తెలుసుకోండి...230825
తెలియజేయండి....
*బ్రహ్మవాదినులు*
సనాతన ధర్మంలో స్త్రీలు వేదాలు నేర్చుకోవటమే కాదు. వేదాలు రచించటంలో కూడా ఎందరో స్త్రీలు ముందంజ వేశారు. ముఖ్యంగా శుక్ల యజుర్వేదం వ్రాసిన ద్రష్టల్లో యెందర స్త్రీలు వున్నారు.
భృగువు భార్య అయిన “ఉశవ” 'గౌరీవితి” అనే స్త్రీ ఋషి, భరద్వాజుని పుత్రిక, చెలకి, జయ, దక్ష పుత్రిక అయిన “మేధ”, అగస్త్యపత్ని "లోపాముద్ర రమ్యాక్షి, వశుశృత, వారుణి, నాగమాత “కద్రువ", హైమ, “శిరింభిర” (ఈ కూడా భరద్వాజ పుత్రికే), వృష, విశ్వవార, ఆసురి, విదర్శి, సర్పరాజ్ఞి... యిల యెందరో స్త్రీలు యజుర్వేదం వ్రాసిన వారిలో వున్నారు. అలాంటి వారిని "బ్రహ వాదినులు". అనేవారట. ఈ “బ్రహ్మవాదినులు" సమాజంలో చాలా గౌరవించబడేవారు.
త్వష్ట ప్రజాపతి కుమార్తెలయిన త్వాష్ట్రలు సామవేదంలో కొన్ని “సామ” ల రచించారట. వారు వ్రాసిన సామలను "త్వాష్ట్రీసామలు" అంటారు. ఒకపుడు ఇంద్రుడికి వచ్చిన నేత్రదోషాలను యెవ్వరూ నివారించలేకపోయారట. అపుడ ఈ త్వాష్ట్రలు సామగానంతో వైద్యం చేసి ఇంద్రుడి నేత్ర దోషాలను నివారింపచేశారట. అనగా వీరు వేదద్రష్టలే కాక స్త్రీ వైద్యులు (లేడీ డాక్టర్స్) అని కూడా చెప్పవచ్చు.
అంగీరసుని కుమార్తె "అకూపార” అనే స్త్రీ తనకు వచ్చిన చర్మవ్యాధి (శరీరమంతా ఉడుము చర్మంలా మొద్దుబారటం) నివారణ కోసం ఒక సామన రచించి దానితో ఇంద్రుని ప్రార్థించి వైద్యం చేసుకుని వ్యాధిని తగ్గించుకుంది. ఆ సామపేరే “అకూపారం”. ఆమె కూడా ఒక లేడీ డాక్టరేనని చెప్పవచ్చు కదా ! వీరంతా డాక్టర్లే కాదు. కొత్త మందులను, సామలను కనుగొన్న సైంటిస్టులు.
ఈ విధమైనదే మరో ఉపాఖ్యానం ఋగ్వేదం 8 మండలంలో 80 వ సూక్తంలో వుంది. అత్రి కుమార్తె పేరు "అపాల" ఆమె తన స్వీయకథను యీ సూక్తంలో వివరించింది. ఆమెకు, ఆమె తండ్రికి ఒక వింతయిన చర్మరోగం వచ్చిందట. ఇద్దరికీ తలమీద, శరీరంమీద వెంట్రుకలు రాలిపోయాయి. అందువలన ఆమెను ఆమె భర్త వదిలేశాడు. ఆమెకి పిల్లలు కూడా లేరు. వారి పొలాలను దున్నే మగదిక్కు A లేక, పంటలు కూడా పండలేదు. అందువలన ఆమె ఇంద్రుడిని స్తుతిస్తూ అనేక మంత్రాలను రచించింది. ఆ మంత్రాలు కూడా ఋ 8-80 లో చేర్చబడ్డాయి. ఇంద్రుడు ఆమెను మెచ్చుకుని దిగివచ్చాడు. తనకు, తన తండ్రికి రోగం నయం కావాలని కోరింది అపాల. ఇంద్రుడు తన రథ చక్రపు రంధ్రాల ద్వారా సూర్యరశ్మినీ, ఓషధీ ధారలను ఆమె మీద, ఆమె తండ్రి మీద ప్రసరింపచేశాడు. ఫలితంగా ఇద్దరూ పూర్ణారోగ్యవంతులయ్యారు. అపుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఆమెకి సంతానం కలిగింది. పాడిపంటలు సిద్ధించాయి.
ఇక్కడ మరల రెండు విషయాలు తెలుస్తున్నాయి.
1) ఔషధాలతోపాటు, సూర్యరశ్మి కూడా చర్మ వ్యాధులను తగ్గిస్తుందని వేదకాలంలోనే అపాల కనుగొంది.
2) అపాల తమ చర్మరోగాలకు మందు కనుగొన్న లేడీడాక్టర్ మరియు శాస్త్రవేత్త. ఆమె మందులు కనుగొని అవి వాడుతూ సూర్యరశ్మి వైద్యం తీసుకుంటూ తన కోరికలు నెరవేరాలని అనారోగ్యం తగ్గాలని ఇంద్రుని ప్రార్థిస్తూ కొత్త మంత్రాలను కనుగొని ఋగ్వేదంలో వ్రాసింది.*
కనుక ఆమె వేద ఋషుల జాబితాలోని స్త్రీ ఋషి అని గుర్తించక తప్పదు. ఇన్ని విధాలుగా స్త్రీలే వేద రచయిత్రులుగా, ద్రష్టలుగా వుండగా, స్త్రీలే వేద చర్చలకు, తత్వ వాదనలకు హాజరు కాగా, స్త్రీలే యజ్ఞాలలో వేద మంత్రాలను పఠించవలసి వుండగా, స్త్రీలే యజ్ఞోపవీతాలు ధరించి వేదాలు నేర్చుకోగా. స్త్రీలు వేదం చదవరాదనే దానికేమయినా అర్థం వుందా?
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812
No comments:
Post a Comment