*రాధకృష్ణులు - రాధ అంటే ఎవరు.?*
*ఒకరు ప్రియురాలు అని. మరికొందరు కృష్ణుని బంధువులు అని... వేరొకరు కన్నయ్యకు అత్త అని... ఏవేవో ఉహాలు... కానీ... ఒక్క ధ్యాని సాధకుడు యోగి మాత్రమే కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతాడు. ధ్యాన స్దితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే... రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని (భక్తీ అని) అర్ధము.*
*అనగా అత్యంత భక్తురాలు.*
*రాధ : ధారా... అదో నిరంతర వాహిని కుండలి నుండి మూలాదార వరకు జాలువారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని) ధారలా భూలోకము నుండి (మూలాధారా) వైకుంఠము (సహస్రారం)నకు తీసుకుని వెళ్ళగలిగే ఒక శక్తి ధార. రాధ ఇదో నిరంతర వాహిని ఇదే ధ్యానం, భక్తి, ప్రేమ.*
*కృష్ణుడనగా ఆకర్షించు వాడని యర్ధము. నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది. కాని, మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము.*
*రాధ యనగా సిద్ధింప* *చేయునది అని అర్దము (మోక్షం). కృష్ణ (సాధకుడు) ఎక్కడ ఉంటే (నిరంతర) ధార (రాధ) అక్కడ ఉంటుంది.*
*నా దేహం వేరు... నా శ్వాస వేరు అని చెప్పగలమా.? లేదే. ఇరువురు ఒక్కటే. ఇలా కృష్ణుని అంతరమైన స్వరూపము రాధగను, బాహ్య రూపము పురుషుడినియు, అలాగే రాధయొక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుని గాను, బాహ్య స్వరూపము రాధ.*
*భగవాన్ కృష్ణ కోసం 16,౦౦౦ మంది గోపికలు వచ్చారు. రాసలీలలు అని వ్యర్ద ప్రేలాపనలు చెపుతూ ఉంటారు. యద్బావం తద్బభవతి వారిని మనం మార్చలేము. కాని సత్యం మాత్రం ఇదే.*
*ఎప్పుడు భాహ్య నేత్రాలతో చూడటమేనా.? ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో ఆత్మ స్దితిలో చూస్తే పరమాత్ముని కోసం పరితపిస్తున్న జీవాత్మలు 16,౦౦౦. నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి సత్య జ్ఞానాన్ని పొందిన (ఎరుక) సిద్దులు. వారు లక్ష్యం వెతుకులాట.! ఆ మహాచైతన్యం కోసం వెతుకులాట.! ఆ పరంధాముని కోసం వెతులాట.!*
*ఆ వెతుకులాటలో ధ్యాన మార్గం చూపిన వాడు కృష్ణ జ్ఞాన మార్గం చూపిన వాడు కృష్ణ దేముడికి జీవుడికి ఉన్న బంధాన్ని ఎరుక పరచిన వాడు కృష్ణ శోధన నుండి సాధన వైపు సత్యాన్ని ఎరుక పరచిన వారు కృష్ణ. ఆబాల గోపాలం అంతా సిద్దులు, యోగులు, తాపసులు. గోకులం అంటే వైకుంఠం. అందులో భక్తీ అంటే రాధ. వైకుంఠం + ధ్యానం +కలిసి యున్నదే బృందావనం ...*
*కాపున బృందావనము అంటే ఓ సమూహం. జీవ సమూహము. ధ్యాన జీవుల సమూహం. ఇకనైనా రాధ మాధవ తత్వాన్ని అర్ధం చేసుకుందాం.*
*🪷 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🪷*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
No comments:
Post a Comment