*ప్రకాశమే వికాసం..!*
_ఆంధ్రకేసరి జయంతి_
23.08.1872
+++++++++++++++++
*ప్రమాదం ఉన్న చోట*
*ప్రకాశం ఉంటాడు...*
ఈ ఒక్క మాటే చాలు
ప్రకాశం పంతులు
కథ చెప్పడానికి..
*పంతులు గాలితో కూడా పోరాడేందుకు సిద్ధమే..*
ఈ ఉపమానం ఆయన
నిరుపమాన
పోరాట పటిమను
కళ్లకు కట్టదా..
చొక్కా బటన్ విప్పి
హఠం చేస్తే
తెల్లవాడి బుల్లెట్టే వెనకడుగు
_ఆ సంగతి కావాలంటే_
_సైమన్నే అడుగు..!_
ఉమ్మడి మద్రాసుకు..
పురిటిబిడ్డ తెలుగు గడ్డకు
ముఖ్యమంత్రి అయినా
లేనేలేదు
పూర్తి పదవీకాలం
అదే అదే
ఆంధ్రకేసరి
కోలాహలం..
అనుకున్నాడంటే ఆచరణే..
ఉండదు రాజీ..
*అవతల నెహ్రూనే ఉండనీ..*
*రాజాజీ కానీ*
_పెట్టుకున్నట్టే పేచీ.._
_ఉండబోదు లాలూచీ..!_
*వారాలతో విద్యాభ్యాసం*
*పోరాటాలతో సావాసం..*
పేదరికాన్ని జయించి
అయ్యాడు బారిస్టర్..
కోర్టు వాదనల్లోనూ
అయ్యాడు మాస్టర్...
_సహాయ నిరాకరణ_
_ఆయన వ్యాకరణ..!_
*ప్రత్యేక ఆంధ్ర ప్రకాశం ముద్ర*
తెలుగుగడ్డ అభివృద్ధికి
ఆయనే మూలమన్నది
జనాల ఆమోదముద్ర..
పంజాబ్ లో సమస్య ఉంటే అక్కడికి వెళ్లి మద్దతు ఇవ్వటమే ఆయన జాబ్..
కేరళలో నిషేధం ఉన్నా అడుగుపెట్టి మూల్యంగా
విలువైన ఆస్తినే
పోగొట్టుకున్న త్యాగం..
తుపాకీ గుళ్లకు
వెరవని ధైర్యం
రజాకార్లనూ కలిసిన తెగువ..
సకల భారతావనికీ తెలుసు
ఆయన విలువ..
గౌరవంగా ఆవిర్భవించిన
ప్రకాశం జిల్లా..
కృష్ణా నదిపై చెక్కు చెదరని
బ్యారేజి నాటికీ నేటికీ
ఏనాటికీ ఆయన
కీర్తిప్రతిష్టల ఖిల్లా..!
మొత్తంగా తెలుగు రాష్ట్ర
వికాసమే ఈ ప్రకాశం..
తప్పు జరిగితే ఎంతటి వారినైనా ఎదిరించి పోరాడు
అన్నది ఆయన ఆదేశం..
*ఆంధ్రులు ఆరంభ శూరులు*
*కారనేదే ఆయన జీవితం*
*జాతికిచ్చిన సందేశం..!*
ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా
ప్రణామాలు అర్పిస్తూ..
**********************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
విజయనగరం
9948546286
7995666286
No comments:
Post a Comment