Saturday, August 23, 2025

*****Decoding Dhyana 🕉️ Ancient Hidden Science 🧬 దాచబడిన ప్రాచీన సైన్స్ #sanatandharma #bairaagi #bhakti

 Decoding Dhyana 🕉️ Ancient Hidden Science 🧬 దాచబడిన ప్రాచీన సైన్స్ #sanatandharma #bairaagi #bhakti



ధ్యానం చేస్తే ఏదో వస్తుందట. అది అన్ని ఆనందాల కంటే పెద్ద ఫీలింగ్ ఇస్తుందట. ఇది నిజమేనా అంత ముఖ్యమైనది అయితే నాకు ఎందుకు ధ్యానం అంటే బోర్ అనిపిస్తుంది. అంత ముఖ్యమైనది అయితే ఎందుకు నాకు మాథ్స్ కంటే ముందు స్కూల్లో దీన్ని నేర్పించలేదు. ముసలి వాళ్లే కదా అలాంటివన్నీ చేసేది. నాకెందుకట ఇప్పుడే అది ఇంకా చాలా లైఫ్ ఉందిగా బాబా వీటన్నింటికీ సమాధానమే కాదు ధ్యానం గురించి సరైన స్ఫూర్తి ఒక స్పష్టమైన దారి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో నువ్వు ఎప్పుడూ వినని విధంగా అర్థం చేయిస్తాను పూర్తిగా చూడు వీడియోను అంతే ఈ వీడియో చూసి నువ్వు ధ్యానం ఏమి చేయక్కర్లేదు చేయాలనే చిన్న కోరిక నీలో కలిగినా నాకు చాలు నాన్న నువ్వు బాసింపట్లు వేసుకొని పక్కకు కూర్చోకున్నా అనుక్షణం ఈ ధ్యానం నీలో నడుస్తూనే ఉండే రహస్యం ఈ వీడియో ఆఖరిలో చెప్తా. ప్రతిఫలంగా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ ఏమీ నువ్వు చెయ్యక్కర్లేదు. కేవలం నీకొక నెక్స్ట్ లెవెల్ విషయం అర్థమైతే నీ గుండెల్లో ఒక మంచి ఫీలింగ్ నిండితే అదే బైరాగికి కానుకరా. ఒకటి ధ్యానం అంటే ఏంటి? రోజంతా నువ్వు ఆలోచిస్తూ పనులు చేస్తుంటావు. అవునా ఆలోచించేది మనసు మైండ్. మైండ్ చాలా శక్తివంతమైనది నీకు ఎన్నో చేసి పెడుతుంది. కానీ మనసు ఒక టూల్, పనిముట్టు. పనిముట్టు అనేది నువ్వు చెప్పినట్టు వినాలి. కానీ అది చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావు నీకు తెలియకుండానే. అదే ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకు సింగిల్ కారణం నాన్న. సరే మనసు చుట్టూరా చైతన్యం అనేది ఉంటుంది. చైతన్యమే పవర్ఫుల్ విశ్వశక్తి. ఆ చైతన్యంలో ఒక పార్ట్ మాత్రమే మనసు. ధ్యానం అంటే ఆ మనసులోంచి అడుగు బయటకు పెట్టి చైతన్య స్థితిలో వెళ్లి కూర్చోవడమే. చైతన్యం మాస్టర్, మనసు సర్వెంట్. కానీ ఇప్పటివరకు రివర్స్ లో ఉంది ఆ బంధం. దాన్ని సరిచేసే ప్రాక్టీసు సాధనే ధ్యానం అంతే ధ్యానం చేస్తే ఏదో వస్తుందట నిజమేనా ఏమో బాబా సనాతన ధర్మంలో ఋషులు వేల ఏళ్లుగా వందల లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళను నువ్వు ఒకసారి తలుచుకో ఉతుర్త మాటలు అబద్దాలు చెప్పేవారిలా కనిపిస్తారా వారు కనిపించరు మరి. పోనీ సనాతనులేనా అంటే కాదు ప్రపంచంలో దాదాపు ప్రతి ప్రాచీన సంప్రదాయం కూడా ధ్యానం వల్ల దేవుడే అనుభవంలోకి వస్తాడు అంటున్నాయి. బుద్ధిజం, జైనిజమ్, క్రిస్టియానిటీ, జుడైజం ఇవన్నీ కూడా ఇంతకుముందు నువ్వు చేయలేనివి ఎన్నో ధ్యానం చేస్తే చెయ్యగలవు అంటున్నాయి. ఏమో ఇది నిజమే కావచ్చు కానీ ఎందుకు నమ్మాలి వీళ్ళని నమ్మద్దు నమ్మక్కర్లేదు. కానీ బాబా ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమే అయితే తప్పకుండా నువ్వు ఏదో పెద్ద మేటర్ ని మిస్ అవుతున్నావు అని అర్థం. కనుక స్వయంగా అది నిజమో కాదో నీ సొంత అనుభవంతో తెలుసుకుంటే బెస్ట్ కదా తెలివిగలవాడు ఎప్పుడైనా ఇలాగే ఆలోచిస్తాడు మరి. ధ్యానం చేయమంటే నాకు ఎందుకు బోర్ కొడుతుంది చిన్న లాజిక్ ఉంది బాబా ఇక్కడ ఏళ్ల తరబడి పొద్దుగూకులు నువ్వు ఒక పని చేస్తూనే ఉన్నావు ఏంటది ఆలోచన ఆలోచన లేని ఒక్క క్షణం ఉంటుందేమో నిన్ను నువ్వు ఒక రోజంతా గమనించుకొని నాకు చెప్పు ఆలోచిస్తూ ఉండడం అంటే మనసులో పడి కొట్టుకుపోవడం అనగా మనసు నిన్ను రోజంతా తనతో తిప్పుకుంటూ ఉంటుంది. అందువల్ల నువ్వు మనసువి కావు నువ్వు వేరే ఇంకేదో అనే విషయమే నీకు తెలియదు నిన్ను తిప్పుకుంటున్న ఈ మనసుకు ఉన్న ఒక తత్వం బోర్ బోర్ కొట్టేది నీ మనసుకు బాబా నీకు కాదు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఆలోచిస్తూ ఉండాలి మనసుకు లేకపోతే బోర్ అనే భావన నీకు ఇస్తుంది అది నిన్ను రెస్ట్ లెస్ గా మార్చి ఏమీ తోచని చికాకునిస్తుంది. అందుకే ధ్యానం అంటే మనకు బోర్ కానీ నువ్వు మనసువు కాదు పది క్షణాల్లో బోర్ ని దాటి అవతలకు అడుగు వేసే శక్తి నీకు ఇప్పటికే ఉంది. ఎందుకంటే నువ్వు చైతన్యానివి కనుక ధ్యానం అంతా ముఖ్యమైతే నాకు మాక్స్ కంటే ముందు దాన్నే స్కూల్లో ఎందుకు నేర్పలేదు ఎందుకు నేర్పలేదు బాబా మన హిందూ సంప్రదాయాల్లో గురుకులాల్లో ధ్యానమే ప్రధానంగా నేర్పేవారు చిన్న పిల్లలకు అయితే ఇప్పటి ఇంగ్లీష్ స్కూళ్లు బ్రిటిష్ వారు తయారు చేశారు. నిన్ను ఒక క్లర్క్ గా ఒక యంత్రంగా తయారు చేసేందుకే ఈ స్కూల్ డిజైన్ చేయబడింది. బ్రిటిష్ వారి చేత ధ్యానం చేసిన వారికి ఒక ప్రాథమిక శక్తి వస్తుంది. దానివల్ల సమాజంలో కొన్ని శక్తుల కంట్రోల్ లో నువ్వు ఉండవు. నిన్ను నీకు తెలియకుండా కంట్రోల్ చేసేందుకు నిన్ను ఒక విధానంలో పెంచి పెద్దవాడిని చేశారు నాన్న. నువ్వు ధ్యానం చేస్తే వారికి నష్టం బాబా. అందుకే స్కూళ్లన్నీ ప్రప్రథమంగా లెఫ్ట్ బ్రెయిన్ అనగా నీ లాజిక్ కు మాత్రమే శిక్షణ ఇచ్చే విధానాలుగా మలచారు వాళ్ళు. ధ్యానం వారి కుట్రను సమూలంగా నాశనం చేస్తుందని వారికి తెలుసు. కనుకే నీకు ధ్యానం నేర్పబడలేదు. నాకెందుకు ఇప్పుడే ఈ ధ్యానం. ఇంకా టైం ఉంది కదా బాబా వయసు ఎంత లేతగా ఉంటే మనసు అంత లేతగా ఉంటుంది. ముదరని మనసు ముదరని శరీరం చైతన్యానికి కనెక్ట్ అవ్వడం సులువు. వయసు ఎంత చిన్నదైతే ఎనర్జీ పారుదల అంత బాగుంటుంది. అందుకే ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత బాగా వస్తుంది ధ్యానం. అలాగే బాబా ధ్యానం చేస్తే వచ్చే ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి చాలా బాగుంటుంది. అది అలవాటైతే ఇంకా మొదలబుద్ది కాదు. తాగుబోతులు, గాంజా కొట్టే వారితో అవధూతలు అంటుంటారు బాబా మేము ఉన్న నశాతో పోలిస్తే నీ నశా ఎంతరా చీమంత నాన్న ధ్యానం లోతుల్లోకి వెళుతుంటే ఆ ఆనందపు మత్తు రావడమే కాదు చాలా భయాలు పోతాయి. లోకం ఎంతో కలర్ ఫుల్ అవుతుంది. స్వేచ్ఛ అంటే ఏంటో తెలుస్తుంది అని గురువులు అంటున్నారు కదా. మరి ముసలితనం వచ్చాక ధ్యానం చేస్తే ఆ ఆనందం అంతా అనుభవించడానికి నీకు ఇంకా ఎంత టైం మిగిలి ఉంటుంది? ఒకవేళ ధ్యానం వల్ల జీవితం నిజంగా అలా మారేది ఉంటే ముసలితనం వరకు వేచి ఉండడం వల్ల ఎన్ని ఏళ్ళు వేస్ట్ చేసినట్టు అవుతుంది నువ్వు మూర్ఖత్వానికి పీక్ అవుతుంది బాబా అది. ఆ అంతేనా కాదా? ధ్యానం చేసే పద్ధతులు ఏవి? విజ్ఞాన భైరవ తంత్రంలో శివయ్య జగన్మాతకు 112 ధ్యానం చేసే పద్ధతులు చెప్పారు. ఓషో గురువుగారు వందల టెక్నిక్స్ చెప్పారు. రమణ మహర్షి గురువుగారు మహా అవతార్ బాబాజీ గురువుగారి దగ్గర మొదలుకొని వేల మంది గురువులు వేల మార్గాలు చెప్పారు. పైగా భక్తి మార్గం, యోగ మార్గం, మంత్ర మార్గం ఇలా ఎన్నెన్నో మార్గాల్లో ఎన్నెన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావ్ అనుకో అయినా నువ్వు చివరికి వాటన్నిటిని కలిపి నీకంటూ నువ్వు ఒక పద్ధతికి సెటిల్ అవుతావు. అందుకే ఓషో గురువు గారు అంటారు ఎంతమంది మనుషులు ఉన్నారో ధ్యానానికి అన్ని మార్గాలు ఉంటాయి అని బాబా ఏదైనా ఒక మార్గాన్ని ఎన్నుకొని కనీసం 90 రోజులు లేదా 180 రోజులు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఒకే స్థలంలో ఒకే సమయానికి కచ్చితంగా ధ్యానం చేసి ఒక పద్ధతి నీకు బాగుందో లేదో నువ్వే తెలుసుకోవాలి. పూర్వంలా గురువు నీడలో నువ్వు ఉంటే నీ తత్వాన్ని గ్రహించి నీకు తగిన సాధన ఆయనే ఇచ్చి ఉండేవారు. అలాగే నువ్వు తమోగుణ ప్రధానమై ఉంటే అంటే బద్ధకం మెల్లిగా కదలడం ఇట్లాంటివి ఉంటే నీకు ఒక రకమైన పద్ధతి పనిచేస్తుంది. ఎప్పుడూ రెస్ట్లెస్ గా రజోగుణ ప్రధానమం అయితే మరో పద్ధతి సత్వగుణ ప్రధానంగా నువ్వు ఉంటే ఇంకొక పద్ధతి నీకు సెట్ అవుతుంది. మరి ఏ ధ్యానం చేయాలి ఏ పద్ధతిలో అయినా సరే చేరేది ఒకే స్థితికి కొండ మీదికి అంటే మనసు అవతల ఉండే స్థితికి కుండలినిలో శక్తి చాలనాన్ని అభ్యాసం చేస్తావు. క్రియా యోగంలో సర్రున ఊర్జను పైకి లాగుతావు. భక్తి మార్గంలో నీ దేవుడి మీద నీ ప్రేమే నీ సాధన. రాజయోగంలో సులువుగా మనసుకు ఆవల నిలవడం, విపాసనలో శ్వాస మీద దృష్టి నిలిపి ఉంచడం సాధన చేస్తావు. ఏ పద్ధతి అయినా సరే మనసును దాటించి నిన్ను అవతలకు తీసుకువెళ్లి నిలబెడుతుంది. ఏదైనా సరే మూలాధారంలో ఉన్న జగన్మాత శక్తిని ఆజ్ఞకు చేరుస్తుంది. ఏదైనా సరే నీ నాడీ మండలాలు శుద్ధి చేసి బ్లాకులు తొలగించి స్వచ్ఛమైన వైబ్రేషన్ను నీకు ఇస్తుంది. బాబా ఏ సాధన అయినా సరే నిన్ను వర్తమానంలో స్థితం చేస్తుంది. కనుక నువ్వు ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని క్రమం తప్పకుండా సాధన చేసి అనుభవంతో తెలుసుకో ఈ ధ్యానం నీకు అవసరమా టైం వేస్ట అని. ఇప్పుడు ఏదో ఒక మార్గం చెప్పు బైరాగి అని నువ్వంటే సంగీతాన్ని వింటూ శ్వాస మీద ధ్యాస సాధన చేయి అని అంటాను నేను ఈ కాలంలో అది సులువు నాన్న నియమం తప్పక ఒక 90 రోజులు చేసి చూడు తర్వాత చూద్దాం ఏ నాది సరైన పద్ధతి అని చెప్పే తార్కాణాలు ఏవి ఏం లేదు బాబా ధ్యానం కుదురుతుంటే నీకు ఉల్లాసం, ఉత్సాహం ఒక మజా తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు పొద్దున అవుతుందా ఎప్పుడు ధ్యానంలో కూర్చుందామా అని రోజంతా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. రోజంతా నీకు ఏదో తెలియని ప్లెజెంట్నెస్ ఒంట్లో ఒక హాయి అయిన భావన ఉంటుంది. ఒక నిశశబ్దం నీతో పాటుగా నడుస్తూ ఉంటుంది. రోజంతా అది ఒక మంచి స్నేహితురాల్లా నీకు అనిపిస్తుంది. ఇంకా లోతుకు వెళ్తుంటే శరీరం తేలికగా బయట రంగులు ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తాయి. మరింత ముందుకు వెళితే ప్రేమగా ఉంటుంది లోపల. ఎవరి మీదో అర్థం కాదు ఎందుకో తెలియదు. ఏ వస్తువు ఏ మనిషి ఏ జీవాన్ని చూసినా ప్రేమగా అనిపిస్తుంది. ఆ ప్రేమ కన్నుల్ని తడిపేస్తుంది. చిరునవ్వు అదే పనిగా నీ పెదవుల మీద నాట్యమాడుతూ ఉంటుంది. నీ ముఖంలో ఒక కాంతి వస్తుంది. చూసే వాళ్ళు గుర్తుపట్టి నీకు చెప్తారు. నీ కళ్ళు తేటపడి చంటి పిల్ల కళ్ళలా ఫ్రెష్ గా ఉంటాయి చూడడానికి. నీ నడక నాట్యంలా అనిపిస్తుంది ఏదో తెలియని రిథం ఉంటుంది. ఉండుండే ఒక్కసారిగా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఊరికి ఆనందం ఆపుకోవడం అసాధ్యమైనప్పుడు అలా అనిపిస్తుంది. బాబా బెంగాళీ బౌల్ సాధకులు మీరాబాయి వంటి భక్తి మార్గ సాధకులు జడలు భస్మం ధరించిన శివ సాధకులు భగవంతుడు అంటేనే ప్రేమ అని పాటలు పాడుతూ తిరిగే తురక సూఫీ బాటసారులు వీరందరూ నాట్యాలు చేస్తూ పాడుతూ ఉంటారు ఆ స్థితి అదే ఆనందమయ స్థితి. అన్న ఇంటర్నెట్ లో ఆనందమోయిమా అనే గురువుగారిని సర్చ్ చేసి చూడు భగవంతుడు అంటే నిజమైన ప్రేమ ఒక మనిషిలో పుడితే ఆ మనిషి ఎలా కనపడుతుందో నువ్వు ఆమె ముఖంలో ఆమె కళ్ళల్లో చూడొచ్చు నాన్న ఆహా అయితే బాబా ఇటువంటివి నీకు అనుభవంలోకి వస్తే నువ్వు ఎంచుకున్న పద్ధతి నీకు మ్యాచ్ అవుతోంది అన్నమాట ఇవేమీ రాకపోయినా నీలో ఒక లోతైన నిశ్శబ్దం ప్రశాంతత ప్లెజెంట్ నెస్ వచ్చినా అది నీ మార్గమే చేస్తూ వెళ్ళు సాధన మనసు చైతన్యం చైతన్యం అనేది ఒక స్క్రీన్ లాగా నీ శరీరం లోపల వెనక్కి ఒక సినిమా స్క్రీన్ లాగా ఉందనుకో దాని ముందు ఒక బొమ్మలాట నడుస్తుంది. ఆ బొమ్మలాటే ఆలోచన మనసు నువ్వు ఆ బొమ్మలాటలో తలకాయ దూరిస్తే ఆ బొమ్మలాటే నువ్వు అనుకొని బతుకుతుంటావు. ధ్యానం వల్ల ఆ బొమ్మలాటలోంచి నువ్వు తలకాయ బయటకు తీసి నువ్వు బొమ్మలాటవి కాదు నువ్వు ఈ స్క్రీన్ వి ఈ చైతన్యానివి అని అర్థం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది. ఇది తెలిసాక ఎన్నెన్నో డైమెన్షన్స్ తెరుచుకుంటాయి నీకు అని ఎందరో అనుభవంతో చెప్పారు. అది నిజమో కాదో నువ్వే తెలుసుకోవాలి. త్రివిక్రం చెప్పినట్టు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. బాబా అలాగే ఒక్కో కాలంలో ఒక్కో విషయాన్ని ఒక్కో రకంగా చెప్పాలి. రాముడి కాలంలో ప్రశాంతంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక విషయాన్ని ఒక విధంగా వివరిస్తావు. ఇప్పుడు మొబైల్స్ పట్టుకొని తిరుగుతుండే జనానికి అదే విధంగా వివరిస్తే అర్థం కాదు ఎక్కదు అందుకే వేరు వేరు కాలాల్లో వేరు వేరు సందేశాలతో వేరు వేరు గురువులు వచ్చారు. వారందరూ చెప్పేది నిజానికి ఒక్కటే అలాగే ఈ కాలంలో వచ్చిన మహానుభావుల్లో పశ్చిమ దేశాల్లో జన్మ తీసుకున్న గురువు ఎక్కాట్ టోల్ గురువుగారు. ఆయన చెప్పిన మూడు సులువైన పనులు నీకు చెప్తాను. రోజు చేసే ఉదయం సాధన కాకుండా ఈ మూడింటిలో ఒకటి నువ్వు రోజంతా పనులు చేసుకుంటావు కదా ఆ టైంలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి అద్భుతమైన బెనిఫిట్ ని ఇస్తాయి నాన్న. నీ ధ్యాన స్థితికి శక్తి చేకూరుతుంది వీటివల్ల ఉదయం చేసే ధ్యానానికి ఊతాన్ని ఇస్తాయి. ఒకటి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నాపై వీలుంటే కదలకు. నీ రెండు చెవుల మధ్యలో తల లోపల ఏం వినపడుతుందో దృష్టి పెట్టి విను. నీ శరీరం అంతటా కూడా ఏం వినపడుతుందో విను. ముఖ్యంగా గుండెల్లో నిశ్శబ్దం వినపడుతుంది. అవును సైలెన్స్ వినపడుతుంది. అదెలా అని నువ్వు అడగక్కర్లేదు. ఇప్పుడే ఒకసారి కళ్ళు మూసుకుంటే నీ లోపల ఆలోచనలు నడుస్తున్నాయో లేదో ఒకసారి లోపలికి వెళ్లి చూసి చెప్పు నాకు. కనిపించాయా ఆలోచనలు కనిపించవు. కానీ బహుశా నీకు ఒక నిశ్శబ్దం వినిపించి ఉండాలి. ఆ నిశ్శబ్దమే నీ చైతన్యానికి తాళం చెవి. ఆ నిశ్శబ్దం ఎంతసేపు వింటే అంతసేపు నువ్వు వర్తమానంలో ఉంటావు. అలాగే బాబా నీ చుట్టూరా అన్ని వినపడుతున్నాయి కదా శబ్దాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఒక ఖాళీలో ఉన్నాయి నిజం ఒక రోజా పువ్వు బొమ్మ వేసి ఉంది ఆ బొమ్మ ఎక్కడుంది పేపర్ మీద బొమ్మ ఉండడానికి అది నిలిచే ఒక పేపర్ దాని చుట్టూ కింద ఉండడం అవసరం కదా అలాగే ఒక శబ్దం వినిపిస్తుంటే ఆ శబ్దం ఒక ఖాళీలో పుట్టి మాయం అవుతుంది. ఆ ఖాళీని విను తాన్నే నిశశబ్దం అని పిలుస్తున్నావు అంతే బాబా నిజానికి సులువుగా వినగలవు ఇది ఎందుకంటే నీ ఉనికే ఆ నిశశబ్దం. రెండు నేను ఉన్నాను అనే భావనను గమనించు. ఎలా అంటే ఒకసారి నీ శరీరం మాయమైనట్టు కల్పన చేయి నువ్వు ఉన్న కుర్చీ ఖాళీ అయిపోయింది. నువ్వు లేవు అందులో. నీ శరీరం మాయం అయ్యాక నేను ఇంకా ఉన్నాను అనే భావన ఉందే ఉందా? ఆ అదే నీ ఉనికి భావన. నీ చైతన్యం అంటే అదే ఆ భావనలో వీలైనంత సేపు ఉండి మళ్ళీ పనులు చూసుకుంటూ ఉండు మధ్య మధ్యలో రోజంతా ఇంకా ఏదైనా పని చేస్తున్నా ఆ భావన ఉంచుకొని చేయవచ్చు సాధ్యమే ఈ ఉనికి భావన కూడా నిన్ను వర్తమానంలో స్థితం చేస్తుంది బాబా వర్తమానమే ఇంతవరకు రహస్యంగా ఉన్న పోర్టల్స్ తలుపు తెరుస్తుంది. మూడు, అంతః శరీర శక్తి క్షేత్రం. మీ శరీరాన్ని కాళ్ళ నుంచి తల వరకు గమనించు. కళ్ళతో కాదు మనసుతో శరీరం లోపలి నుంచి భావన ద్వారా పాదాల్లోకి వెళ్ళు. అక్కడి నుంచి తల వరకు గమనిస్తూ పైకి రా. ఇప్పుడు శరీరాన్ని మొత్తం లోపల నుంచి గమనించుకో. ఒక సన్నటి మెత్తటి ప్రకంపన, ఒక వైబ్రేషన్ శరీరం అంతటా నీకు తెలుస్తుంది. దాన్నే అంతః శరీర శక్తి క్షేత్రం అన్నారు. ఈ అంతః శరీర శక్తి క్షేత్రాన్ని గమనిస్తూ ఉంటే అలా ఉన్నంత కాలం నీ కాలం వర్తమానం. నాన్న ఈ మూడు పద్ధతులు నిన్ను వర్తమానంలో స్థితం చేస్తాయి. అంటే ధ్యానం చేస్తే ఏ స్థితి వస్తుందో ఆ స్థితికి క్షణాల్లో చేరుకునే శక్తి ఈ మూడు ఎకాటోల్ గురువుగారి పద్ధతులు నీకు సులువుగా ఇస్తాయి. 

బాబా ఇప్పుడు ఒక బోనస్ రహస్యాలకే రహస్యం చెప్తా విను. ఇది నీ ధ్యానం జర్నీలో బాగా ఉపయోగపడుతుంది. ఒకటి నువ్వు ధ్యానం చేసేప్పుడు ఆలోచనలు ఆగి మనసుకు అవతలకు వెళ్తావు. అలా కొద్ది క్షణాలే ఉండొచ్చు. మళ్ళీ మనసులోకి వచ్చేసి ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడే నాకు ధ్యానం సరిగ్గా కుదరట్లేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే మనసు ఆలోచనలు ఆగిన గ్యాప్ అంటే మనసుకు అవతలకు వెళ్ళిన ఆ క్షణాల మీద దృష్టి పెట్టు ఆ క్షణాలు పెద్ద కానుకరా నీకు ఆలోచనలు మొదలయ్యాయి అని తెలియగానే మళ్ళీ తిరిగి వర్తమానంలోకి వస్తావు. కాసేపు మనసుకు అవతలకు వెళ్తావు. ఇలా మెల్లిగా మనసుకు ఆవల ఉండే కాలం పెరుగుతూ వెళుతుంది. రెండు, మనసును దాటి ఆలోచన లేకుండా ఉండడం. నీ లోపల ఒక చిన్న ట్రిక్ అంతేరా ఆ ట్రిక్ దొరికేందుకే మెడిటేషన్ లో ఈ టెక్నికులన్నీ ఎప్పుడైతే అది దొరికిందో అక్కడ ఉండిపోతావు. టెక్నిక్ పద్ధతిని మర్చిపోతావ్ వదిలేస్తావ్ అదే చేయాలి. ఎప్పుడైతే అవేర్నెస్ చైతన్యంలో నువ్వు స్థితమవుతావో అక్కడికి తీసుకువెళ్ళిన టెక్నిక్ రాలిపోతుంది వదిలేయాలి అని ఓషో గురువుగారు చెప్తారు. ఇంక నీకు దాని అవసరమే ఉండదు. ఎందుకంటే ఏ టెక్నిక్ అయినా నిన్ను అక్కడికి చేర్చేందుకే ఒడ్డుకు చేరాక పడవక్కర్లేదు. నీ దారిన నువ్వు నీ ఉన్నత స్థితులకు సాగిపోతావు. ఏమో భగవంతుడు ధర్మం ధ్యానం ఇటువంటి బోరింగ్ మాటల్లో నిజం ఉందేమో స్వయంగా తెలుసుకుంటే నష్టం ఏముంది మహా అయితే 30 నిమిషాలు ఒక 90 రోజులు అంతే కదా ప్రయత్నిద్దామా బాబా విజయోస్తు  జై భారత్ జై శ్రీరామ్ జై గురుదేవద


No comments:

Post a Comment