుణ్యానికి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. తెలుగు చరిత్ర, సంస్కృతి, కళలకు నంది ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుంది.( ఓం)
నంది శివుని వాహనం కావడం వల్ల హిందూ ధర్మంలో పవిత్రమైన, ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంది. ఒక పురస్కారానికి నందీశ్వరుని పేరు పెట్టడం ద్వారా, ఆ పురస్కారానికి ఒక పవిత్రత, గౌరవం, ప్రాముఖ్యత లభిస్తుంది.( ఓం)
నంది అనేది వేల సంవత్సరాలుగా పూజింపబడుతున్న ఒక దైవ రూపం. కళలు కూడా ప్రాచీనమైనవి, నిరంతరం వృద్ధి చెందేవి. నంది పేరును పురస్కారాలకు ఎంపిక చేయడం ద్వారా, కళలకు ఒక స్థిరత్వం, నిరంతరాయమైన వృద్ధిని సూచిస్తుంది.( ఓం)

No comments:

Post a Comment