Monday, August 25, 2025

 [8/12, 11:35] +91 63016 62240: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

నమ్మిన నామదిమంత్రాలయమేగా. ఓఓ, నమ్మని వారికి తాపత్రయమేగా. 
శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓఓ, చల్లని చూపుల సూర్యోదయమేగా. 
గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత".... 

కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు *శ్రీ రాఘవేంద్ర స్వామి.* 
శ్రీహరి భక్తుడు. 
ఈయన కొలువై ఉన్న ప్రాంతమే *"మంత్రాలయం".* 

*మంత్రాలయం అసలు పేరు "మాంచాలే".*

కర్నూల్ జిల్లలో  తుంగభద్రా నది తీరన కొలువైన మహిమన్మితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం 
మంత్రాలయం. 
రమణీయమైన,అద్బుతమైన దివ్య క్షేత్రం . 

కాంచి పట్టణానికి 26 మైళ్ళ దూరం లో గల భువనగిరి లో క్రి శ 1598 లో *వెంకట బట్టు* అనే బాలుడు జన్మించాడు . 
ఆయనే పెరిగి పెద్దవాడు అయి శ్రీ రాఘవేంద్ర స్వామి గ ప్రసిద్ది చెందాడు . 

రాఘవేంద్ర స్వామి పాల్గుణ మాసం లోవచ్చే శుద్ధ  సప్తమి తిథి నాడు జన్మించాడు .ఆ రోజు ని స్వామి వారి జయంతిగా విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి .

"శ్రావణ బహుళ ద్వితీయ" నాడు క్రి . శ. 1671 లో అయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సామాది అయినారు. 
ఆ సమాధినే *రాఘవేంద్ర బృందావనం* అని పిలుస్తారు. 

ఆ బృందావనం నాటి నుండి నేటి వరకు  గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా,దివ్య క్షేత్రంగా  వీరాజిల్లుతున్నది.  
శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని  భక్తుల విశ్వాసం . తనను నమ్మి తన దగ్గరికి వచ్చిన వారి కోరికలు, ఆపదలు తప్పకుండ తీర్చు మహిమన్మితమైన స్వామి . 
స్వామి బృందావనంతరం కూడా  ఈ క్షేత్రం కి వచ్చే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం . మూడు రోజుల పాటు జరిగే ఈ ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా, దేదిప్యామనాంగా జరుగుతాయి . 

మహా  తపస్సంపన్నుడు జమదగ్ని మహర్షి, ఆయన బార్య రేణుకాదేవి మంచాల దేవతగా ఇక్కడ అవతరించింది అని ఆమె పేరు మీదే గ్రామానికి మంచాల అని స్థిరపడింది అని, ఆ తరువాత అది మంత్రాలయ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది అని, స్థల పురాణం .

బృందావనం వెలసిన చోటే పూర్వం బక్త ప్రహలధుడు యజ్ఞం చేసాడని , అతడే కలియుగం లో రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని, విజయ నగర సామ్రాజ్యదినేత శ్రీ కృష్ణ దేవరల మత గురువు ఆయన శ్రీ వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని చెబుతుంటారు . తనను దర్శించిన బక్తుల కోరికలు తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని , సిరి సంపదలను కలగచేస్తారు రాఘవేంద్ర స్వామీ. 

ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/12, 11:35] +91 63016 62240: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవం*
  
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 అవతార త్రయంలో చివరిగా శ్రీ రాఘవేంద్ర స్వామి తమ అఖండ పుణ్యరాశిని లోక కళ్యాణార్థమై భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భక్త జనుల కామధేనువై, కల్పవృక్షమై దీన జనులను ఉద్దరిస్తూ మంత్రాలయంలో సశరీరముగా బృందావన ప్రవేశం చేశారు. స్వామి బృందావన ప్రవేశం అయిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
   
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 
16వ శతాబ్దంలో జీవించాడు. వీరు వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్నిఅవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. వీరు శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. 

మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. 

వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

విజయనగర సామ్రాజ్యము లోని ఒక పండిత కుటుంబానికి చెందినవారు రాఘవేంద్రులు. విజయనరగర సామ్రాజ్య పతనము తరువాత వీరి పూర్వీకులు కావేరీ తీరములోని కుంభకోణానికి చేరారు. అక్కడి మఠాధిపతి "సురేంద్రతీర్ధులు" వీరి కుటుంబ గురువులు. 

తిమ్మణ్ణ భట్ట, గొపికాంబలకు, మన్మధనామ సంవత్సరం పాల్గుణ శుద్ద సప్తిమి గురువారం నాడు తమిళనాడు రాష్ట్రంలోని భువనగిరి గ్రామంలో ''వెంకన్నభట్టు'' గా జన్మించారు. 
శ్రీ వెంకటేశ్వరుని కృపతో జన్మించిన వాడు. 

బాల్యములోనే ప్రతిభ కలవాడుగా గుర్తింపు పొందారు. వ్యాకరణము, సాహిత్య, తర్క, వేదాంతాలనన్నింటినీ అధ్యయనం చేశారు. సంగీత శాత్రము అభ్యసించి స్వయముగా కృతులను కన్నడ భాషలో రచించారు. 

చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా ఉన్నత విధ్యను అభ్యసించడానికి కుంబకోణానికి వెళ్ళి అక్కడ శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విధ్యను అభ్యసించారు. 
అక్కడే శ్రీ మాన్‌ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించారు. మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు. తంజావురిలో యజ్‌క్షానారాయణ దీక్షీతులకు ఆయనకు మధ్వద్వైత సిద్దాంతలపై జరిగిన వాదనలో వెంకటనాధుడే విజయం పొంది భట్టచార్యులు అనే బిరుదును కైవసం చేసుకున్నారు.

 ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. 
దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్ధస్వామి మఠం ప్రతిష్టను వెంకన్నభట్టు నిలిపేవారు. సుధీంద్ర తీర్ధస్వాములకు వయసు పైబడింది. ఆయన వారసుడుగా మఠం కీర్తిని నిలిపే ఉత్తరాధికారిగా నియమించే ఆలోచన మొదలైంది. సుధీంద్రతీర్ధస్వామి వారి దృష్టి వెంకణ్ణభట్టు మీద ఉండేది. కానిఆయన సంసారి. సన్యాస దీక్షకు సిద్ధముగా లేడు. అయినా తగిన వారసుడు వెంకన్నభట్టు అనే నిర్ణయానికి వచ్చి తంజావూరు తీసుకువెళ్ళి భార్యకు తెలియకుండా వెంకన్నభట్టుకు సన్యాసదీక్ష ఉప్పించి "రాఘవేంద్రతీర్ధులు" గా నామకరణము చేశారు. భర్త సన్యాసదీక్ష తీసుకున్న వార్త విన్న భార్య సరస్వతి ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించి బావిలో దూకి బలవన్మరణము చెందింది.
     తంజావురు రాజు రాఘునాధ్‌ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. 
గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. 

నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. 
ఆ తరువాత మఠ సంప్రదాయాల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. 

కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ ఆద్భుత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. 

ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందావనం నుండి అనేక మహిమలను చాటుతూ, కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా, కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలుస్తే సకల సంపదలు ఫలిస్తాయని భక్తులు నమ్మకంతో ఎందరో కొలుస్తున్నారు. 
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాము.
     
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామివారిపుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. 
ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. 
మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. 
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. 
ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి వసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.

 *రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు :* 
పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. 
ఆయన ఒక గృహస్తుడు. 
ఆయన భార్య పేరు సరస్వతి. 
కుమారుడు లక్ష్మీనారాయణ. 
'గురు సుధీంద్ర తీర్థ' వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు.
కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్లవెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. 
అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు. 
     
 ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం.స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామల మైన జాగీరుని స్వామికి సమర్పించాడు. 
స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. 

ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది.
 
అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. 

సాధారణంగా ప్రతిరోజూ 
ఉదయం 6గంటల నుండి మద్యాహ్నం 2గంటల వరకు, 
సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య 
దేవాలయాన్ని దర్శించ వచ్చు. 

ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణ. 
వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది. 
దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 

యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాలక్రితం నిర్మించబడింది.
      
ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసేబృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. 

ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. 

మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్ధరు స్ధాపించారు. పర్యాటకులు ఇక్కడి పంచ బ్రిందావనం కూడా చూడవచ్చు. 

దీనిలో అయిదుగురు రుషులు, అంటే.. 
శ్రీ సుజనేంద్ర తీర్ధ, 
శ్రీ శుబోధేంద్ర తీర్ధ, 
శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, 
శ్రీ సుజనానేంద్ర తీర్ధ 
మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల 
అవశేషాలుంటాయి.

*సేకరణ -*

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment