[8/16, 08:26] +91 63016 62240: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సుందర సుమధురం -*
*కృష్ణ జననం*
➖➖➖✍️``
```
*ప్రతిమలోనైనా ప్రత్యక్షంగానైనా శ్రీకృష్ణుడి సుందర రూపాన్ని దర్శించడం కళ్లు చేసుకున్న అదృష్టం. ఆ మురళీధరుడి వేణుగాన మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం చెవులకు దక్కిన వరం. మంచిని బోధించిన ఆ భగవానుడి మాట "గీత" అయ్యింది. గోపాలుడు పాండవులకు అండగా నిలవబట్టే ధర్మస్థాపన సాధ్యమైంది. ఆ జగన్నాటక సూత్రధారి లీలా విలాసాలు మాటలకందని మాధుర్యాలూ.. చెప్పనలవికాని పరమాద్భుతాలు.*```
చేత వెన్నముద్ద.. చెంగల్వ పూదండ.. బంగరుమొలతాడు పట్టుదట్టి.. సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు.. చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతు'
ఈ ఆటవెలది పలకని తెలుగువాళ్లుండరు. విశ్వ సృజన కర్త అయిన మాధవుడికి జననం ఒక ఆటవిడుపు. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు తన లీలా విలాస ప్రదర్శనకు ముందుగానే చేసుకున్న ఏర్పాట్లు, జీవన సమరంలో మనకెదురయ్యే సందేహాలకు సమాధానం శ్రీకృష్ణావతారం.
నేస్తాలతో ఆటపాటలు, గోపికలతో దుడుకు చేష్టలు, పూతన తదితర రాక్షస సంహారం, కాళీయుని మదమణచడం.. వంటి చిత్రవిచిత్ర పనులతో బాల్యాన్ని ఆస్వాదించిన నందగోకుల విహారి శ్రీహరి.
శ్రీకృష్ణ నామాన్ని స్మరించడమంటే అమృతాన్ని ఆస్వాదించడమే. ఆ దేవదేవుడి స్వరూపం అంతకంటే మధురం. అందుకే విశ్వమోహనుడి సుందర స్వరూపాన్ని దర్శించాలని దేవతలూ, ఋషులూ శక్తికొద్దీ యత్నించారు. కానీ ఎవరికైనా దొరికాడా ఆ వెన్నదొంగ!```
*చిక్కడు సిరికౌగిటిలో, జిక్కడు సనకాది యోగిచిత్తాబ్దములన్*
*జిక్కడు శ్రుతి లతికావళి, జిక్కె నతడు లీల దల్లిచేతన్ రోలన్*
```
శ్రీ మహాలక్ష్మి కౌగిటికీ చిక్కనివాడు, సనకాది మునీంద్రులు చిత్తంలోనూ స్థిరంగా నిలవనివాడు, వేదాలు చదివినా అర్ధం కానివాడు.. ఆశ్చర్యంగా తల్లి యశోద చేతికి చిక్కి రోలుకు బంధితుడయ్యాడు.
ఆహా..! అమ్మ ప్రేమ మాధుర్యానికి అంతర్యామి అయినా తలవంచక తప్పదనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది? మన్ను తిన్న నోట్లోనే మిన్నును, మొత్తం అంతరిక్షాన్ని ఇముడ్చుకున్న బృందావన సంచారి ఆ శిఖిపింఛ మౌళి.```
*సుమధుర వాత్సల్యం:* ```
మనం మాయాబంధితులం. కష్టాల కార్చిచ్చు - జీవితాన్ని దహించేయడానికి సదా సిద్ధంగా ఉంటుంది. తప్పించుకునే తరుణోపాయం కోసం అన్వేషిస్తే నల్లనయ్య చల్లని కృపకు పాత్రులం కావడమేనని అర్ధమవుతుంది.
కన్నయ్య గొప్ప యోగి. అడవిలో చెలరేగిన దావానలాన్ని మింగి గోవులను, గోప బాలకులను రక్షించిన మహిమా సంపన్నుడు. ఆ యోగ బలాన్ని ప్రత్యక్షంగా దర్శించిన గోపాలకులు``` *'ఈ బాలుడు బ్రహ్మో, విష్ణువో శివుడో అయ్యుంటాడే గానీ సామాన్యుడు కాడు'* ```అనుకున్నారు. అరణ్యంలో పుట్టిన దావాగ్నిని అవలీలగా అజచేసిన ఆ యోగిపుంగవుడికి భక్తుల్ని కష్టాల కార్చిచ్చు నుంచి బయటపడేయడం శ్రమ కాదు. మనుషులకే తప్ప సృష్టికర్తకు రాగాలుండవు. నిప్పులాంటి స్వచ్ఛత పరమాత్మ తత్వం. చెదల వంటి వైషమ్యం అంటితే దేవుడెలా అవుతాడు. కృష్ణుడు పరమాత్ముడని ఋజువు చేస్తుంది భాగవతం. గోపికలు కాంక్షతో సేవించారు. కంసుడు ప్రాణభయంతో తలచుకున్నాడు. కృష్ణుణ్ణి ఎలా కష్టపెట్టాలన్నదే శిశుపాలుడి నిరంతర ఆలోచన.
యాదవులంతా బంధుప్రీతితో స్మరిస్తే, పాండవులేమో స్నేహభావంతో మెలిగేవారు. ఎవరు ఎలాంటి భావంతో తలచుకున్నా అందరికీ మోక్షాన్ని అనుగ్రహించాడంటే ఆ సర్వేశ్వరుడి వాత్సల్యం ఎంతటిదో!```
*మోక్ష పథగాములకు ఆయన శ్రీ చరణ సన్నుతి తప్ప అన్య గతి లేదు.* ```
భాగవతం మరో రహస్యాన్ని కూడా బోధిస్తుంది. ఆ కథలను వింటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే శ్రవణేంద్రియాల ద్వారా హృదయపద్మంలోకి ప్రవేశిస్తాడు. శరదృతువు వచ్చే వేళకు నదిలో మాలిన్యమంతా అడుగుకు చేరి స్వచ్ఛమైన నీరు పైకి తేలినట్లు కన్నయ్యను మనసులో నిలిపితే దోషభావాలన్నీ అడుగంటిపోతాయి. ఇక ఆ మహితాత్ముడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. మాటల్లో సత్యం ప్రతిష్ఠితమవుతుంది. చేతల్లో స్థిరత్వం ప్రతిపాదితమవుతుంది. కృష్ణభగవానుడి అనుచరులం అనిపించేలా వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. అందుకే అనునిత్యం కృష్ణుణ్ణి స్మరించమంటారు పెద్దలు. తెలిసీతెలియక చేసిన పాపాలు కృష్ణ నామస్మరణతో నశిస్తాయంటోంది స్కాంద పురాణం. కుచేలుడిపై కృష్ణుడు చూపిన స్నేహమాధుర్యం అందుకు సాక్ష్యం. అర్జునుడితో సాగించిన నర నారాయణ సంబంధం ఆత్మ స్వరూపులమైన మనతో ఆ పరమాత్మ చుట్టరికాన్ని కూడా కలపగలడని అవగతమవుతుంది.
```
*ఆయుధం పట్టని వీరుడు!* ```
కురుక్షేత్ర యుద్ధంలో గోపాలుడు ఆయుధాన్ని చేపట్టలేదు. యుద్ధం గెలవడానికి మాత్రం కారణమతడే. యుద్ధ విముఖుడై వెనుదిరిగిన పార్ధుణ్ణి ముందుకు నడిపిన బోధ., అదే``` *భగవద్గీత.* ```సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు పాండవ సైన్య శ్రేణిని ఊచకోత కోస్తుంటే భీష్ముణ్ణి సంహరించడానికి ధర్మరాజుతో సగం అబద్దం పలికించినప్పుడు సకల వేదవేత్త అయిన ఆ కృష్ణ పరమాత్మ అసలైన రాజకీయవేత్తలా అనిపిస్తాడు. ప్రత్యక్షంగా కనిపించకున్నా జీవితాన్ని ఎంత అందంగా మలచుకోవాలో తెలియజేసిన ఆ మాధవుడే మన గురువు. ఆ మహితాత్ముడే మన ధైర్యం. ఆ మహనీయుడే మన సైన్యం. కనుకనే...```
*కృష్ణుడు విశ్వ కల్యాణ కారకం.*✍️
*Courtesy:* ఈనాడు మకరందం
*సేకరణ:*
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
[8/16, 08:26] +91 63016 62240: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కృష్ణ అంటే...*
➖➖➖✍️
```
కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం!
కృష్ణ అంటే ఒక దేహం కాదు. కృష్ణ అంటే ఒక విగ్రహానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక కాలానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక చైతన్యం! సర్వ వ్యాప్తి, కాలాతీతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, వ్యాకరణం, ఒక ఇంజనీర్, ఒక వైద్యుడు, ఒక న్యాయ మూర్తి, ఒక రైతు, ఒక కాపరి, ఒక సైన్యం, ఒక చక్రవర్తి, ఒక మార్గదర్శి, ఇంకా ఎన్నో ఆయనే....
ముఖ్యంగా ‘పరమాత్మనే నేను!’ అని చెప్పిన వాడు.
‘నేను అంతటా ఉన్న వాడిని నీలోని నాలోని ఉన్నది నేనే!’ అని చెప్పినవాడు. నేనే అంటే పరమాత్మే అని చెప్పినవాడు. ‘అర్జునా నేను అది తెలుసుకున్నాను నీవు తెలుసుకోలేదు, నీవు నేను ఒక్కటే! అది నీవు కూడా తెలుసుకో. అది జ్ఞానం ద్వారా దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే. నీకు ఆ దివ్య జ్ఞానాన్ని తెలుపుతున్నాను.’ అని భగవద్గీతను అర్జునుడికి బోధిస్తున్నట్లు సర్వ మానవాళికి అందించిన ప్రేమ స్వరూపుడు.
కృష్ణ(పరమాత్మ స్వరూపం రూపం) అందరిలోనూ, అన్నిటిలోనూ, అంతటా వ్యాపించి ఉన్నవాడు.
కృష్ణ అంటే కృషి చేయవాడు. అంటే వ్యవసాయం చేయువాడు. మన హృదయాలలో ఉన్న చీకటి అనే అజ్ఞాన మాలిన్యం తొలిగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రకాశింప చేసేవాడు.
కృష్ణ అంటే చీకటి. నలుపు అందులోనుండి వచ్చిన వెలుగే ఈ ప్రకాశం.
ఎవరైతే తమలో ఉన్న నేను అనే అజ్ఞానాన్ని పార ద్రోలుకుంటారో వారిలో జ్ఞానమై తిష్ట వేసుకుని కూర్చుంటాడు.
కృష్ణడు పూజలకు, స్తోత్రాలకు, భజనలకు జపాలకు, కీర్తనలకు, ద్యానాలకు, తపస్సులుకి, దాన ధర్మాలకు, క్షేత్ర దర్శనాలకు లభ్యం కాడు. తాను చెప్పినది అర్థం చేసుకున్నవాడు, తాను చూపిన మార్గంలో నడిచిన వాడు, ఎవరైతే కర్మ చేస్తూ కర్మ మార్గంలో ఉంటూ నిష్కామ మార్గాన్ని అవలంబించి, నేను చేస్తున్నాను అన్న భావనని విడిచి పెడతారో, ఎవరైతే తన మార్గంలో ఉంటూ ఎవరైతే తమ హృదయాల్లో కోపం, ద్వేషం, అసూయ, డాంభికం, దర్పం, ఈర్ష్య, పగ ప్రతీకారం, గర్వం, అహంకారం మొదలగు మాలిన్యాలను లేకుండా ఉంటారో, ఎవరైతే అన్నిటిలోనూ, అందరిలోనూ, సర్వ జీవులలో, సర్వ జీవ జాతులలోనూ, పసుపక్ష్యాలలోనూ, సర్వ మానవాళిలోనూ తననే చూసుకుంటారో, నేను శరీరం కాదు ఆత్మ స్వరుపం అని తెలుసుకుంటారో, ఎవరైతే నిరంతరం ఆనంద స్వరూపంగా ఉంటారో ఇంకా ఉన్నాయి... వారికి కృష్ణుడు లభ్యం అవుతాడు.
ఆయన బాటలో నడుస్తూ భగవద్గీతా పఠనం చేద్దాం. మనం ఉద్ధరింప పడదాం.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
[8/16, 08:26] +91 63016 62240: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*శ్రీ కృష్ణ జననం*
➖➖➖✍️
శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది.
ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.
మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు.
పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు.
మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు.
‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు.
కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.
ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.
వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.
కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.
ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.
కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.
వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.
అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
[8/16, 08:26] +91 63016 62240: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*శ్రీకృష్ణుడు*
➖➖➖✍️
*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం:*
```
1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల
క్రితం జన్మించాడు.
2. పుట్టిన తేదిక్రీ.పూ.18.07.3228
(3228 B.C).
3. మాసం : శ్రావణం.
4. తిథి: అష్టమి.
5. నక్షత్రం : రోహిణి.
6. వారం : బుధవారం.
7. సమయం: రాత్రి గం.00.00 ని.
8. జీవిత కాలం : 125 సంత్సరాల
8నెలల 7రోజులు.
9. నిర్యాణం: క్రీ.పూ.18.02.3102
(3102 B.C).
10. శ్రీకృష్ణుని 89వ యేట కుఱుక్షేత్రం
జరిగినది.
11. కురుక్షేత్రం జరిగిన 36సం.
తరువాత నిర్యాణం.
12. కుఱుక్షేత్రం క్రీ.పూ.8.12.3139
న మృగశిర శుక్ల ఏకాదశినాడు
ప్రారంభమై
3139 న
ముగిసినది.
క్రీ.పూ 3139న 3గం.
నుంచి5గం.లవరకు సంభవించిన
సూర్య గ్రహణం జయద్రదుని
మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ.2.02.3138న
ఉత్తరాయణంలో మొదటి
ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో
వివిధ నామాలతో పూజిస్తారు.
అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల(విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు &
రాంచ్చోడ్.
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
ఆంధ్రలో కృష్ణుడు.
15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ.
17. పెంచిన తండ్రి నందుడు.
18. పెంచిన తల్లి యశోద.
19. సోదరుడు బలరాముడు.
20. సోదరి సుభద్ర.
21. జన్మ స్థలం మధుర.
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ,
జాంబవతీ,కాళింది, మిత్రవింద,
నగ్నజితి, భద్ర, లక్ష్మణ.
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం
నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం.
వారు : చాణుర - కుస్తీదారు,
కంసుడు - మేనమామ,
శిశుపాలుడు మరియు
దంతవక్ర - అత్త కొడుకులు.
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు.
42. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment