Monday, August 25, 2025

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…

      *ఎవరు నిజమైన గురువు?*
                ➖➖➖✍️
```
కంచి కామకోటి పీఠాధిపతులు                             శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఉత్తర భారతదేశంలో పర్యటన చేస్తున్నప్పుడు అప్పటి దేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధి గారు మహాస్వామివారి దర్శనానికి వచ్చారు.

దేశ ప్రధానమంత్రి పరమాచార్య స్వామిని ఇలా అడిగారు, “ఆధ్యాత్మికత, దైవం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల గురించి మీరు నాకు చెప్తే, నేను వారిపై కఠిన చర్య తీసుకుంటాను”

పరమాచార్య స్వామివారు నవ్వి, ఇలా అన్నారు. “లేదు! దాన్ని ఈ విధంగా పరిష్కరించరాదు. ఎవరైతే అటువంటి దొంగ స్వాముల వద్దకు చేరతారో, కొంతకాలం తరువాత తమకు తామే వారి ఆధ్యాత్మిక పరిపక్వత స్థాయిని తెలుసుకుంటారు”

మహాస్వామివారు ఇచ్చిన సమాధానంతో శ్రీమతి ఇందిరా గాంధీ తృప్తిపొందలేదని అర్థం చేసుకున్నారు. అక్కడున్న భక్తులలోంచి చిన్నవారినొకరిని పిలుచుకుని రమ్మని సహాయకులకు చెప్పారు స్వామివారు.

ఒక ఐదు సంవత్సరాల వయస్సున్న పిల్లని పిలుచుకుని వచ్చారు.
చిరునవ్వుతో ఒక పళ్ళబుట్టని చూపిస్తూ “నీకు ఏమి కావాలో తీసుకో” అని అన్నారు. ఆ పిల్ల కొద్దిసేపు వెతికి ఒక పండిన పండు తీసుకుంది.

దీన్నంతా గమనిస్తున్న ఇందిరా గాంధీతో మహాస్వామివారు, “చిన్నపిల్లలు ఎలాగైతే పండినదో, పండనిదో తెలుసుకోగలరో, అలాగే సత్యాన్ని వెతుకుతూ వెళ్ళేవారికి జీవితంలో ఏదో ఒకరోజు సరియైన మహాత్ముడు దొరుకుతాడు”✍️```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥
 "కంచిపరమాచార్యవైభవం"!!!🙏

🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment